(Local) Wed, 18 Sep, 2019

అంబటి రాయుడు యూటర్న్

August 25, 2019,   12:09 PM IST
Views: 84
Share on:
అంబటి రాయుడు యూటర్న్

ఈ ఏడాది జులైలో రిటైర్మెంట్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్న క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ లో రాయుడును ఎంపిక చేయకపోవడంతో నిరాశ చెంది అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అనుభవం ఉండి, గొప్ప షాట్లు ఆడే రాయుడు ప్రతిభ ఐపీఎల్ ద్వారా ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంత గొప్ప ప్లేయర్ ను ప్రపంచ కప్ కు పక్కన పెట్టడంతో బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయాల పాలు కావడంతో అందరూ రాయుడిని జట్టులోకి తీసుకుంటారని ఊహించారు. కానీ మయాంక్ అగర్వాల్ ను తీసుకుంటున్నట్లు చెప్పడంతో మనస్తాపానికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేశాడు. అయితే టీఎన్సీఏ టోర్నమెంట్ లో గ్రాండ్ శామ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఐపీఎల్లో రాణించి తానేంటో ప్రూవ్ చేసుకుంటానని రాయుడు తెలిపాడు.

సంబంధిత వర్గం
నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్
నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.