(Local) Wed, 24 Jul, 2019

భారత్ పై ఇంగ్లాండ్ మొదటి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం

July 01, 2019,   2:39 PM IST
Share on:

వరల్డ్‌కప్‌లోని లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్లు వీరవిహారం చేశారు. తొలి వికెట్‌కు ఏకంగా 160 పరుగులు జోడించారు. 57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రాయ్‌ 66 పరుగులు చేయగా 76 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో బెయిర్‌స్టో 89 పరుగులు చేసి మొదటి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  ఓపెనర్లుగా వచ్చిన రాయ్‌, బెయిర్‌స్టోలు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బెయిర్‌స్టో ఇండియా బౌలర్లను ఆటాడుకున్నాడు. ఇక.. రికార్డుల విషయానికొస్తే ఈ ప్రపంచకప్‌లో భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమ తొలి వికెట్‌ పార్ట్‌నర్‌షిప్‌.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.