(Local) Sat, 24 Jul, 2021

అనుమానాస్పద స్థితిలో భారత మాజీ క్రికెటర్ మృతి

August 16, 2019,   11:55 AM IST
Share on:
అనుమానాస్పద స్థితిలో  భారత మాజీ క్రికెటర్ మృతి

భారత మాజీ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాట్స్ మన్, తమిళనాడు క్రికెట్‌ కు ఎంతోకాలం సేవలందించిన వీబీ చంద్రశేఖర్, అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా చెన్నైలోని తన నివాసంలో కనిపించగా, పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. 57 ఏళ్ల చంద్రశేఖర్, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కలేక ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటుతూ 43.09 స్ట్రైక్ రేటును  నమోదు చేశారు. చంద్రశేఖర్ మరణవార్త క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. బీసీసీఐతో పాటు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తదితరులు సంతాపం తెలిపారు.

తమిళనాడు ఓపెనర్‌ గా చంద్రశేఖర్ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడారు. దూకుడుగా ఆయన ఆడే విధానానికి క్రికెట్ అభిమానులు ముగ్ధులయ్యేవారు. 1988-89 ఇరానీ కప్‌ మ్యాచ్‌ లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2012లో ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించిన ఆయన తమిళనాడు కోచ్‌ గా, భారత జట్టు సెలక్టర్‌ గా పనిచేశారు.

సంబంధిత వర్గం
ఢిల్లీలో బంగ్లా క్రికెటర్లు వాంతులు
ఢిల్లీలో బంగ్లా క్రికెటర్లు వాంతులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.