(Local) Sun, 19 Sep, 2021

రివ్యూ :ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ

June 21, 2019,   10:21 AM IST
Share on:
రివ్యూ :ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ

టాలీవుడ్ లో చాలా ఏళ్ళ తరువాత  మరో డిటెక్టివ్ కథ తెరపైకి వచ్చింది.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` టైటిల్ నుంచే ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమాతో యూట్యూబ్ స్టార్ నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్లో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ రైటర్ గా , నటుడిగా కొనసాగుతున్న నవీన్ పొలిశెట్టి పలు వీడియోలతో ఇప్పటికే పాపులర్ అయ్యాడు. విజయ్ దేవరకొండతో కలిసి థియేటర్ ఆర్ట్స్ చేసిన నవిన్ పోలిశెట్టికి ఈ సినిమా మంచి టేక్ ఆఫ్ అయ్యేలా వుందా?. హీరోగా అతన్ని `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` ఎంత వరకు నిలబెడుతుంది? ట్రైలర్ కి తగ్గట్టే సినిమా కూడా ఆకట్టుకునే విధంగానే వుందో లేదో తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

కథ :ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నెల్లూరు లోకల్ డిటెక్టివ్. తనని తాను గొప్ప ఇంటలిజెంట్ అని  భావిస్తుంటాడు. కానీ అతన్ని ఎవరూ పట్టించుకోకుండా ఎగతాళి  చేస్తుంటారు. అలాంటి అతనికి చెన్నై నుంచి నెల్లూరుకు వస్తున్న డెడ్ బాడీల మిస్టరీని ఛేధించే అవకాశం వస్తుంది. ఈ దశలో అతనిపై హత్యా యత్నం కూడా జరుగుతుంది. అది చేసింది ఎవరు? ఎందుకు హత్యలు జరుగుతున్నాయి?. దివ్య అనే అమ్మాయి నిజంగానే చనిపోయిందా? చనిపోయినట్టు నాటకం ఆడుతోందా?. దాని వెనకున్న కారణం ఏంటీ? ఇంటిలిజెంట్ డిటెక్లివ్గా  ఫీలయ్యే ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఆ కేసుని ఎలా పరిష్కరించాడు ... లాంటి  విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే .

ప్లస్ పాయింట్స్ : హీరో గా వచ్చిన అవకాశాన్ని నవీన్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాడని చెప్పొచ్చు. కొత్త తరహా కథని తన లాంచింగ్ ప్యాడ్గా చేసుకుని నవీన్ మంచి ప్రయత్నం చేశాడని చెప్పాలి. తనకు హీరోగా తొలి సినిమానే అయినా మొత్తం తన భుజాలపైనే మోస్తూ నవ్వులు పూయించాడు. నటుడిగా ఇప్పటికే యూట్యూబ్ వీడియోలతో నిరూపించుకున్న నవీన్ ఈ సినిమాతో మంచి మార్కులే సాధించాడు.ఇక మిగతా పాత్రల్లో శృతిశర్మ, దర్భ అప్పాజీ అంబరీషా, విశ్వనాథ్ తమ తమ పాత్రల పరిథిమేరకు నటించి పూర్తిగా న్యాయం చేశారు.

మైనస్  పాయింట్స్ : కథనం లో చాలా చోట్ల ల్యాగ్ వుంది.సినిమాలో నటించిన న‌టీన‌టులంతా కొత్త ముఖాలు కావ‌డంతో క‌మ‌ర్షియ‌ల్ గా గ్రిప్ త‌గ్గింది.సినిమాలో  పెద్దగా గ్రిప్ లేని అంశాల పైనే కథ తిరగడం పెద్ద మైనస్ అని చెప్పాలి.

సాంకేతిక వర్గం :థ్రిల్లర్ గా  తెరకెక్కిన ఈ సినిమాని మార్క్ రాబిన్ తన నేపథ్య సంగీతంతో మరింత ఆసక్తికరంగా మలిచాడని చెప్పొచ్చు. నాగరాజు తాళ్లపల్లి ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. ఎక్కడా బోర్ లేకుండా కథనాన్ని స్పీడుగా నడిపించడంలో నాగరాజు తాళ్లపల్లి ఎడిటింగ్ కీలకంగా మారింది.స్వరూప్ ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేని అందించి సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా పేసీగా సాగేలా చూసుకున్నారు.

తీర్పు :డిటెక్టివ్ సినిమాల కోసం తపించే ప్రేక్షకులు కోసమైతే ఈ  సినిమా  ఓకే.. బట్ ఇత‌రుల‌కు నాట్ ఓకే!

రేటింగ్ : 2.5/5

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.