
టాలీవుడ్ సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్’ పతాకంపై తెరకెక్కించిన చిత్ర ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రంతో విజయ్ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా తెరమీద చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ సరసన కన్నడ నటి వాణీభోజన్ హీరోయిన్గా నటించింది. విజయ్ నిర్మాతగా మారడం, తరుణ్ హీరో అవతారం ఎత్తడంతో సహజంగానే యుత్‌లో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అనుకున్నట్టుగానే యుత్‌ను ఈ సినిమా ఆకట్టుకుందా? ఒకప్పుడు ‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్-తరుణ్ జోడీ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మారిన రోల్స్‌తో ఈ ఇద్దరు మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేశారా? మరి మీకు మాత్రమే చెప్తా ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుందో సమీక్షలో చూద్దాం.
కథ: రాకేష్ (తరుణ్ భాస్కర్) ఓ ఛానెల్ యాంకర్. అతడికి ఓ ఫ్రెండ్ (అభినవ్) ఉంటాడు. రాకేష్‌కు తను ప్రేమించిన అమ్మాయి స్టెఫీ (వాణి భోజన్)తోనే పెళ్లి సెట్ అవుతుంది. ఈ క్రమంలోనే రాకేష్ ఒక దర్శకుడి మాట నమ్మి హానీమూన్ నేపథ్యంలో సాగే ‘మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా’ అనే వీడియో చేస్తాడు. ఈ క్రమంలో డాక్టర్ అయిన స్టెఫీ (వాణి భోజన్)తో ప్రేమలో పడిన రాకేష్ ఆమెతో పెళ్లికి సిద్ధమవుతాడు. కొన్ని గంటల్లో పెళ్లి అనగా ‘మత్తు వదలరా’ వీడియో బయటికొస్తుంది. ఈ విషయం స్టెఫీకి తెలిస్తే తనను తిరస్కరిస్తుందేమోనని భయపడతాడు రాకేష్. మిత్రుడు కామేష్ (అభినవ్ గోమఠం) సహకారంతో ఓ హ్యాకర్‌ను సంప్రదించి సదరు వీడియోను ఆన్లైన్ నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో రాకేష్, కామేష్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? స్టెఫీని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి చివరకు రాకేష్ ఏం చేశాడు? ఇద్దరి మిత్రుల కథలో చివరలో మలుపేమిటి? అనే విషయాల్ని తెరపైన చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్: మొదటి చిత్రం పెళ్లి చూపులు తో జాతీయ అవార్డు గెలుచుకొని టాలెంట్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరో గా మొదటి చిత్రం తో మెప్పించాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని ప్రతి క్షణం భయపడే ఫ్రస్ట్రేటెడ్ గయ్ గా ఆయన నటన సహజత్వానికి దగ్గరగా ఉంది. అభినవ్ గోమతం బాగా చేశారు. అసలు సినిమా అంతా వీరిద్దరి భుజస్కందాలపైనే నడిచింది. ఇక అనసూయది చిన్న పాత్రే. వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అవంతికా మిశ్రా తదితరులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
మైనస్ పాయింట్స్: మీకు మాత్రమే చెప్తా.. ఓ చిన్న కథ చెబుతా.. మీకు మాత్రమే చెప్తా.. అదేంటి చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తున్నారు అనిపించింది కదా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ సీన్లోనే కథ చెప్పేసి రెండు గంటలు కూర్చోబెట్టే సాహసం చేసాడు దర్శకుడు షమ్మీర్ సుల్తాన్..ఇలాంటి ట్రిక్కీ ప్లే తెరపై పేలాలంటే ఆద్యంతం అలరించే పంచ్ లతో సాగాలి. కాని అక్కడక్కడ తప్ప తరుణ్ భాస్కర్, అభినవ్ పంచులు ప్రేక్షకులకు నవ్వు తెప్పించలేకపోయాయి. నిర్మాణ విలువలు కూడా ఏమంత రిచ్ గా ఉండవు. దేవరకొండ లాంటి నిర్మాత ఉన్నప్పుడు ఇలాంటి తక్కువ క్వాలిటీ ఉన్న సినిమాను ఉహించము. సెకండాఫ్‌కు వచ్చే సరికి అంతగా కామెడీ లేకపోవడంతోపాటు స్క్రీన్‌ప్లే పెద్దగా ఇంట్రస్టింగ్‌గా సాగకపోవడంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అనసూయ లాంటి యాక్టర్ ని ప్రాధాన్యం లేని రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేశారు.ఇక ఈ మూవీ లో చేసిన ఒక్క యాక్టర్ కూడా తెలిసినవారు కాకపోవడం మరో మైనస్ గా చెప్పవచ్చు.
సాంకేతిక విభాగం: దర్శకుడు మొబైల్ వలన వ్యక్తి ప్రైవసీ కి ఏవిధంగా భంగం కలుగుతుంది అనే విషయాన్నీ ఒక జంట ప్రేమ, పెళ్లికి ముడిపెట్టి ఫన్నీ గా నడపాలని భావించారు.ఐతే ఆ క్రమంలో ఆయన రాసుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే రొటీన్ గా అనాసక్తిగా సాగింది. మదన్‌గుణదేవా సినిమాటోగ్రఫీ బాగుంది. శివకుమార్ సంగీతం ఫర్వాలేదనిపించినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదనిపించాయి.
తీర్పు: మీకు మాత్రమే చెప్పే సినిమా...
రేటింగ్: 2.5/5
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
కలెక్షన్ రిపోర్ట్: 'మీకు మాత్రమే చెప్తా'
05 Nov 2019, 1:17 PM
-
సినిమా టికెట్లు అమ్మిన రౌడీ హీరో....
01 Nov 2019, 1:32 PM
-
అనసూయ పాత్రపై సస్పెన్స్...!
12 Oct 2019, 1:46 PM
-
విజయ్ దేవరకొండ అంటే పిచ్చి: రకుత్ ప్రీత్ సింగ్
28 Sep 2019, 5:11 PM
-
వరల్డ్ ఫేమస్ కూడా కాపీ...?
21 Sep 2019, 9:08 PM
-
ఆస్కార్ ఎంట్రీలో డియర్ కామ్రేడ్ ....
21 Sep 2019, 8:56 PM
-
రామన్నగారు నన్ను క్షమించండి....
13 Sep 2019, 2:46 PM
-
నల్లమలలో యురేనియం రగడ పై స్పందిస్తున్నా టాలీవుడ్ హ ...
12 Sep 2019, 3:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: జార్జిరెడ్డి
22 Nov 2019, 2:57 PM
-
రివ్యూ: యాక్షన్
15 Nov 2019, 5:49 PM
-
రివ్యూ: ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’
15 Nov 2019, 4:34 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
13 Sep 2019, 4:27 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
-
రివ్యూ: ఏదైనా జరగొచ్చు
23 Aug 2019, 4:48 PM

రివ్యూ: అర్జున్ సురవరం

సినిమా టికెట్లు అమ్మిన రౌడీ హీరో....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.