(Local) Wed, 26 Feb, 2020

రివ్యూ : కిల్లర్‌

June 08, 2019,   1:44 PM IST
Share on:
రివ్యూ : కిల్లర్‌

విజయ్‌ ఆంటోని 'బిచ్చగాడు' సినిమాతో తో సెన్సేషనల్‌ హిట్‌ సాధించి తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. తర్వాత విజయ్‌ చేసిన భేతాళుడు, యమన్‌, ఇంద్రసేన, రోషగాడు. వంటి చిత్రాలు అనుకున్నంత హిట్ ని అందిచలేకపోయాయి. అయితే విజయ్‌ ఆంటోని తన ప్రయత్నాలను మాత్రం మానుకోకుండా  తన సినిమాలను రెండు బాషలలో ఒకేసారి విడుదల చేస్తూ వస్తున్నాడు.  అందులో మరో ప్రయత్నమే 'కిల్లర్‌'. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోనికి తోడుగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ జాయిన్‌ కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ ఆంటోనికి ఈ సినిమా ఏ రేంజ్ ఫలితాన్ని అందించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ : విజయ్ ఆంటోని (ప్రభాకర్) ఏసిపిగా వర్క్ చేసి కొన్ని కారణాల వల్ల పోలీస్ జాబ్ వదిలేసి.. వేరే జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ తరుణంలో వైజాగ్ భీమిలి బీచ్ రోడ్ లో ఒక వ్యక్తిని దారుణంగా హత్యకు గురి అవుతాడు. ఆ హత్యకు కావించబడ్డ  వ్యక్తి మినిస్టర్ సత్యానంద్ కొడుకు వంశీ అని పసిగడతారు పోలీసులు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీస‌ర్ కార్తికేయ‌(అర్జున్‌) నియమిస్తారు.ఈ కేసులో జయతి(అషిమా నర్వాల్) ఆమె తల్లి(సీత) ను అనుమానిస్తాడు కార్తికేయ. ఈ క్రమంలో ఆ హత్య చేసింది తనేనని, చేసింది జయతి కోసమే అని పోలీసులకు లొంగిపోతాడు ప్రభాకర్(విజయ్ ఆంటొని). కేసు ద‌ర్యాప్తు చేస్తున్న కార్తికేయ‌కు ప్ర‌భాక‌ర్ చెప్పేది న‌మ్మాల‌ని అనిపించ‌దు. త‌న సీనియ‌ర్ ఆఫీస‌ర్ (నాజర్‌) స‌హ‌కారంతో కేసును మ‌రో కోణంలో డీల్ చేయ‌డం ప్రారంభిస్తాడు. విజయ్ ఆంటోని ఎందుకు పోలిస్ లకు లొంగిపోయాడు ? ఇంతకీ విజయ్ ఆంటోని కి ఆషిమా న‌ర్వాల్ కి ఉన్న సంబంధం ఏమిటి ? చివరికీ వంశీని హత్య చేసిన వ్యక్తిని అర్జున్ పట్టుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : క్రైమ్ థ్రిల్ల‌ర్స్ చాలా సినిమాలే మ‌నం చూసుండొచ్చు. చిన్న థ్రెడ్‌ను బేస్ చేసుకుని దాని ఆధారంగానే సినిమా అంతా ర‌న్ అవుతుంటుంది. అదేవిధంగా ఈ సినిమా  బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ సప్సెన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో వంశీ పాత్ర హత్య జరగడం. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్... అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే విచారణ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ప్రధాన పాత్రలో నటించిన విజయ్ ఆంటోని తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ మెప్పిస్తాడు. ముఖ్యంగా తన ఎక్స్ ప్రెషన్స్ తోనే సినిమాలో సీరియస్ నెస్ ను మరియు ఇంట్రస్ట్ ను మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ : కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ సీరియస్ గా సాగడం.. దానికి తోడూ కొన్ని సన్నివేశాల్లో ప్లో మిస్ అవ్వడంతో అక్కడక్కడ సినిమా బోర్ కొడుతోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు చాలా సినిమాటిక్ గా చెప్పాడు. ఆలాగే సినిమాలో బి.సి ఆడియన్స్ ఆశించే కమర్షియల్ అంశాలు లేకపోవడం కూడా సినిమాకి మైనస్ అవుతుంది.

సాంకేతిక వర్గం : కెమెరామెన్ గా చేసిన మాక్స్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సినిమాకు మెయిన్ హైలైట్ సైమన్ కే కింగ్ మ్యూజిక్. క్రైం థ్రిల్లర్ కి పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో సైమన్ సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ ప్రభావం తెరమీద సన్నివేశాలు మరింత అందంగా కనిపించాయి. 

తీర్పు : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో డిసప్పాయింట్ చేసిన విజయ్ ఆంటోనీ, ఈసారి మాత్రం టార్గెట్ రీచ్ అయ్యాడు. కిల్లర్ సినిమాతో తన జానర్ ఆడియన్స్ ను మరోసారి ఎట్రాక్ట్ చేశాడు. మెయిన్ గా క్రైమ్ సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అర్జున్ – విజయ్ అంటోనిల నటన బాగా అలరిస్తాయి. అయితే దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే మరీ సీరియస్ గా సాగడం, పైగా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి మరియు కొత్తధనం కోరుకునే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. మరి, మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

రేటింగ్ : 3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.