(Local) Tue, 27 Oct, 2020

స్విమ్మింగ్‌ అకాడమీ నెలకొల్పనున్న ఆస్ట్రేలియా స్విమ్మింగ్‌ లెజెండ్‌

September 26, 2019,   1:35 PM IST
Share on:
స్విమ్మింగ్‌ అకాడమీ నెలకొల్పనున్న ఆస్ట్రేలియా స్వి ...

ఆస్ట్రేలియా స్విమ్మింగ్‌ లెజెండ్‌ స్టెఫానీ రైస్‌ భారత్‌లో తన సొంత స్విమ్మింగ్‌ అకాడమీ నెలకొల్పనుంది. 2024, 2028 ఒలింపిక్స్‌లో భారత స్విమ్మర్లు పతకాలు సాధించాలన్న లక్ష్యంతో ఆమె ఈ అకాడమీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించింది. స్టెఫాన్‌ రైస్‌ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియాకి వచ్చిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ..." ఆస్ట్రేలియాలోని ప్రతి ఒక్క కోచ్‌ కూడా ట్రైనింగ్‌ తీసుకున్న వారే. మైకేల్‌ ఫిలిప్స్‌, నా కోచ్‌ మైకేల్‌ బోల్‌ ఎలాగైతే కోచింగ్‌ తీసుకున్నారో అలాగే. వారు ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌లు వారి అథ్లెట్లను ఎలా తీర్చిదిద్దుతారో చూశారని అన్నారు. ఈకారణం చేతనే నేను నా సొంత అకాడమీని నెలకొల్పాలని భావించా. ఇందులో భాగంగా హైలెవల్‌ కోచ్‌లను ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నా. భారత స్విమ్మర్లకు సరైన శిక్షణ ఇస్తే మెరుగవుతారు. భారత్‌లో స్విమ్మింగ్‌కు ఎంతో ఆదరణ ఉంది. ఇక్కడ ప్రతిభావంతులకు కొదవలేదు. వారిని గుర్తించి సానబెట్టాలని స్టెఫానీ రైస్‌ తెలిపింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత స్టఫానీ రైస్‌కు మూడు షోల్డర్‌ సర్జరీలు జరిగాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.