(Local) Mon, 20 Sep, 2021

రివ్యూ : కల్కి

June 28, 2019,   3:23 PM IST
Share on:
రివ్యూ :  కల్కి

'అ' లాంటి  వైవిధ్య‌మైన చిత్రాన్ని ప్రేక్షకులకి అందించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో యాంగ్రీ హీరో రాజశేఖర్‌ నటిస్తున్న చిత్రం 'కల్కి'.   పిఎస్‌వి గ‌రుడ‌వేగ‌` తరువాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఎంతవరకు అందుకుందో చూద్దాం.

కథ : కల్కి... కథ 1980వ ద‌శ‌కంలో  కొన్ని సంస్థానాలు విలీనం అవుతుంటాయి. అలా కొల్లాపూర్ సంస్థానం కూడా విలీనమయి దేశంలో ఎన్నిక‌లు మొద‌ల‌వుతాయి. ఆ ఎన్నికలలో రామచంద్రమ్మ గెలవగా ఆమెను చంపి సంస్థానం తన సొంతం చేసుకుంటాడు నర్సప్ప (అశుతోష్ రాణా). రామచంద్రమ్మను చంపడంలో పెరుమాండ్లు (శ‌త్రు)స‌హాయం తీసుకుంటాడు. ఆ తర్వాత పెరుమాండ్లు, న‌ర్స‌ప్ప స‌న్నిహితంగా ఉంటారు. కొల్లాపూరు నుంచి న‌ల్ల‌మ‌ల వ‌ర‌కు అంతా న‌ర్స‌ప్ప క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతుంటుంది. అదే స‌మ‌యంలో కొల్లాపూర్ ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డానికి వ‌స్తాడు న‌ర్స‌ప్ప త‌మ్ముడు శేఖ‌ర్‌బాబు (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌). అత‌ను అసీమా ఖాన్‌ను (నందితా శ్వేత‌) ఇష్ట‌ప‌డ‌తారు. ఇంత‌లో శేఖ‌ర్‌బాబు దారుణ హ‌త్యకు గుర‌వుతాడు.శేఖ‌ర్‌బాబు హ‌త్య కేసుని ప‌రిశోధించ‌డానికి ఐపీఎస్ అధికారి క‌ల్కి (రాజ‌శేఖ‌ర్) ఊళ్లోకి అడుగుపెడ‌తాడు. కొల్లాపూర్‌ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో  ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్‌ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? ఈ కథతో ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ... 

ప్లస్ పాయింట్స్: ఎప్పటిలా పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్‌ తన పాత్రలో లీనమై మెప్పించాడు. రాజశేఖర్ ని పోలీస్ గా అద్బుతంగా చూపించడంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనబడుతుంది.  అదాశ‌ర్మ వైద్యురాలిగా అందంగా కనిపించి తన పాత్ర మేరకు నాయ్యం చేసింది.  రాహుల్ రామ‌కృష్ణ క‌థానాయ‌కుడితో పాటే క‌నిపిస్తుంటారు. ఆయ‌న యాస‌తో, న‌ట‌న‌తో చాలా స‌న్నివేశాల్లో న‌వ్వించారు. ఇక మరో హీరోయిన్ నందితా శ్వేత సెకండ్ హాఫ్ లో తన పాత్రకు న్యాయం చేసే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా తీయడంతో  ప్రతి సన్నివేశం చాలా రిచ్ గా కనబడుతుంది. అశుతోష్ రాణా, శ‌త్రులు మిగిలిన తారాగణం తమదైన స్టైల్ లో పాత్రకి అనుగుణంగా నటించి మెప్పించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కథలో ట్విస్ట్ లతో థ్రిల్ చేసారు.

మైనస్ పాయింట్స్: 2గంటల 20నిమిషాల నిడివి గల ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకులకి  3గంటలు సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎటువంటి మలుపులు ఆసక్తికర సీన్స్ లేకపోవడంతో బోర్ కొడుతోంది. అలాగే రాజశేఖర్ ,ఆదా శర్మల మధ్య ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పాతకాలపు సినిమా ఫార్మాట్ లో సాగడంతో ప్రేక్షకులాన్ని అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలోని పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు.. మొత్తానికి ఈ సినిమా లో దర్శకుడు చెప్పాలనుకున్న అసలు పాయింట్ మాత్రం డైవర్ట్ చేసారు.

సాంకేతిక విభాగం:  ఈ మూవీ నిర్మాణ విలువలు అద్భుతమని చెప్పచు. దాశరథి శివేంద్ర సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ కన్నా  బాక్గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నారు.దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ బాగున్నప్పటికీ స్క్రీన్ మీద చూపించడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు. 

తీర్పు:  సినిమా మొత్తం ఇతి మిద్దంగా చెప్పాలంటే ‘కల్కి’ కేవలం పర్వాలేదనిపించే చిత్రం మాత్రమే. అంచనాలు లేకుండా వెళ్లిన వారికి కొంచెం అనుభూతినిచ్చే ఆస్కారం ఉంది.

రేటింగ్ : 3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.