
దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంష్ శ్రీహరి తొలిసారి తెరంగేట్రం చేసిన సినిమా 'రాజ్‌దూత్'. అర్జున్, కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీహరి నట వారసత్వాన్ని కొంసాగించేలా.. ఆయన కుమారుడు కూడా విజయవంతం అవుతాడా? ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించగలిగిందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ : రాజ్‌దూత్ సినిమా కథంతా ఒక బైక్ నేపథ్యంగా సాగుతుంది. సంజయ్(మేఘాన్ష్) మొదటి చూపులోనే ప్రియ (నక్షత్ర)ను ఇష్టపడతాడు. అయితే ప్రియను పెళ్లి చేసుకోవాలంటే రాజ్‌దూత్ అనే బైక్‌ను తీసుకురావాలని హీరోయిన్ తండ్రి కండిషన్ పెడతాడు. ఇరవై ఏళ్ల క్రితం వదిలేసిన రాజ్దూత్ను తీసుకు రావడానికి మేఘాంష్ చేసిన ప్రయత్నాలే ఈ కథ. అది ఎన్ని చేతులు మారింది..? ఎలాంటి స్థితిలో ఉందో కూడా మన హీరో సంజయ్‌కి తెలీదు. ఎలాగైనా బైక్‌ని తెస్తానని చెప్పి వెళ్తాడు..!! అసలు ఈ రాజ్ దూత్ ని ఎందుకు తెమ్మని అడిగాడు..? చివరకి హీరో సంజయ్ కి ఇది దొరికిందా లేదా తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే… అసలు రాజ్దూత్కు హీరోకు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ : మొదటి సినిమా అయినా మేఘాన్ష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి ప్రయత్నం కాబట్టి మరీ ఎక్కువ ఆశించడం భావ్యం కాదు. ఇక హీరోయిన్ పాత్ర నిడివి తక్కువే అయినా నక్షత్ర ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రాజన్నగా ఆదిత్య బాగానే నటించాడు. స్నేహితుడి క్యారెక్టర్లో సుదర్శన్ నవ్వులు పూయించాడు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
మైనస్ పాయింట్స్ : అర్జున్, కార్తీక్ దర్శకులుగా మామూలు కథను.. మరింత తీసికట్టుగా తెరకెక్కించారు. లాజిక్ లేని సీన్స్ కథకి అస్సలు సంబంధం లేని సీన్స్ విసుగుతెప్పిస్తాయి. ఒక సస్పెన్స్, థ్రిల్ అనేది ఎక్కడా కనిపించదు. ఇక ఫస్టాఫ్ అంతా ఇలా స్టఫ్ లేని సన్నివేశాలతో సాగుతూ, ఎంట్రవెల్ పడుతుంది. ఇలా నాసిరకంగా సినిమాను తీయడంతో.. మేఘాన్ష్కు ఈ చిత్రం ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది.
సాంకేతిక విభాగం : విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ బాగుంది. విజయవర్థన్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది కానీ, సెకండాఫ్‌లో చాలా సీన్స్ ల్యాగ్ అనిపించాయి. వరుణ్ సునీల్ చేసిన పాటల్లో 'ప్రాణం నువ్వే కదా' పాట లిరికల్‌గా, మ్యూజికల్‌గా బాగుంది. జె.బి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా చేశాడు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్టర్స్ అర్జున్, కార్తీక్‌ల గురించి చెప్పాలంటే ఇది చాలా సాదా సీదా కథ. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని కాన్సెప్ట్.
తీర్పు : ఇలా నాసిరకంగా సినిమాను తీయడంతో.. మేఘాన్ష్కు ఈ చిత్రం ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. బైక్ తేవడం అనే చిన్నపాయింట్ ని పట్టుకుని సినిమా మొత్తాన్ని నడపాలని అనుకున్నప్పుడు కథలో ట్విస్ట్ లు రాస్కోవాలి.. అది కంప్లీట్ గా మిస్ అయ్యారు. ఇక ఆడియన్స్ కి బైక్ దొరికితే ఇంటికెళ్లిపోదాం అనే ఫీలింగ్ కలిగేలా చేసారు.
రేటింగ్ : 2.5/5
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: జార్జిరెడ్డి
22 Nov 2019, 2:57 PM
-
రివ్యూ: యాక్షన్
15 Nov 2019, 5:49 PM
-
రివ్యూ: ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’
15 Nov 2019, 4:34 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
01 Nov 2019, 3:39 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
13 Sep 2019, 4:27 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.