(Local) Fri, 22 Oct, 2021

రివ్యూ:విజిల్

October 25, 2019,   3:43 PM IST
Share on:
రివ్యూ:విజిల్

కోలీవుడ్ క్రేజి హీరో తలపతి విజయ్ హీరోగా, లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా తెరెకెక్కిన చిత్రం 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో ఈ మూవీ విడుదల చేస్తున్నారు.  ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అఘోరం కల్పతి సుబ్రమణ్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ ఎస్. కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. దర్శకుడు అట్లీ, విజయ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం విజిల్ దీపావళి కానుకగా ఈ రోజు విడుదలైంది. హిట్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను విజిల్ మూవీ ఎంత వరకు అందుకుందో సమీక్షలో చూద్దాం.

కథ: రాజ‌ప్ప‌(విజ‌య్‌) విశాఖ‌ప‌ట్నంలో ఓ రౌడీ. త‌న బ‌స్తీలోని ప్ర‌జ‌ల మంచి కోసం పాటుప‌డుతుంటాడు. రాజ‌ప్ప త‌న‌యుడు మైకేల్ అలియాస్ బిగిల్‌(విజ‌య్‌) చాలా పెద్ద ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. ఫుట్ బాల్ లేడీ టీం కోచ్ అయిన మైకేల్ మిత్రుడు ఓ సంఘటన వలన తీవ్ర గాయాలకు లోనవుతాడు, దీనితో మైఖేల్ ఆ లేడీ ఫుట్ బాల్ టీం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. లోకల్ రౌడీగా చలామణి అవుతున్న మైకేల్ ఫుట్ బాల్ టీం కోచ్ ఎలా అయ్యాడు?శ‌ర్మ‌(జాకీష్రాఫ్‌) ఎవ‌రు? చివ‌ర‌కు రాజ‌ప్ప క‌ల‌ను మైకేల్ ఎలా నేర‌వేర్చాడు? అతని సారథ్యంలోని ఫుట్ బాల్ టీం లక్ష్యం సాధించిందా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్: విజయ్ మాస్ ఇమేజ్ ని దర్శకుడు అట్లీ ఓ స్థాయిలో తెరపై ఎలివేట్ చేశారు. ఫుట్ బాల్ ప్లేయర్ గా మైదానంలో అతని వేగం, అలాగే ఎమోషనల్ సన్నివేశాలలో విజయ్ నటనతో కట్టిపడేస్తారు. యువకుడిగా , మధ్య వయస్కుడిగా రెండు భిన్న నేపధ్యాలతో నడిచే పాత్రలలో విజయ్ చూపించిన వైవిధ్యమైన నటన గురించి పొగడకుండా ఉండలేం. మొత్తానికి విజయ్ మూడు పాత్రల్లోనూ మెప్పిస్తాడు. క్రీడా నేప‌థ్యంలో సాగే సినిమాలు చాలా వ‌ర‌కు ర‌క్తిక‌ట్టిస్తుంటాయి. అట్లీ ఆట‌లోని భావోద్వేగాల‌కి తోడుగా.. మ‌హిళ‌ల‌కి సంబంధించిన మ‌రిన్ని సామాజికాంశాల్ని జోడించాడు. దాంతో రెండింతల భావోద్వేగాల‌తో ‘విజిల్‌’ ప్రేక్షకుల్ని క‌ట్టిప‌డేస్తుంది. న‌య‌న‌తార పాత్రకి ప్రథ‌మార్ధంలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ద్వితీయార్ధంలో మాత్రం ఆమె పాత్ర‌, న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఫుట్‌బాల్ స‌మాఖ్య ప్రెసిడెంట్ శ‌ర్మగా జాకీష్రాఫ్ మెప్పిస్తారు. ఆయ‌న పాత్ర నేప‌థ్యంలో వ‌చ్చే మ‌లుపులు చిత్రానికి ప్రధాన‌బ‌లం. రిచ్ విలన్ పాత్రలకు చక్కగా సరిపోయే బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన విలన్ పాత్రలో అలరించారు. అలాగే విజయ్ ప్రత్యర్థి టీం కెప్టెన్ పాత్ర చేసిన అర్జున్ బజ్వా నటన ఆకట్టుకుంది. తమిళ నేటివిటీ కి దగ్గరగా ఆ పరిస్థితులను ప్రతిబింబిస్తూ స్త్రీ సాధికారత గురించి చెప్పిన విధానం బాగుంది. తమిళ్ బిజీ కమెడియన్ యోగి బాబు మరియు వివేక్ ల కామెడీ ట్రాక్స్ బాగున్నాయి.  ఫస్ట్ హాఫ్ లోని ప్రీ ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ మెయిన్ హైలెట్స్‌.

మైనస్ పాయింట్స్: ఈ మూవీ ప్రధాన బలహీనత అందరికి తెలిసిన గత చిత్రాలను తలపించే కథను ఎంచుకోవడం.ఇక ఫ‌స్టాఫ్‌ను సోసోగా న‌డిపించిన అట్లీ కీల‌క‌మైన సెకండాఫ్‌లో మాత్రం ఆస‌క్తిక‌రంగా మలిచాడు.సినిమా ర‌న్ టైం ఎక్కువ కావ‌డంతో సాగ‌దీత స‌న్నివేశాలు ఎక్కువుగా ఉన్నాయి. అట్లీ ఇంకా టైట్‌ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల ఓవర్ గా అనిపించడం, సీన్స్ లాజిక్స్ లేకపోవడం వంటివి ఉన్నాయి.  అనువాదం విష‌యంలో మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. క‌థ‌లో న‌వ్యాంధ్రప్రదేశ్  జ‌ట్టు అని సంబోధిస్తుంటారు. స్కోరు బోర్డుపై మాత్రం త‌మిళ‌నాడు జ‌ట్టు అని క‌నిపిస్తుంటుంది. 

సాంకేతిక విభాగం: దర్శకుడు అట్లీ మరో మారు ఈ చిత్రంతో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. విజయ్ లాంటి స్టార్ హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా ఆయన కథలు ఎంచుకొనే విధానం, తెరపై చూపించే తీరు అద్భుతం. అట్లీ సామాజిక సందేశాన్ని జోడించిన తీరు, విజ‌య్‌లాంటి క‌థానాయ‌కుడిని దృష్టిలో ఉంచుకొని సినిమాని మ‌లిచిన విధానం ఆక‌ట్టుకుంటుంది.టెక్నిక‌ల్‌గా ఏఆర్‌.రెహ్మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ పెంచింది.తెలుగు డ‌బ్బింగ్ నిర్మాణ విలువ‌లు ఓకే. విష్ణు కెమెరా ప‌నిత‌నం సినిమాకి త‌గ్గ ప్రమాణాల‌తో ఉన్నాయి. సినిమా ఎడిటింగ్ కూడా అక్కడక్కడ ఇబ్బందిగా అనిపిస్తుంది.

తీర్పు:  “విజిల్” సినిమా చూసేందుకు ఈ వారాంతంలో మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

రేటింగ్‌: 3 / 5

సంబంధిత వర్గం
విజయ్ - లోకేష్ కనకరాజ్ స్టోరీ లీక్?
విజయ్ - లోకేష్ కనకరాజ్ స్టోరీ లీక్?
ఎన్టీఆర్ నాకు కాల్ చేసేవారు...అట్లీ
ఎన్టీఆర్ నాకు కాల్ చేసేవారు...అట్లీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.