
కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే హీరో విశాల్ తన తమిళ్ చిత్రాలను డబ్ చేసి తెలుగులో కూడా విడుదలచేస్తుంటాడు. తాజాగా ఈ యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్’. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ : సుభాష్(విశాల్) ఓ మిలటరీ కమాండర్. నాన్న ముఖ్యమంత్రి. అన్నయ్య ఉప ముఖ్యమంత్రి. సుభాష్ మరదల్ని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. ఈ సందర్భంగా జరిగే ఒక మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగి సుభాష్ తన ఫ్యామిలీలో చాలా మందిని పోగొట్టుకుంటాడు. ఈ బ్లాస్టింగ్ కి కారణం సుభాష్ కుటుంబమే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తాయి. ఇది తట్టుకోలేక సుభాష్ అన్నయ్య (రాంకీ) ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు ఆ బ్లాస్టింగ్ ఎందుకు జరిగింది..? సుభాష్ ఆ బ్లాస్టింగ్ కారకులను పట్టుకున్నాడా? ఈ క్రమంలో సుభాష్ కు తమన్నా ఎలాంటి సాయం చేసింది? ఇవి తెలియాలంటే యాక్షన్ సినిమా చూసి తీరాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : పేరుకు తగ్గట్టు సంపూర్ణమైన యాక్షన్ చిత్రమిది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ స్ చూస్తున్నంతసేపూ ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. విశాల్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఓ సైనికుడిగా, ఓ తండ్రికి కొడుకుగా, ప్రియుడిగా.. తన లక్ష్యాన్ని నెరవేర్చే పాత్రలో ఒదిగిపోయారు. తమన్నాకు ఇది కొత్త తరహా పాత్ర. ప్రథమార్ధంలో చాలా తక్కువే కనిపించినా, ద్వితీయార్ధంలో ఆ లోటు తీర్చింది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కూడా కనిపించిన ఆ కొన్ని లవ్ సీన్స్ లో కూడా చాల క్యూట్ గా బాగా నటించింది. ఇక సినిమాలో కీలక మైన పాత్రలో నటించిన రాంకీ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆకాంక్షా పూరి గ్లామరస్‌గా కనిపించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. సాయాజీ షిండే తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. మిగతా వారంతా కూడా తమ పాత్ర పరిధుల మేరకు మంచి ఔట్పుట్ ఇచ్చారు.
మైనస్ పాయింట్స్ : స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు అక్కడక్కడ తడబడ్డాడు. యాక్షన్ సీన్స్ హైలెట్ గా తీసినా కూడా యాక్షన్ లో టెంపోని మిస్ చేస్కున్నాడు.దర్శకుడు ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన యాక్షన్ తో నడిపినా.. ఆసక్తికరంగా సాగని సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను బోర్ గా నడిపారు. సినిమాలో కథ తక్కువ అవ్వడం యాక్షన్ ఎక్కువ అవ్వడం కూడా మైనస్. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు అక్కడక్కడ తడబడ్డాడు. సెకండాఫ్ కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపించాయి.
సాంకేతిక విభాగం : యాక్షన్ సినిమాలో ముందుగా అందరూ నోటీసు చేసేది నిర్మాణ విలువల గురించే. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ పరంగా బాగా ఖర్చు పెట్టారు. ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు హిప్హాప్ తమీజా మరోసారి బ్యాగ్రౌండ్ స్కోర్ చించేసాడు కానీ పాటలు మాత్రం బాగోలేవు. యాక్షన్ పొడుగు ఎక్కువైపోయింది. ట్రీమ్ చేసి ఉంటే.. బాగుండేదేమో అనిపించింది.
తీర్పు : యాక్షన్ చిత్రాన్ని యాక్షన్ జోనర్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు.
రేటింగ్: 3 / 5
-
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
15 Nov 2019, 2:18 PM
-
విశాల్ 'యాక్షన్' కి యూ/ఏ సర్టిఫికెట్...
14 Nov 2019, 8:08 PM
-
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
14 Nov 2019, 3:49 PM
-
విశాల్ 'యాక్షన్' ప్రీ రిలీజ్ ఈవెంట్...
08 Nov 2019, 4:57 PM
-
విశాల్ కి అనీషా విషెస్....లవ్ ఆల్వేస్
30 Aug 2019, 1:51 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: జార్జిరెడ్డి
22 Nov 2019, 2:57 PM
-
రివ్యూ: ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’
15 Nov 2019, 4:34 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
01 Nov 2019, 3:39 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
13 Sep 2019, 4:27 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
-
రివ్యూ: ఏదైనా జరగొచ్చు
23 Aug 2019, 4:48 PM

విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.