(Local) Tue, 21 Sep, 2021

ఓటర్ మూవీ రివ్యూ!

June 21, 2019,   4:59 PM IST
Share on:
ఓటర్ మూవీ రివ్యూ!

భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఓటు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు దానికున్న శక్తి గురించీ ఎంత చెప్పినా తక్కువే . ప్రజల వేసే ఓటుతో గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా అందుబాటులో ఉండాలి. ఓటరే.. ప్రజాస్వామ్యానికి నిజమైన ఓనర్‌ అని  చెప్పే ప్రయత్నం ‘ఓటర్‌’లో కనిపించింది. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనేక వివాదాలు చుట్టుముట్టిన నేపధ్యంలో .. విడుదల అవుతుందా? లేదా? అనే సందిగ్థంలో ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘ఓటర్‌’ ఎలా ఉన్నాడు? అతడు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఓటు విలువ గురించి అస్సలు ఎం చెప్పారో చూడాలి అంటే కథలోకి వెళ్ళాలసిందే. 

కథ :  NRI గా సెటిల్ అయి జాబ్ చేస్తోన్న హీరో గౌతమ్ (మంచు విష్ణు) కు ఇండియా అంటే అమితమైన ప్రేమ. ఇండియా మీద ఉన్న అభిమానంతో తన ఓటు హక్కు వినియోగించడానికి యూఎస్ నుండి ఇండియాకి వస్తాడు. అయితే అనుకోకుండా భావన (సురభి)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే హీరో గౌతమ్ భావన ప్రేమని గెలుచుకోవడానికి ఆమె చెప్పిన షరతుకి అంగీకరిస్తాడు. ఎమ్మెల్యేగా (పోసాని కృష్ణమురళీ) ఎన్నికల ముందర చేసిన వాగ్దానాలన్నీ నెరవేరేలా గౌతమ్ చేసే ప్రయత్నములో ఎంపీ శంకర్‌ ప్రసాద్‌ (సంపత్‌రాజ్‌)కి ఎదురెళ్లాల్సి వస్తుంది. ఓటరు పవరెంతో చూపిస్తానని శంకర్‌ ప్రసాద్‌తో సవాల్‌ విసురుతాడు గౌతమ్‌. మరి శంకర్‌ ప్రసాద్‌తో చేసిన పోరాటంలో గౌతమ్‌ ఎలా విజయం సాధించాడు? అసలు వీరిద్దరికీ మధ్య వచ్చిన సమస్యేంటి? అనేదే ‘ఓటర్‌’ కథ.

ప్లస్ పాయింట్స్ : ప్రస్తుత రాజకీయాల గురించి సినిమాలో చర్చించిన ‘రీకాల్ ఎలెక్షన్’ అనే మెయిన్ పాయింట్ చాలా బాగుంది. డైరెక్టర్  కార్తీక్ రెడ్డి రాసుకున్న కథ, నేపథ్యం పొలిటికల్ సన్నివేశాల పరంగా ఓకే అని చెప్పొచ్చు. పోసాని నవ్వించే ప్రయత్నం ఒకవిధంగా బాగానే ఉంది అని చెప్పొచ్చు.  

మైనస్  పాయింట్స్ : దర్శకుడు కార్తీక్ రెడ్డి సినిమాలో ఓటర్ హక్కుల గురించి తెలియజెప్పాలి అనుకున్నారు కానీ దాని సన్నివేశాల రూపకల్పన సరిగ్గా అమర్చలేకపోయారు . ఎప్పటిలాగా హీరో విష్ణు యాక్టింగ్ ఉండటం వల్ల కొత్తదనం ఏమి కనిపించలేదు.  అస్సలు హీరోయిన్ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. 

సాంకేతిక వర్గం : దర్శకుడు జి కార్తీక్ రెడ్డి రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, అయితే సినిమా మాత్రం ఆసక్తి సాగలేదు. యస్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆయన అందించిన పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అశ్విన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మాణ విలువులు బాగున్నాయి

 తీర్పు :  కథనం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. సినిమా నిండా ఎమోషన్ ఉన్నా .. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఆ ఎమోషన్ ఎలివేట్ కాలేదు. దీనికి తోడు ఒక మినిస్టర్ పై రీకాల్ ఎలెక్షన్ పెట్టే క్రమంలో వచ్చే సీన్స్ కూడా బలంగా అనిపించవు. ఓవరాల్ గా ఈ సినిమా పొలిటికల్ జోనర్ లో సినిమాను చూద్దామకునే ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకున్నా.. మిగిలిన ప్రేక్షకులను మాత్రం నిరుత్సాహపరుస్తోంది.

రేటింగ్ : 1. 5/5 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.