(Local) Tue, 07 Jul, 2020

రివ్యూ :మజిలి

April 05, 2019,   10:28 PM IST
Share on:
రివ్యూ :మజిలి

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలి. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈరోజు రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ : రైల్వే టిసి రావు రమేష్ కొడుకైన పూర్ణ (నాగ చైతన్య) క్రికెట్ లో గొప్ప స్థాయికి వెళ్లాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఓ గొడవతో పరిచయమైన అన్షు (దివ్యాన్ష కౌశిక్)తో స్నేహం పెరిగి ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. నేవీ ఆఫీసర్ కూతురైన అన్షుని పూర్ణ నుండి దూరం చేస్తారు. ప్రేమ విఫలమవడంతో కెరియర్ కూడా పాడుచేసుకుంటాడు పూర్ణ. అలా ఉన్న పూర్ణని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న శ్రావణి (సమంత) పెళ్లాడుతుంది. పూర్ణ ఏం చేసినా సరే ఎప్పటికైనా తన కోసం మారుతాడని భావించే శ్రావణి పూర్ణ కోసం ఏం చేసింది..? శ్రావణి తన మీద చూపిస్తున్న ప్రేమని పూర్ణ ఎప్పుడు గుర్తించాడు..? పెళ్లైనా అన్షు జ్ఞాపకాలతో ఉండే పూర్ణకి శ్రావణి ఎలా దగ్గరవుతుంది అన్నది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్: నాగ చైతన్య ఈ సినిమాలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. పూర్ణ పాత్రలో తనని తాను మార్చుకున్న తీరు బాగుంది. శ్రావణిగా సమంత చితక్కొట్టేసింది. సమంత మరోసారి తన అభినయంతో మెప్పించిందని చెప్పొచ్చు. రియల్ లైఫ్ లో భార్యాభర్తలెన చైతు, సమంత ఇలా రీల్ లైఫ్ లో ఫీల్ గుడ్ మూవీలో నటించడం అందంగా ఉంటుంది. మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ కూడా బాగా చేసింది. రావు రమేష్, పోసాని కృష్ణ మురళిల పాత్రలు అలరించాయి. సుబ్బరాజు అంద‌రినీ క‌లుపుకొని పోవాలంటూనే విల‌నిజం చూపించే పాత్రలో క‌నిపిస్తాడు.

మైనస్ పాయింట్స్ : భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి భార్య పాత్రను అలాగే ప్రేమలో ఫెయిల్ అయిన ఒక భగ్న ప్రేమికుడికి జీవితంలోని సంఘటనలను బాగా రాసుకున్న దర్శకుడు శివ నిర్వాణ, స్క్రీన్ ప్లే ని మాత్రం ఆ స్థాయిలో మాత్రం విఫలం అయ్యాడు.. ముఖ్యంగా సినిమాలోని చాలా సీన్లను బాగా స్లోగా నడిపారు.ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :టెక్నికల్ టీం విషయాన్నికి వస్తే.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. గోపి సుందర్ మ్యూజిక్ అలరించగా తమన్ బిజిఎం సినిమాకు ప్లస్ అయ్యింది. శివ నిర్వాణ కథ, కథనాల్లో తన పర్ఫెక్షన్ చూపించాడు. రాసుకున్న కథకు పూర్తి న్యాయం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు:‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివా నిర్వాణ మరోసారి ఎమోషనల్‌ డ్రామానే ఎంచుకున్నాడు. ఎలాంటి కమర్షియల్‌ హంగులకు పోకుండా తను అనుకున్న కథను రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. ‘నిన్ను కోరి’ తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడిని కట్టి పడేయటంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు.  ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తోంది. అలాగే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని కూడా బాగానే అలరిస్తుంది.

రేటింగ్ :3.25/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.