(Local) Fri, 05 Jun, 2020

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కి అసిస్టెంట్‌ కోచ్‌గా మెక్‌కలమ్‌..!

August 09, 2019,   7:15 PM IST
Share on:
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కి అసిస్టెంట్‌ కోచ్‌గా మెక ...

ఐపీఎల్‌ లోకి న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ మళ్లీ అడుగుపెట్టనున్నాడు. ఐతే ఆటగాడిగా కాదు క్రికెటర్లకు మార్గదర్శనం చేసేందుకు కోచ్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌)తో అతడు జట్టు కట్టనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అపార అనుభవజ్ఞుడైన మెక్‌కలమ్‌ సేవలను వినియోగించుకోవాలని కేకేఆర్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాకు అసిస్టెంట్‌ కోచ్‌గా మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ను నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం కోల్‌కతా సహాయ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ సైమన్‌ కాటిచ్‌ కొనసాగుతున్నారు. అలాగే, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు మెక్‌కలమ్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. సీపీఎల్‌ నైట్‌రైడర్స్‌ జట్టుకు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు.ఆరంభ ఐపీఎల్‌ సీజన్‌లో మెక్‌కలమ్‌(158 నాటౌట్‌) కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మెక్‌కలమ్‌ 101 టెస్టుల్లో 6,453 పరుగులు చేయగా అత్యధిక స్కోరు 302 కావడం విశేషం. మొత్తం 260 వన్డేల్లో 6083 రన్స్‌ చేశాడు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.