(Local) Mon, 23 Sep, 2019

రివ్యూ : అంతరిక్షం

December 21, 2018,   10:56 PM IST
Views: 211
Share on:
రివ్యూ : అంతరిక్షం

తెలుగులో వస్తున్న తొలి పూర్తి స్థాయి స్పేస్ సినిమాగా ‘అంతరిక్షం’ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘ఘాజీ’తో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ రెడ్డి.. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన చిత్రమిది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ :వరుణ్ తేజ్(దేవ్) ఐదు సంవత్సరాల క్రితం చంద్రుని పై విప్రయాన్ శాటిలైట్ ను పంపే ప్రాసెస్ లో అనుకోకుండా జరిగే కొన్ని ఇబ్బందికర పరిస్థుతుల వల్ల తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి)ని కోల్పోవడంతో పాటు, తన విప్రయాన్ మిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఓ మిషన్ ను పూర్తి చెయ్యడానికి వరుణ్ దేవ్ (వరుణ్ తేజ్) అవసరం ఏర్పడుతుంది.

ఆ మిషన్ ను పూర్తి చేసే క్రమంలో దేవ్ కి కొన్ని సమస్యలను ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని దేవ్ వాటిని ఎలా పరిష్కరించాడు ? అలాగే తన విప్రయాన్ మిషన్ ని ఎలా పూర్తి చేశాడు ? రెండు మెషన్ లను దేవ్ తన బృందంతో ఎలా విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పెస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి కూడా తన నటనతో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అతిథిరావ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.

మైనస్ పాయింట్స్ :ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశాలు ఇందులో మిస్సయ్యాయి. ఇందుకు హీరో పాత్రను సరిగా తీర్చిదిద్దకపోవడమే కారణం. తన కలల ప్రాజెక్టు ఫెయిలైనంత మాత్రాన హీరో ఉన్నట్లుండి అన్నీ వదిలేసి ఎవరికీ చిక్కకుండా ఐదేళ్ల పాటు ఎక్కడో దూరంగా ఉండటం.. తర్వాత ఉన్నట్లుండి సమస్య తలెత్తగానే వచ్చే హీరోయిజం చూపించేయడం సహేతుకంగా అనిపించదు. ఇక్కడ బలమైన కారణాల్ని చూపించడంలో.. కన్విన్స్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు.ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడ సాదా సీదాగానే గడిచిపోయింది. హీరో మిషన్ లోకి రావడం వరకు బాగానే ఉన్నా ప్రీ ఇంటర్వెల్ ముందుకి వరకు కథనం నెమ్మదిగానే సాగుతుంది. పైగా స్పేస్ సినిమాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ కూడా ఈ చిత్రంలో కొంత కరువైందనే చెప్పాలి. దీనికి తోడు సినిమాలో కొన్ని చోట్ల మరీ సినీమాటిక్ గా అనిపిస్తోంది. ముఖ్యంగా మిషన్ కిన్నెరలో వరుణ్ సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి.

సాంకేతిక విభాగం :ఈ చిత్రానికి టెక్నీషియన్స్ సపోర్ట్ కీలకం. అందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారిఇచ్చిన రెండు పాటలూ బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం అసెట్. సన్నివేశాల్లో ఉత్కంఠ పెంచడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. కెమెరామన్ రాజశేఖర్ అనుభవం సినిమాకు బాగా ఉపయోగపడింది. ఏది ఎఫెక్ట్.. ఏది రియల్ అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. అక్కడక్కడా కెమెరా పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగానే ఉన్నాయి. దీనికున్న పరిమితుల్లో బాగానే చేశారు. కొన్నిచోట్ల వీఎఫెక్స్ బాగున్నాయి..

తీర్పు :సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెలుగులో మొట్టమొదటి సారిగా స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా సాగకపోయిన, ప్రేక్షకులకు మాత్రం కొత్త అనుభూతిని ఇవ్వడంలో చాలా వరకు సఫలమైంది

రేటింగ్ : 3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.