(Local) Sat, 14 Dec, 2019

రివ్యూ :118 మూవీ

March 01, 2019,   2:43 PM IST
Share on:
రివ్యూ :118 మూవీ

నందమూరి ఫ్యామిలీలో ప్రయోగాలు చేయడంలో కళ్యాణ్ రామ్ ముందు వరసలో ఉంటారు .కమర్షియల్ సినిమాలు చేస్తూనే... ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటాడు. ఈ రోజు రీలీజ్ అయ్యిన 118 సినిమా థ్రిల్లర్ జోనర్లో  కళ్యాణ్ రామ్ చేసిన సినిమా . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజయింది.  ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం :

కథ : హీరో కళ్యాణ్ రామ్(గౌతమ్)కి తరచూ ఒక కల వస్తుంది.అందులో నివేతా థామస్(ఆధ్యా) కొన్ని ఆసక్తికర పరిమాణాల వలన కనిపించకుండాపోయినట్టు కల వస్తుంది.గౌతమ్ కు వచ్చిన ఈ కలలో కనిపించిన ఈ ఆధ్యా ఎవరు? ఈమె నిజ జీవితంలో కూడా మిస్సయ్యిందా..? అసలు ఈ 118 టైటిల్ వెనుకున్న రహస్యం ఏమిటి? ఈమె కనిపించకుండా పోయిన ఈ మిస్టరీని గౌతమ్ చేధించగలిగాడా? ఆ సమయంలో ఎదురైన సమస్యలను గౌతమ్ ఎలా పరిష్కరించి ఆద్య ను కనుక్కున్నాడో లేదో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే :

ప్లస్ పాయింట్స్ :కళ్యాణ్ రామ్ నటన చాలా సహజంగా ఉంది. గౌతమ్ పాత్రలో చాలా బాగా నటించాడు. కొత్త మేక్ ఓవర్ తో కళ్యాణ్ రామ్ సినిమాలో ఎనర్జిటిక్ గా కనిపించాడు.నివేత థామస్ ఎప్పటిలాగే నటనతో ఆకట్టుకుంది. అలాగే ఆధ్యా పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ తన నటన తో మెప్పించింది. కథ అంతా ఆమె చుట్టూ తిరిగేది కావడంతో సినిమాలో ఆమె కు మంచి పాత్ర దొరికింది. కళ్యాణ్ రామ్ కు సపోర్టింగ్ పాత్రల్లో నటించిన షాలిని పాండే , కమెడియన్ ప్రభాస్ శ్రీను మిగతా నటీనటులు ఎవరి పాత్ర మేరకు వారు మెప్పించే ప్రయత్నం చేశారు.  

మైనస్ పాయింట్స్ :  ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ లో ఆ ఫీల్ మిస్ అవుతుంది. దానికి కారణం నివేదా థామస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎందుకంటె అందులో మనకి పెద్దగా కిక్ అనిపించదు.  ఇలాంటి సినిమాల్లో కామెడీని ఎక్స్ పెక్ట్ చేయకూడదు.  సినిమాలో చాలా లాజిక్ లు కూడా మిస్ అయ్యాయి .సినిమా అంతా సీరియస్ గా సాగడం కూడా ఒక రకంగా మైనస్ అని చెప్పవచ్చు.

సాంకేతిక విభాగం :ఇలాంటి కథతో సినిమా చేయాలంటే సాహసం కావాలి.  ఆ సాహసాన్ని సినిమాటోగ్రాఫర్ గుహన్ మొదటిసారి దర్శకుడుగా మారి రిస్క్ తీసుకొని విజయం సాధించాడు.  కథను నడిపించిన తీరు బాగుంది.  థ్రిల్లింగ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం.  శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది.అలాగే ఈసినిమాకు డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్ అయినా గుహన్ కెమెరామెన్ గా కూడా మెప్పించాడు. సినిమాలోని ప్రతి ఫ్రెమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. మహేష్ కోనేరు నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి.

తీర్పు:ఫైన‌ల్‌గా చెప్పాలంటే 118 మూవీ టిక్కెట్ కొనుక్కుని థియేట‌ర్‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌డం ఖాయం .

రేటింగ్ :3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.