(Local) Sat, 14 Dec, 2019

రివ్యూ : 7(సెవెన్)

June 06, 2019,   6:44 PM IST
Share on:
రివ్యూ : 7(సెవెన్)

లాంగ్‌ గ్యాప్‌ తరువాత హవీష్‌  ‘7’ సినిమాతో రీలాంచ్ అయ్యాడు. ‘భలే భలే మగాడివోయ్’.. ‘మహానుభావుడు’ లాంటి సినిమాలకు ఛాయాగ్రహణం అందించిన నిజార్ షఫి దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘7’. రమేష్ వర్మ స్క్రిప్టు సమకూర్చడంతో పాటు సినిమాను నిర్మించాడు.ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : రమ్య అనే అమ్మాయి తన భర్త కార్తీక్‌ రఘునాథ్‌ కనిపించటం లేదంటూ కేసు పెట్టేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వస్తుంది. తన భర్తతో దిగిన ఫోటోలను స్టేషన్‌లో ఇస్తుంది. ఆమె కథ విన్న ఏసీపీ విజయ్‌ ప్రకాష్‌ షాక్‌ అవుతాడు. రమ్యను మోసం చేసినట్టుగానే కార్తీక్‌ గతంలో జెన్నీ అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని మోసం చేశాడని తెలుస్తుంది. దీంతో ఏసీపీ ఈ రెండు కేసులను మిస్సింగ్ కేసులా కాకుండా కార్తీక్‌ వీళ్లను కావాలనే మోసం చేసి వెళ్లిపోయాడన్న అనుమానంతో చీటింగ్‌ కేసుగా మార్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అదే సమయంలో చెన్నైలోనూ మరో అమ్మాయిని కార్తీక్‌ మోసం చేశాడని తెలుస్తుంది. . కానీ అంతలో అచ్చం కార్తీక్ లాగే కృష్ణమూర్తి అనే మరో వ్యక్తి ఉండేవాడని తేలుతుంది. ఇంతకీ ఆ అమ్మాయిలను మోసం చేసింది కార్తీకేనా ? లేక కృష్ణమూర్తినా ? అసలు కృష్ణమూర్తి ఎవరు ? అయినా ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రేమ కథలు ఒకేలా ఎందుకు ఉన్నాయి ? మొత్తానికి కార్తీక్ జీవితంలో ఏమి జరిగి ఉంటుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : నటుడుగా హవీష్ తన గత చిత్రాలు కన్నా బెటర్ కానీ బెస్ట్ మాత్రం కాదు. రెజీనాకు చెప్పుకోదగ్గ పాత్ర లేదు. మిగతా హీరోయిన్స్ బాగానే చేసారు. అయితే వీళ్లందరినీ గుర్తుపెట్టుకునేటంత పాత్రలు కావు. రహమాన్ గతంలో తమిళంలో ఇలాంటి ఇన్విస్టిగేటివ్  పోలీస్ పాత్రను చేస్తూ "16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్" టైటిల్ తో  సినిమా చేసారు. ఆ సినిమా సూపర్ హిట్. అందుకే ఈ సినిమాలోనూ అచ్చం అలాగే చేయించినట్లున్నారు. తమిళ మార్కెట్ కు రహమాన్ ఉపయోగపడచ్చు. మిగతావాళ్లలో చెప్పుకోదగ్గ నటన ప్రదర్శించింది జోష్ రవి. సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రనే చేసిన రవి లో నటుడు ని పూర్తిగా ఆవిష్కరించిన సినిమా ఇది. 

మైనస్ పాయింట్స్ : సినిమాలో ప్రధానమైన కథనం, మెయిన్ లవ్ స్టోరీ బోర్ కొట్టడం, సెకెండ్ హాఫ్ స్లోగా సాగడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం, అలాగే ఓల్డ్ గెటప్ లో నటించిన నటి ఆ పాత్రకు సరిగ్గా సూట్ కాకపోవడం వంటి అంశాలు సినిమాకి పెద్ద మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

సాంకేతిక వర్గం : నిజార్ షఫీ దర్శకుడిగా కెమెరామెన్ గా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు చైతన్య భరద్వాజ్ అందించిన నేపధ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నిర్మాత రమేష్ వర్మ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

తీర్పు : సినిమాను గ్రిప్పింగ్‌గా న‌డ‌ప‌డంలో నిజార్ ఫెయిల్యూర్ కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. ఫ‌స్టాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ స‌మ‌యంలో సినిమాలో ఏదో మిస్ అయ్యిందే అనే ఫీలింగ్ క‌లుగుతుంది. రుగురు హీరోయిన్స్‌, లిప్ లాక్స్ ఉంటే ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు వ‌చ్చేయ‌రు. ఆక‌ట్టుకునే క‌థ‌, క‌థ‌నం, క‌థ‌లోని నాయ‌కుడు, ఇత‌ర న‌టీన‌టుల నట‌న సినిమాకు ప్రాణం పోస్తుంది. ఆ ఎలిమెంట్స్ సినిమాలో మిస్ అయ్యాయి.

రేటింగ్ : 2/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.