(Local) Mon, 12 Apr, 2021

పీవీ సింధుతో పెళ్లి చేయాలని 70 ఏళ్ల వృద్ధుడి విజ్ఞప్తి

September 18, 2019,   12:13 PM IST
Share on:
పీవీ సింధుతో పెళ్లి చేయాలని 70 ఏళ్ల వృద్ధుడి విజ్ఞ ...

తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడు కలెక్టర్ కు ఓ వింత పిటిషన్ ఇచ్చాడు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో తన వివాహం జరిపించాలని కోరాడు. తన అందం, ఆటతీరు ఎంతగానో ఆకట్టుకుందని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి కలెక్టర్ కు చెప్పాడు. లేకుంటే పీవీ సింధును కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లి వివాహం చేసుకుంటానని తెలిపాడు. సింధును తన భాగస్వామిగా చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని సింధు, మలైస్వామి పోటోలను జతచేసి దరఖాస్తు పెట్టుకున్నాడు.

పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పుకొచ్చాడు. ఈ అభ్యర్థనపై కలెకర్ట్ తో పాటు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొస మెరుపు ఏంటంటే తన వయస్సు కేవలం 16 ఏళ్లేనని 2004, ఏప్రిల్ 4న జన్మించానని పేర్కొన్నాడు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

సంబంధిత వర్గం
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.