(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: జోడి

September 06, 2019,   5:18 PM IST
Share on:
రివ్యూ: జోడి

సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్‌ 2011లో ప్రేమ కావాలి చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాలు హిట్ టాక్ ని సంపాదించుకున్న ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు ఆది కెరీర్ కి విజయాన్ని అందిచలేకపోయాయి. అప్పటి నుండి  ఆది సాయికుమార్‌ మంచి విజ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు కానీ.. ఆయ‌న ప్రయత్నాలేవీ ఫ‌లించ‌డం లేదు. ఇటీవ‌లే ‘బుర్రకథ‌’ చేసి ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. తాజాగా మ‌రో చిత్రం `జోడి`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యంగ్ హీరో ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ జోడి. విశ్వనాధ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి జోడి చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ: కపిల్(ఆది) సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. అతని తండ్రి కమలాకర్ (నరేష్) బెట్టింగ్‌లలో డబ్బులు పోగొడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటాడు. కపిల్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పించే కాంచన మాల( శ్రద్దా శ్రీనాధ్) తో కపిల్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కపిల్ మంచితనం, బాధ్యతగా ఉండటం చూసి కాంచనమాల కూడా కపిల్‌ను ఇష్టపడుతుంది. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో కపిల్ తండ్రిని చూసిన కాంచన మాల తండ్రి వీరి పెళ్ళికి అడ్డు చెవుతాడు. మొదట కపిల్ తో తన కూతురి వివాహానికి అంగీకరించిన కాంచన తండ్రి, కపిల్ తండ్రి నరేష్ ని చూశాక సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు? వారిద్దరి మధ్య ఉన్న గొడవేంటి? కాంచన మాల తండ్రిని ఒప్పించి కపిల్ ఆమె ను ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ. 

ప్లస్ పాయింట్స్:  జోడి సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రద్దా శ్రీనాధ్ అందంతో అలాగే నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె జోడి చిత్రంలో చాలా అందంగా కనిపించారు. ముఖ్యంగా పాటలలో శ్రద్దా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఆమె తన పాత్రను చక్కగా చేశారు. ఇక హీరో ఆది తన గత చిత్రాలతో పోల్చుకుంటే ఆయన నటనలో పరిపక్వత కనిపిస్తుంది. తనకు ఇచ్చిన పాత్ర పరిధిలో ఆది నటన ఆకట్టుకుంటుంది. శ్రద్దా ,ఆది మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలలో ఆది అలరించారు. ఇక సీనియర్ నటులు గొల్లపూడి మారుతి రావు కీలక పాత్రలో తన మార్కు నటనతో అలరించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనపరుడిగా నరేష్ బాగా చేశారు. విలన్ రోల్ చేసిన ప్రదీప్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపించారు. వెన్నెల కిషోర్, సత్య ల మధ్య వచ్చే కొన్ని హాస్య సన్నివేశాలు అలరిస్తాయి. రొమాన్స్ మరియు భావోద్వేగ సన్నివేశాలతో మొదటిసగం కొంచెం ఆసక్తిగా సాగుతుంది.

మైనస్ పాయింట్స్: ఈ చిత్రం యొక్క ప్రధాన బలహీనత కథ అని చెప్పాలి. కొత్తదనం లేని కథలో వచ్చే సన్నివేశాలు ముందుగానే ప్రేక్షకుడికి తెలిసిపోతుంటాయి.ముఖ్యంగా లవ్‌ స్టోరిలో కొత్తదనం లేకపోవటంతో ప్రథమార్థం బోరింగ్‌గా సాగుతుంది. సెకండ్‌ హాఫ్‌లో కథ ఆసక్తికర మలుపు తిరిగినా.. కథనం నెమ్మదిగా సాగటం నిరాశపరుస్తుంది.క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం అయితే ప్రేక్షకుడికి పెద్ద నిరాశ కలిగిస్తుంది. ఎందుకంటే అలాంటి ముగింపు గతంలో అనేక చిత్రాలలో చూశాం.

సాంకేతిక విభాగం: దర్శకుడు విశ్వనాథ్ ఈ సినిమా కోసం ఒక సాదా సీదా కథని ఎంపిక చేసుకున్నారు.  కెమెరా పనితనం మూవీ సన్నివేశాలకు కళ చేకూర్చింది.జోడి చిత్రంలో కెమెరా వర్క్ మాత్రం ఆకట్టుకుంటుంది.  ఫణి కల్యాణ్‌ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఎడిట‌ర్ ర‌వి మండ్ల క‌త్తెర‌కి మ‌రింత ప‌ని చెప్పాల్సింది. ద్వితీయార్థంలో చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఉన్నాయి. ద‌ర్శకుడు విశ్వనాథ్ అరిగెల క‌థ‌కుడిగా, ద‌ర్శకుడిగా విఫ‌ల‌మ‌య్యారు.

తీర్పు: సాధారణ కథతో ఆకట్టుకున్న అందమైన జోడి..మొదటి సగం కొంచెం కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ తో ఆహ్లదంగా నడిచినా,రెండవ సగం ప్రేక్షకుడిని పూర్తి నిరాశలో నెట్టివేస్తుంది. 

రేటింగ్ : 1.1/5

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.