(Local) Wed, 20 Oct, 2021

రివ్యూ: నిను వీడని నీడను నేనే

July 12, 2019,   3:41 PM IST
Share on:
రివ్యూ: నిను వీడని నీడను నేనే

ప్రస్థానం చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన సందీప్ కిషన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిచినప్పటికీ ఆయన కెరీర్లో ఒక్క వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదనే చెప్పుకోవచ్చు. తాజాగా సందీప్ కిషన్ హీరోగా మాత్రమే కాకుండా  మొట్టమొదటి సారి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టి ముందు సినిమాల కన్నా భిన్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తెలుగు, తమిళ భాషల్లో “నిను వీడని నీడను నేనే” అనే సినిమాను నిర్మించాడు. తమిళ దర్శకుడు కార్తీక్ రాజును టాలీవుడ్కు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సందీప్కు ఆశించిన విజయం అందించిందా..?  హీరోగా, నిర్మాతగా రెండు బాద్యతలను సందీప్ సమర్థవంతంగా పోషించాడా..? ఈ చిత్రం ఎంత వరకు మెప్పించిందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ: సినిమా కథ 2035లో మొదలవుతుంది. సైకాలజీ ప్రొఫెసర్‌(మురళీ శర్మ) తను డీల్‌ చేసిన ఓ కేసుకు సంబంధించిన విషయాలను చెబుతుంటాడు. కథ 2013 సంవత్సరానికి మారుతుంది. సందీప్ కిషన్, అన్య సింగ్ ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. ఓ రోజు పార్టీ చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ అవుతుంది. అక్కడే స్మశానం కూడా ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చి అద్దంలో చూసుకుంటే సందీప్ మొహంలో  ఇతర వ్యక్తులు రిషీ, దియా ముఖాలు కనిపిస్తుంటాయి. అద్దంలో వేరే వ్యక్తులు కనపడడానికి కారణం ఏంటి.? అద్దంలో కనిపించేది ఎవరు? చివరకు రిషీ, దియాలు ఏమయ్యారు? అసలు ఈ రిషి ఎవరు? ఈ నేపథ్యంలో కథ ఎలా కొనసాగింది అన్నవి  తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్: సినిమాకు ప్రధాన బలం హీరో సందీప్ కిషన్.. తనదైన శైలి నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. కామెడీ, హారర్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించాడు. చనిపోయిన ఒక జంట మరొక జంట శరీరాలలో ప్రవేశించడం అనే కొత్త కాన్సెప్ట్ ఈ మూవీ యొక్క మరో ప్రధాన బలంగా చెప్పవచ్చు. ఇక హీరోయిన్ అన్య సింగ్‌ అందం, అభినయంతోనూ ప్రేక్షకులను అలరించింది.  అలాగే మూవీ ఇంటర్వల్ లో వచ్చే ట్విస్టింగ్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. కథకు కీలక పాత్ర పోషించిన వెన్నెల కిషోర్.. మరోసారి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. మురళి శర్మ, పోసాని కృష్ణ మురళి తదితరలు తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు. తమన్ తన మార్క్‌ చూపించాడు. పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌పాయింట్‌. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

మైనస్ పాయింట్స్: ఫస్ట్‌హాఫ్‌లో కథను కాస్త నెమ్మదిగా నడిపించాడు. సెకండ్‌ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. వరుస ట్విస్ట్‌లతో ద్వితీయార్థాన్ని ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ఇంటర్వెల్‌ సీన్‌, ప్రీ క్రైమాక్స్‌, క్లైమాక్స్‌లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో లాజిక్‌ల కోసం వెతికితే మాత్రం కష్టం. సందీప్ పాత్ర విషయంలో కొన్ని మిస్టరీలు సరిగా రివీల్ కాలేదని అనిపించింది. ఆల్గే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం తగ్గిస్తే మంచిది అన్న భావన కలుగుతుంది.

సాంకేతిక విభాగం: దర్శకుడు కార్తిక్ రాజు ఓ నూతన కథను ఈ చిత్రంలో పరిచయం చేసాడు. ఐతే కీలకమైన మిస్టరీ సన్నివేశాలు తెరపై ఆవిష్కరించడంలో ఆయన పూర్తిగా విజయం సాధించలేదనిపిస్తుంది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌పాయింట్‌. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చీకటి నేపథ్యంలో ఇంటీరియర్ లొకేషన్ లో తెరకెక్కిన సన్నివేశాలు రిచ్ గా వచ్చాయి.

తీర్పు: మొత్తంగా చెప్పాలంటే నిను వీడని నీడను నేను ఆసక్తికరంగా సాగే హారర్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికీ నినువీడని నీడని నేను చిత్రం ఈ వారానికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. 

రేటింగ్ : 3.2.5/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.