(Local) Mon, 20 Sep, 2021

రివ్యూ: ఇస్మార్ట్ శంకర్

July 18, 2019,   6:13 PM IST
Share on:
రివ్యూ: ఇస్మార్ట్ శంకర్

టెంపర్ తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.  ఇప్ప‌టి వ‌ర‌కు క్లాస్ హీరోగా మెప్పించిన రామ్‌తో ఈ సినిమా చేయాలని పూరి నిర్ణ‌యం తీసుకోవ‌డం కొస‌మెరుపు. దీంతో మాస్‌గా రామ్ లుక్ ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో రామ్ లుక్‌ను స‌రికొత్త కోణంలో చూపించాడు పూరి. నిధి అగర్వాల్, నభా నటేష్ గ్లామర్, మణిశర్మ సంగీతం సినిమాపై క్రేజ్ మరింత పెరిగేలా చేశాయి. మరి ఆ అంచనాలను ఇస్మార్ట్‌ శంకర్‌ అందుకున్నాడా..? రామ్‌, పూరీలకు ఆశించిన సక్సెస్‌ దక్కిందా..? ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లాల్సిందే. 

కథ : శంకర్‌ (రామ్‌) ఓ కిరాయి రౌడీ. భయం, భక్తి రెండూ లేవు. డబ్బు కోసం ఓ హత్య కూడా చేస్తాడు. తన లైఫ్ సెట్ అయిపోయే డీల్ అని కాకా (మధు) చెప్పాడని.. ఒక హత్య చేస్తాడు శంకర్. కానీ అందులో అతను అడ్డంగా ఇరుక్కుపోవడమే కాక.. దాని వల్ల తన ప్రేయసి (నభా నటేష్)ను కూడా కోల్పోతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) మెమొరీను ఎక్కిస్తారు. అసలు అరుణ్ మెమొరీని, రామ్ తలలోకే ఎక్కించడానికి కారణం ఏమిటి ? దీనికి సారా (నిధి అగర్వాల్)కి ఉన్న సంబంధం ఏమిటి?  లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : పక్కా మాస్ మసాలా అంశాలతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ 'ఇస్మార్ట్ శంకర్' మొత్తానికి మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం రామ్ పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఈ క్యారెక్టర్‌ లో రామ్ చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో రామ్ నటన చాల కొత్తగా ఉంటుంది. మెయిన్ గా సినిమాలో అక్కడక్కడా నవ్విస్తూనే, ఇటు హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక రామ్ సరసన హీరోయిన్స్ గా నటించిన నభా నటేష్ అండ్ నిధి అగర్వాల్ తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో మరియు తమ గ్లామర్ తో బాగా అలరించారు. మణిశర్మ పాటలు మాస్‌కి బాగా నచ్చుతాయి. అందులో రామ్‌ వేసిన స్టెప్పులు కూడా నచ్చుతాయి. పూరి డైలాగులు ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. తెలంగాణ యాసలో రాసిన సంభాషణలు కిక్‌ ఇస్తాయి. కీలక పాత్రలో నటించిన సత్యదేవ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్రలో అలరించాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమకు అలవాటైన పాత్రల్లో ఈజీగా నటించారు.

మైనస్ పాయింట్స్ : సినిమాలో యూత్ ని ఎట్రాక్ట్ చేసే క్రమంలో ప్రతి సన్నివేశంలో అవసరం ఉన్నా లేకపోయినా బూతులు ఇరికించి పెట్టడం కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది. పైగా సెకెండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరి స్లోగా సాగుతాయి. కథలో ఏదో కొత్తదనం చూపించాలని ఈ కాన్సెప్ట్‌ ఎంచుకున్నారు పూరి. అయితే ఆ పాయింట్‌ని కూడా తనదైన పాత పద్ధతిలోనే ఆవిష్కరించారు. సినిమాలో కీలక సన్నివేశాలకు సరైనా లాజిక్ ఉండడు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా అసలు కనెక్ట్ కాదు. ఇక మెయిన్ పాయింట్ ఆధారంగా క్లైమాక్స్ లో ఆ పాయింట్ కి తగ్గ స్థాయిలోనే సరైన ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే మెమొరీ మార్చే సీక్వెన్స్ ను దర్శకుడు ఇంకా బలంగా రాసుకోవాల్సింది. స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్. 

సాంకేతిక విభాగం :  సినిమాటోగ్రఫర్ గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు. మణిశర్మ తన నేపధ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు ఓకే.  పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పలేం గానీ..మంచి కమ్ బ్యాక్. ఎడిటర్ సినిమాను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాతలు పూరి – ఛార్మి ల నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు : ఓవరాల్ గా ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అయితే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు జస్ట్ ఓకే సినిమా అనిపిస్తోంది.

రేటింగ్ : 3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.