(Local) Fri, 13 Dec, 2019

ఫలక్ నూమా దాస్ మూవీ రివ్యూ

May 31, 2019,   3:03 PM IST
Share on:
ఫలక్ నూమా దాస్ మూవీ రివ్యూ

సమీక్ష : ఫలక్ నూమా దాస్ మూవీ రివ్యూ
విడుద‌ల : 31మే 2019:
నటీనటులు: విశ్వక్ సేన్,స‌లోని మిశ్రా,ఉత్తేజ్,హ‌ర్షితా గౌర్,త‌రుణ్ భాస్కర్దర్శకత్వంవిశ్వక్ 
సంగీతం : వివేక్ సాగర్
ఫోటోగ్ర‌ఫీ : విద్యా సాగర్
ఎడిటర్ :  రవితేజ
నిర్మాత : కరాటీ రాజు
దర్శకత్వం : విశ్వక్ సేన్

వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన చిత్రం ఫలక్‌నుమా దాస్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో  సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కించారు ద‌ర్శ‌కుడు విశ్వక్ సేన్.  టీజర్ ట్రైలర్‌ తో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. వీటికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందం చాలాహ‌డావిడి చేసింది.  అయితే ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఫలక్ నుమా ఏరియాలో పుట్టి పెరిగిన దాస్ (విశ్వక్‌ సేన్‌) అదే ఏరియాలోని శంకరన్న అనే దాదాని చూసి.. ప్రేరణ పొందుతాడు. పెద్దయ్యాక శంకర్ లా అవ్వాలని కలలు కంటాడు. చిన్నప్పుడే ఓ గ్యాంగ్‌ని కూడా తయారు చేసుకుంటాడు. ఈ చోట గ్యాంగ్ కు శంకరన్న సపోర్ట్ కూడా ఇస్తాడు. చిన్న చిన్న గొడవలతో అలాగే టినాతో ఆ తరువాత సఖితో ప్రేమలో మునిగి తెలుతుండగా.. సడెన్ గా శంకరన్నని చంపేస్తారు. దాంతో దాస్ ఆ చంపిన వాళ్లను పట్టుకుని పొలీస్ లకు పట్టిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం దాస్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో దాస్ ఆ కేసు నుండి బయట పడటానికి ఏమేమి పనులు చేసాడు ? ఈ క్రమంలో తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? చివరకు దాస్ ఆ కేసు నుంచి బయట పడ్డాడా? బయటపడడానికి చేసిన ప్రయత్నాలేంటి? అనేది తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే.


ప్లస్ పాయింట్స్ :

‘ఫలక్ నుమా దాస్’ రీమేక్ మూవీ అయినప్పటికీ,  మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలో చేసిన మార్పులు చాలా  బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నేపధ్యాన్ని హైదరాబాద్ పాతబస్తీ పరిసరాలకు మార్చడం, ఆ గ‌ళ్లీలోని స‌న్నివేశాలు ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ అయింది. ఇక ఫలక్ నుమా దాస్ చిత్రంలోని డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన ప్రధానంగా తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి.

ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్‌ సేన్‌ ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ లో బాగా జీవించాడు. తన నటనతో పాటు డైలాగ్ డెలివ‌రీతో కూడా విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్స్ గా నటించిన హర్షిత గౌర్ అండ్ సలోని తమ గ్లామర్ తో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాక‌ నటన పరంగా కూడా బాగా చేసారు. ఇకపోతే ‘యస్.ఐ’గా నటించిన తరుణ్ భాస్కర్ కనిపించనంతసేపూ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా క‌నిపించారు. ఇక మిగితా నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు

మైనస్ పాయింట్స్ :

విశ్వక్‌ సేన్‌ కథ, పాత్రల పరంగా మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. దర్శకుడు పాత్రలు పరిచయానికి చాలా సమయం తీసుకున్నారు. పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి.

ఇక చాలావరకు నూతన నటినటులతోనే సినిమాని తెరకెక్కించడం ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. లోకల్ టాలెంట్‌తో సినిమా తెరకెక్కించడం వల్ల ప్రయోగం కొత్తగా అనిపించినా.. రెగ్యులర్ ప్రేక్షకుడికి యాక్టర్లు అంతగా కనెక్ట్ అవుతాడా అనే సందేహం కలుగుతుంది.


సాంకేతిక విభాగం :

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి.

నిర్మాత కరాటీ రాజు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

తీర్పు :

ఇందులో సాగదీస్తూ తీసిన సన్నివేశాలు ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తాయి.  నటుడిగా పరవాలేదనిపించిన విశ్వక్ దర్శకుడిగా మెప్పించలేకపోయాడు. మొత్తం మీద ఫలక్ నుమాదాస్ ఓ విఫల పయత్నం. ఏ సీన్ ఎంతవరకు అవసరం, అసలు ఏ సీన్ అవసరం, అనవసరం అన్న విషయాలు పట్టించుకోలేదు. మలయాళం సినిమాను దాదాపుగా ఫాలో అయిపోయారుు. అది ఎక్కడో..ఎందుకో..వికటించింది. వాక్యానికి కర్త..కర్మ..క్రియ వున్నట్లే, కథకు కూడా కొన్ని లక్షణాలు వుండాలి. అందులోనూ సినిమా కథకు. అది లేకపోతే, మిగిలిన హంగులు, నవతరం టేకింగ్, రియలిస్టిక్ అప్రోచ్ ఇలా ఎన్ని వున్నా వృధానే. ప్ర‌యాస‌నే.
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.