(Local) Mon, 18 Nov, 2019

మాజీ క్రికెటర్‌ పేరున ఫేస్‌బుక్‌ ఖాతా..

August 28, 2019,   3:13 PM IST
Share on:
మాజీ క్రికెటర్‌ పేరున ఫేస్‌బుక్‌ ఖాతా..

మాజీ క్రికెటర్‌,బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌, సందీప్‌ పాటిల్‌ పేరుతొ ఓ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచి బీసీసీఐలోని పెద్దల ఫోన్‌ నంబర్లను అడుగుతున్నాడు. స్నేహితుడు ద్వారా ఈ విషయం తెలుసుకున్న సందీప్‌ పాటిల్‌ సంబంధిత ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 సందీప్‌ పాటిల్‌ పేరుతొ ఓ వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి పాటిల్‌ స్నేహితుడు ఆనంద్‌ యల్విజీకి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు. మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్స్‌ 13 మంది ఉండడంతో అతను రిక్వెస్ట్‌ దృవీకరించాడు. వెంటనే మాజీ క్రికెటర్లు, బీసీసీఐలోని పెద్దల ఫోన్‌ నంబర్లు అడిగాడు. అనుమానం వచ్చిన ఆనంద్‌ తన మిత్రుడు పాటిల్‌కి ఫోన్‌ చేయడంతో విషయం తెలిసింది.

ఆనంద్‌ మాట్లాడుతూ... 'పాటిల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ వచ్చింది. మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్స్‌ 13 మంది ఉన్నారు. దీంతో రిక్వెస్ట్‌ అంగీకరించా. వెంటనే బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి ఫోన్ నెంబర్ అడిగాడు. ఆ తర్వాత డయానా ఎడుల్జీ నంబర్‌ అడిగాడు. ఆపై నా నంబర్‌ కూడా అడిగాడు. నేను ఇచ్చాను. కానీ.. ఛాటింగ్‌ శైలి చూస్తుంటే అనుమానం వచ్చి పాటిల్‌కు ఫోన్‌ చేయడంతో విషయం తెలిసింది. వెంటనే సదరు ఖాతాను బ్లాక్‌ చేశా' అని ఆనంద్‌ తెలిపాడు.  

పాటిల్ మాట్లాడుతూ... ఆగస్టు 19న శివాజీ పార్క్‌ జింఖానా మైదానం వద్ద మిత్రులతో ఉన్న సమయంలో ఆనంద్‌ ఫోన్ చేసాడు. తన పేరుతో నకిలీ ఖాతా ఉందని తెలియడంతో ఆశ్చర్యపోయా. తనకెలాంటి సోషల్‌ మీడియా ఖాతాలు లేవని అతడికి చెప్పా. తన మిత్రుల నంబర్లు ఎందుకు అడుగుతా' అని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐకి సైతం ఇదే విషయం స్పష్టం చేశాడు. నకిలీ ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వర్గం
అకౌంట్‌లో నగదు లేకపోవడంతో షాక్ తిన్న భారత మహిళా క్ ...
అకౌంట్‌లో నగదు లేకపోవడంతో షాక్ తిన్న భారత మహిళా క్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.