(Local) Wed, 24 Jul, 2019

ప్రపంచ కప్ : సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

July 04, 2019,   12:13 AM IST
Share on:

పంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. రన్‌రేట్ మెరుగ్గా ఉండడం కివీస్‌కు కలిసి వచ్చే అంశం. కాగా, కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. ఓపెనర్ బెయిర్ స్టో (106) మరోసారి శతకంతో చెలరేగాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్‌కు ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (౦), మార్టిన్ గుప్టిల్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.

ఆ తర్వాత న్యూజిలాండ్ ఏదశలోనూ పుంజుకోలేక పోయింది. ఇంగ్లండ్ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. కెప్టెన్ విలియమ్సన్ (27), రాస్ టైలర్ (28) కూడా జట్టును ఆదుకోలేక పోయారు. ఒంటరి పోరాటం చేసిన టామ్ లాథమ్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, బైర్‌స్టోలు మరోసారి శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయ్ 8 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. మరోవైపు బైర్‌స్టో 99 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ మోర్గాన్ 8 ఫోర్లతో వేగంగా 48 పరుగులు సాధించాడు. మిగతావారు పెద్దగా రాణించలేక పోయారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.