(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: తిప్పరామీసం

November 08, 2019,   4:08 PM IST
Share on:
రివ్యూ: తిప్పరామీసం

హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షుకుల మెప్పించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే హీరో శ్రీవిష్ణు. అతను చేసే సినిమాలు కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గానూ కాస్త డిఫరెంట్‌గానూ ఉంటాయి. రీసెంట్‌గా ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఈ సారి కాస్త మాసీగా ఉండే క్యారెక్టర్‌తో, మదర్ సెంటిమెంట్‌తో ‘తిప్పరా మీసం’ అనే సినిమా చేశాడు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, రిజ్వాన్ నిర్మాణంలో, ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ లో నిక్కీ థంబోలి హీరోయిన్‌గా నటించింది. మ‌రి శ్రీవిష్ణు ఈ చిత్రంతో నిజంగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మీసం తిప్పాడా? లేదా? ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం... 

కథ : మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్న తనంలోనే డ్రగ్స్ కి ఎడిట్ అయి.. ఆ క్రమంలో చివరికి తన తల్లి(రోహిణి) పైనే ద్వేషం పెంచుకుని ఆమెను శత్రువులా చూస్తుంటాడు. చికిత్స త‌ర్వాత బ‌య‌టికొచ్చి త‌ల్లికి దూరంగా.. డీజేగా ప‌నిచేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు.ఈ మధ్యలో మౌనిక (నిక్కీ తంబోలి)తో ప్రేమలో పడతాడు. మ‌త్తుతో పాటు, జూదం కూడా ఆడుతుంటాడు. ఒక సందర్భంలో క్రికెట్ బెట్టింగ్ లో 30 లక్షలు అప్పుకు గురవుతాడు. ఆ అప్పు తీర్చే ప్రయత్నంలో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఆ త‌ర్వాత ఒక హ‌త్య కేసులో నిందితుడిగా జైలుకి వెళతాడు. త‌ల్లిపైనే కేసు వేసిన మ‌ణిశంక‌ర్ త‌న కుటుంబం కోసం ఏమైనా చేశాడా, లేదా? అవ‌స‌ర‌మైన‌ప్పుడు త‌న బాధ్యత‌ల్ని ఎలా నిర్వర్తించాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : థ కంటే కూడా క‌థ‌నంతో క‌ట్టిపడేస్తున్న రోజులివి. యువ దర్శకులు ఆ విష‌యంలో మ‌రింత నైపుణ్యాన్ని ప్రద‌ర్శిస్తున్నారు. వాళ్ల ఆలోచ‌న‌లు, ప్రతిభపై న‌మ్మకంతో క‌థానాయ‌కులు రంగంలోకి దిగుతున్నారు. ఈ సినిమాని కూడా శ్రీవిష్ణు త‌న పాత్ర, క‌థ‌నంపై న‌మ్మకంతో చేసిన‌ట్టు అనిపిస్తుంది. శ్రీవిష్ణు తొలిసారి ర‌గ్‌డ్ పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. శ్రీవిష్ణు ఈ సినిమాలో కూడా మణి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్‌ను ఎక్కువగా ఎంచుకునే శ్రీవిష్ణు, ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా ఎఫెక్టివ్‌గా చేశాడు. అతని నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్‌ అని చెప్పొచ్చు..ఇక తల్లి పాత్రలో రోహిణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సీనియర్ నటి కావడంతో ఏ పాత్ర అయినా అవలీలగా చేయగల రోహిణి.. ఈమూవీలో  తల్లి పాత్రలో నటించడం ఈ సినిమాకి చాలా కలిసొచ్చింది. క‌థానాయిక నిక్కీ తంబోలీ చిన్న పాత్రలో క‌నిపిస్తుందంతే. బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్యర్ పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు.ప‌తాక స‌న్నివేశాల్లో కుటుంబం కోసం క‌థానాయ‌కుడు చేసే ప‌ని ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. శ్రీవిష్ణు ఇందుకే ఈ క‌థ‌ని ఒప్పుకొనుంటాడేమో. ద‌ర్శకుడు చెప్పాల‌నుకొన్న క‌థంతా ప‌తాక స‌న్నివేశాల్లోనే క‌నిపిస్తుంది. 

మైనస్ పాయింట్స్: దర్శకుడు కృష్ణ విజ‌య్‌ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. దర్శకుడు మాత్రం అటు బ‌ల‌మైన క‌థ‌ని చెప్పక‌పోగా, ఇటు క‌థ‌నంపై కూడా ప‌ట్టు ప్రద‌ర్శించ‌లేక‌పోయారు. ప‌తాక స‌న్నివేశాల్లోని ఒక మ‌లుపు త‌ప్ప సినిమాలో చెప్పుకోద‌గ్గ విష‌య‌మేమీ లేదు. ప్రథ‌మార్ధం అంతా కూడా సాగ‌దీత వ్యవ‌హార‌మే. క‌థానాయ‌కుడు మ‌త్తుకి బానిసై చేసే విన్యాసాలు, దుస్తులు విప్పేసి రోడ్ల మీద ప‌రుగెత్తడాలు, అత‌ను ఆడే జూదం.. ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.ద్వితీయార్ధంలోనైనా ఏమైనా మ‌లుపుల‌తో క‌థ‌, క‌థ‌నాల్ని గాడిలో పెట్టారా అంటే అది కూడా లేదు. క‌థ‌లో కానీ, క‌థానాయ‌కుడి పాత్రలో కానీ.. ‘తిప్పరామీసం’ అనే పేరుకు ఉన్నంత శ‌క్తి అస్సలు క‌నిపించ‌దు.

సాంకేతిక విభాగం : డైరెక్టర్ కృష్ణ విషయానికి వస్తే..కథ కథనం పెద్దగా ఆకట్టుకోకపోయిన తల్లి – కొడుకుమధ్య సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ చేసాడు. ద‌ర్శకుడు కేవ‌లం క‌థానాయ‌కుడి పాత్రపైనే దృష్టిపెట్టడంతో క‌థ‌, క‌థ‌నాలు నిస్సారంగా మారాయి. సురేశ్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. తల్లి కొడుకుల సెంటి మెంట్ కు కరెక్ట్ గా సెట్ అయ్యింది. సాంగ్స్ విషయానికి వస్తే లవ్ సాంగ్ బాగుంది.సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండు. ఇంకొన్ని సాగతీత సన్నివేశాలను తగ్గించాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు : 'తిప్పరా మీసం'...మీసం తిప్పలేకపోయింది. 

 రేటింగ్ : 3/5

సంబంధిత వర్గం
"మాసు బీటే మోగిందిరా మామ" సాంగ్ తో అదరగొడుతున్న శ్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.