(Local) Mon, 12 Apr, 2021

నేడే దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టీ20

September 18, 2019,   3:30 PM IST
Share on:
నేడే దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టీ20

తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌ పూర్తిగా వర్షార్పణం కాగా కీలకమైన రెండో మ్యాచ్‌కు మొహాలీ వేదిక కానుంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉండదు కాబట్టి విజయమే లక్ష్యంగా పోరాడనున్నాయి.మొహాలిలో జరిగే రెండో టి20 మ్యాచ్ సాఫీగా సాగే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ కూడా వర్షం గురించి ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.

సిరీస్‌లో ఇరు జట్లు బోణీ కొట్టేందుకు తహతహలాడుతున్నాయి. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కానీ, యువ ఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే డేవిడ్ మిల్లర్, డికాక్, రబడా, డుసెన్, జూనియర్ డలా తదితరులు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇక, టీమిండియా కూడా రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించింది. బౌలింగ్ విభాగాల్లో సీనియర్లకు విశ్రాంతి కల్పించి యువకులకు అవకాశం కల్పించింది. ఒక్క హార్దిక్ పాండ్య మినహా మిగతా స్పీడ్‌స్టర్లకు పెద్దగా అనుభవం లేదనే చెప్పాలి. అయితే బ్యాటింగ్‌లో మాత్రం సీనియర్లు జట్టులో ఉన్నారు.

యువకులతో కూడిన దక్షిణాఫ్రికా జట్టుకు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ దేశ క్రికెట్‌ బోర్డు డుప్లెసిస్‌ను పక్కన పెట్టి డికాక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. డికాక్‌, మిల్లర్‌, వాన్‌డర్‌ డుస్సెన్‌, బవుమా బ్యాటింగ్‌లో.. రబాడ, ఫెలుక్వాయో బౌలింగ్‌లో చెలరేగి కోహ్లీ సేనను కట్టడి చేస్తే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.

జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయాస్‌, పంత్‌, హార్దిక్‌, క్రునాల్‌, జడేజా, వాషింగ్ట న్‌/రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, సైనీ.

దక్షిణాఫ్రికా:డికాక్‌ (కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్‌, బవుమా, వాన్‌డర్‌ డుస్సెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, బోర్న్‌ ఫర్టూన్‌/ఎన్‌రిచ్‌ నోర్టే, రబాడ, జూనియర్‌ దాలా, షంసీ.

సంబంధిత వర్గం
వరుస విజయాల కోహ్లి సేన...
వరుస విజయాల కోహ్లి సేన...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.