(Local) Thu, 14 Nov, 2019

కబీర్ సింగ్ రివ్యూ

June 21, 2019,   3:56 PM IST
Share on:
కబీర్ సింగ్ రివ్యూ

'అర్జున్ రెడ్డి' సినిమా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే  అదే స్టోరీని రీమేక్‌ చేసి హిందీలో 'కబీర్ సింగ్' మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే కబీర్ సింగ్‌ కు దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ శుక్రవారం (జూన్ 21) కబీర్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ రికార్డు సృష్టించినట్లు.. బాలీవుడ్‌లోనూ క్రియేట్‌ చేస్తుందా లేదో చూడాలి. 

కథ :  కబీర్‌ రాజ్‌ధీర్‌ సింగ్‌ (షాహిద్‌ కపూర్‌) షార్ట్ టెంపెర్డ్ కలిగిన ఓ  వైద్య విద్యార్థి. అతను చదువుతున్న కాలేజ్‌లోనే చేరుతుంది హీరోయిన్ ప్రీతి శర్మా (కియారా అడ్వాణీ). ప్రీతిని చూడగానే ఇష్టపడతాడు కబీర్‌. ప్రీతి కూడా కబీర్‌ను ప్రేమిస్తుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇంతలో ప్రీతికి ఇంట్లో వారు సంబంధాలు చూస్తారు. ఈ విషయం కబీర్‌కు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కబీర్‌, ప్రీతి ఒక్కటయ్యారా? అతను ఏవిధంగా మారిపోయాడు? అతని ప్రేమకథ ఎలా కొలిక్కి వచ్చిందన్న తదితర విషయాలు తెరపై చూడాలి.

ప్లస్ పాయింట్స్ : విజయ్‌ దేవరకొండ కంటే ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌ తన నటనతో ఒకమెట్టు ఎక్కువే అని నిరూపించాడు. అదే విధంగా ప్రీతి పాత్రను కూడా కియారా అడ్వాణీ కూడా దీటుగానే నిరూపించుకుంది. సినిమాలో షాహిద్‌, కియారా అడ్వాణీ కెమిస్ట్రీ చక్కటి హావభావాలతో కనపర్చారు.  రీమేక్‌ సినిమా అయినప్పటికీ అక్కడక్కడా కొన్ని మార్పులు చేసి చూపించారు. ఆ మార్పులేంటో సినిమా చూసి తెలుసుకుంటే బాగుంటుంది. కబీర్ పాత్రకి అన్నగా నటించిన అర్జన్‌ బాజ్వా తన పాత్రకు నూరు శాతం న్యాయం చేశారు. తక్కిన తారాగణం తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.

మైనస్  పాయింట్స్ : తెలుగు సినిమాతో పోల్చి చుస్తే ఈ మూవీ లో ముద్దు సన్నివేశాలు ఎక్కువుగా ఉన్నాయి. సినిమా రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే ఉంది. 

సాంకేతిక వర్గం : దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెలుగు సినిమాల కాకుండా హిందీ ప్రేక్షకుల దృష్టి కోణంలో సినిమాను తెరకెక్కించారు,  అందులోనే ఆయన పనితనం కనబడుతోంది అని చెప్పొచ్చు. ‘అర్జున్‌రెడ్డి’ కథ తెలిసినప్పటికీ ప్రేక్షకులకు ‘కబీర్‌ సింగ్’ కొత్తగానే అనిపిస్తుంది. మిథూన్‌ తన సంగీతంతో మరింత ఆసక్తికరంగా పాటలను మలిచాడని చెప్పొచ్చు. సంతాన కృష్ణన్‌, రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆరిఫ్‌ షేక్‌ ఎడిటింగ్ సినిమాకు మరింత హంగును చేర్చింది.

 తీర్పు : యూత్‌ను ఆకట్టుకునేల ఉంది ‘కబీర్ సింగ్’.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి అంతగా రుచించదు అని చెప్పొచ్చు. మరి హిందీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. 

రేటింగ్ : 4/5 

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.