(Local) Tue, 21 Sep, 2021

రివ్యూ: గుణ 369

August 02, 2019,   10:32 PM IST
Share on:
రివ్యూ: గుణ 369

‘RX 100’ చిత్రంతో యూత్‌లో మంచి ఇమేజ్ దక్కించుకున్న కార్తీకేయ.. హిప్పీతో నిరాశపరిచి ‘గుణ 369’ చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేడు థియేటర్స్‌కి వచ్చాడు. మరి ‘గుణ’ ప్రేక్షకుల్ని ఎంత వరకూ మెప్పించగలిగాడో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :ఒంగోలుకు చెందిన ఓ సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు. బాధ్యతగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడతాడు. ఓ రోజు గీత అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమను గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు ఇదే ఊర్లో గద్దలకుంట రాధ అనే రౌడీ ఉంటాడు. మొత్తంగా గుణ తన లైఫ్ హ్యాపీగా ఉంది అనుకుంటోన్న టైమ్ లో ఆ రౌడీ హత్యకు గురవుతాడు. అంతకు మించి ఆ కేస్ గుణపై పడుతుంది. జైలుకు వెళతాడు. మరి రాధ అనే రౌడీని చంపింది ఎవరు..? ఆ కేస్ గుణపై ఎందుకు పడింది..? దీని వెనక ఉన్నది ఎవరు..? గుణ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :హీరో కార్తికేయ మనింటి అబ్బాయి గుణ అనే కుర్రాడిగా తనదైన నటనతో మెప్పించాడు. ఇక తన ఫిజిక్‌ను కూడా సల్మాన్‌ఖాన్‌లా ఎలివేట్‌ చేయాల్సిన అవసరం లేకున్నా, రెండు, మూడు సీన్స్‌లో అలాగే చేశాడు. ఇక సెకండాఫ్‌లో యాక్షన్‌ ఎలిమెంట్‌, ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌లో చక్కటి నటనను కనపరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నటన సింప్లీ సూపర్బ్‌. అనఘ తొలి తెలుగు చిత్రంలో ఓ రకంగా చెప్పాలంటే డిఫరెంట్‌ పాత్రను చేసింది. ఆమె అటెంప్ట్‌కి అభినందించాలి. ఆమె పాత్ర పరంగా తనదైన నటనతో మెప్పించింది. సినిమాలో పిల్లర్‌లాంటి పాత్రలో మహేశ్‌ నటించాడు. రంగస్థలం తర్వాత అతనికి మంచి పాత్ర ఈ సినిమాలో పడింది. అసలు సినిమా అంతా మహేశ్‌ను బేస్‌ చేసుకునే రన్‌ అవుతుంది. ఇక ఆదిత్య మీనన్‌కు పవర్‌ఫుల్‌ రౌడీ పాత్రలో మెప్పించాడు. ఇక నరేశ్‌, హేమ, కౌముది, శివాజీరాజా తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.

మైనస్ పాయింట్స్ :దర్శకుడు అర్జున్‌ జంధ్యాల పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. దర్శకుడు కాస్త లవ్‌ ట్రాక్‌పై శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ట్రెస్టింగ్ పాయింట్ తీసుకుని పేలవంగా సినిమా తీయడం అనే లోపం అడుగడుగునా కనిపిస్తుంది. బడ్జెట్ కట్టుబాట్లు కూడా కనిపిస్తాయి. అన్ని ఇబ్బందుల్లోనూ ఓ డ్యూయెట్ కోసం విదేశం వెళ్లడం మాత్రం మానలేదు. సెకెండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలను సాగతీసారు.థలో పాటల్ని ఇరికించినట్టుగా ఉంటాయే తప్ప.. కథానుగుణంగా అనిపించవు. కొన్ని సందర్భాల్లో సాంగ్ ఎందుకు వస్తుందో తెలియదు. మళ్లీ సాంగ్ వచ్చేసింది అని బోర్ ఫీల్ అవుతారు. సాంగ్‌ను సందర్భోచితంగా ఉపయోగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. 

సాంకేతిక విభాగం : చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటల్లో రెండు బాగున్నాయి.రాంరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :హీరో పుణ్యమా అని ఓపెనింగ్స్ ఓ మేరకు వస్తాయి. సెకండాఫ్.. క్లైమాక్స్ వయెలెన్స్ సినిమాను కొంత మేరకు రక్షించే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్‌: 2.75/5

సంబంధిత వర్గం
రివ్యూ: అర్జున్ సుర‌వరం
రివ్యూ: అర్జున్ సుర‌వరం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.