(Local) Wed, 20 Oct, 2021

రివ్యూ: 'రాజుగారి గది 3'

October 18, 2019,   5:31 PM IST
Share on:
రివ్యూ: 'రాజుగారి గది 3'

బాలీవుడ్, కోలీవుడ్ లో లాగా సీక్వెన్స్ బాట పట్టిన దర్శకుడు ఓంకార్. ‘ఆట’లాంటి షోస్‌తో బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్‌.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్‌ కామెడీ జానర్‌లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు క్రేజ్‌ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్‌తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఇపుడు తన తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా అవికా గోర్ హీరోయిన్‌గా రాజు గారి గది 3 వచ్చింది. ఈ మూవీ అక్టోబర్ 18న శుక్రవారం (ఈ రోజు )ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించి థ్రిల్ చేసిందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ : మాయా (అవికా గోర్‌) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తుండే అశ్విన్ బాబు ఆ కాలనీలో ఉండే వ్యక్తులకు ప్రశాంతత లేకుండా చేస్తుంటాడు. దీంతో ఆ కాలనీలో ఉండే వ్యక్తులు అశ్విన్ నుంచి తప్పించుకొవడానికి అతడిని అవికా ప్రేమలో పడేలా చేయాలని చూస్తారు.  మాయకు ఐలవ్‌యూ చెప్పిన వారందరిని ఓ దయ్యం చంపడానికి ప్రయత్నిస్తుంటుంది. మాయకు అశ్విన్ తన ప్రేమను వ్యక్తం చేసిన ప్రతిసారి దయ్యం అశ్విన్‌పై దాడిచేస్తుంటుంది. మాయను వెంటాడుతున్న ఆత్మకు కారణం ఆమె తండ్రి గరుడపిైళ్లె(అజయ్‌ఘోష్) అని భ్రమపడిన అశ్విన్ అతడి కోసం కేరళ వెళతాడు. అక్కడ అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్‌ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్ : అశ్విన్‌బాబు ఇంతకుముందు “రాజుగారి గది” చిత్రంలో నటించాడు. ఇప్పుడు దాని సీక్వెల్ “రాజుగారి గది-3″లో కూడా హీరోగా నటించాడు. ఇందులో అశ్విన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మాయగా అవికా గోర్‌ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్‌లో కాసేపు దెయ్యంగా కనిపించింది.అలి కూడా ఎప్పటిలానే తన కామెడీతో ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజి, అజయ్ ఘోష్, ఊర్వశి పాత్రలు కూడా మెప్పించాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.    

మైనస్ పాయింట్స్ : సినిమాకు మొదటి మైనస్ పాయింట్ గా చెప్పాల్సింది ఏమిటంటే అసలు స్క్రిప్ట్ లో పెద్దగా సీరియస్ నెస్ ఉన్నట్టుగా చిత్రాన్ని చూసే ప్రేక్షకుడికి అనిపించదు.  ప్రథ‌మార్ధం మొత్తం క‌థ లేకుండా కేవ‌లం కాల‌క్షేపం కోస‌మే అన్నట్టుగా స‌న్నివేశాలు సాగిపోతుంటాయి. నాయ‌కానాయిక‌లు ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి కేర‌ళ‌కి వెళ‌తారో అప్పట్నుంచి క‌థ ఊపందుకుంటుంది.సినిమాలో వచ్చే కామెడీ పార్టీ బాగున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో దాని వలనే అసలు కథ సైడ్ ట్రాక్ పట్టనట్టుగా అనిపిస్తుంది.ఈ విషయంలో ఓం కార్ కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.రాజుగారి గది సినిమాకి మెయిన్ మైనస్ మ్యూజిక్. 

సాంకేతిక విభాగం : ఈ సినిమా ఓంకార్ స్వంత కథ వచ్చిందేమో కాదు. తమిళంలో రిలీజైన  ‘దిల్లుకు దుడ్డు 2’  నుంచి తీసుకున్నది. అక్కడ సంతానం ఈ సినిమా చేసాడు. ఆడుతూ, పాడుతూ,నవ్విస్తూ అలవైన ఫన్ తో ఆకట్టుకున్నాడు. సినిమా కథలో పెద్దగా విషయంలేకున్నా తన సత్తాతో లాగేసాడు. అదే ఇక్కడ తెలుగులో కొరవడింది. మామూలుగానే హారర్ చిత్రాలు అంటే సరైన కెమెరా పనితనం ఉండాలి.ఫ్రేమ్ ఎంత సహజంగా కనిపిస్తే చూసే ప్రేక్షకుడికి అంత థ్రిల్ అనిపిస్తుంది. హర్రర్‌ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్‌.. ఈ హర్రర్‌ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్‌ పాయింట్‌నే ఎంచుకున్నారు. బుర్ర సాయి మాధవ్ డైలాగ్స్ తన స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోయాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది.. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

తీర్పు : నవ్వుకోవటానికి ఈ సినిమా మంచి ఆప్షనే. అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తేనే సమస్య

రేటింగ్: 2.5/5

సంబంధిత వర్గం
తమన్నా హార్ట్ అయ్యిందట!!
తమన్నా హార్ట్ అయ్యిందట!!
రేపు విడుదలవుతున్న
రేపు విడుదలవుతున్న "రాజుగారి గది 3"

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.