(Local) Fri, 17 Sep, 2021

రివ్యూ: డియర్ కామ్రేడ్

July 26, 2019,   3:01 PM IST
Share on:
రివ్యూ: డియర్ కామ్రేడ్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ..కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ . భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు (జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ లో నాల్గు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుండడం తో ఈ చిత్ర ఓపెనింగ్స్ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గీత గోవిందం తర్వాత విజయ్ , రష్మిక జంటగా నటించడం..సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయడం తో సినిమా ఎలా ఉందొ చూడాలని.. అభిమానులు ఆత్రుత కు కామ్రేడ్ ఎలా సమాధానం చెప్పాడు..? అసలు కామ్రేడ్ కథ ఏంటి..? కామ్రేడ్ గా విజయ్ న్యాయం చేశాడా..లేదా.. ఈ కామ్రేడ్ ఎంత మేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ: చైత‌న్య అలియాస్ బాబీ (విజయ్ దేవరకొండ) నిజాయితీ మరియు నాయకత్వ లక్షణాలతో పాటు ఆవేశంతో రగిలిపోయే స్టూడెంట్ లీడర్ గా ఉంటాడు. ఒక లోకల్ గ్యాంగ్‌తో బాబీ గొడవకు దిగుతాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన లిల్లీ(రష్మిక)ను అతడు కలుస్తాడు. వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. బాబీ, లిల్లీని ప్రేమిస్తాడు. లిల్లీ స్టేట్ క్రికెట్ ప్లేయ‌ర్‌. చివ‌ర‌కు లిల్లీ కూడా బాబీ ప్రేమ‌కు ఓకే చెబుతుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం బాబీ గొడవల్లో పూర్తిగా మునిగిపోతాడు. మొత్తానికి అతనికున్న ఆవేశం వల్ల బాబీ, లిల్లీ విడిపోతారు. అలా మూడేళ్లు గడిచిపోతాయి. ఆ తరువాత లిల్లీని మళ్ళీ బాబీ కలుస్తాడు. అంతేకాదు బాబీ ఆవేశం లిల్లీ క్రికెట్ జీవితంపై ప్రభావం పడుతుంది. గతంలో రష్మికకు జరిగిన కొన్ని సంఘటనల గురించి బాబీకి తెలుస్తోంది. ఇక క్రికెట్ ప్లేయర్ అయిన లిల్లీకి, క్రికెట్ బోర్డుకు మధ్య నడిచే వివాదాన్ని బాబీ ఏ విధంగా పరిష్కరిస్తాడు..? లిల్లీకి గతంలో ఏం జరిగింది..? బాబీ, లిల్లీల ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : ఒక ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమా మందు నుండి చెప్పినట్లుగానే యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కమ్యునిస్ట్ ఆలోచనలు ఉన్న స్టూడెంట్ లీడర్‌గా విజయ్ దేవరకొండ చాలా అగ్రెసివ్‌గా నటించాడు. ఇక హీరోయిన్ రష్మిక,  లిల్లీ పాత్రలో చాలా చక్కగా నటించింది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ రష్మిక నటన ఆమె పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. అలాగే ఉమెన్ క్రికెటర్లును టార్చర్ పెట్టే విలన్ పాత్రలో కనిపించిన నటుడు కూడా తన నటనతో తన ఎక్స్ ప్రెషన్స్ తో.. కీలక సన్నివేశాల్ని చాలా బాగా పండించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. 

మైనస్ పాయింట్స్ : యూత్ కి కనెక్ట్ అయ్యే కథని ఎంచుకున్నా స్క్రీన్ ప్లే మరింత ఫాస్ట్ గా ఉంటే ఇంకా బాగుండేదేమో ! అక్కడక్కడా సాగతీత సన్నివేశాలతో ఫస్టాఫ్ లో అలాగే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి. విజయ్ దేవరకొండ మార్క్ సీన్స్ అండ్ కామెడీ ఈ సినిమాలో పెద్దగా క‌నిపించ‌వు. సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థ కావడంతో బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్‌ ప్రైజ్‌లు మిస్ అయ్యాయి.

సాంకేతిక విభాగం : దర్శకుడు మంచి పాయింట్ ను ఎంచుకున్నా దాన్ని తెరపై చూపించడంలో విఫలం అయ్యాడు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. సుజిత్ సారంగ్ టేకింగ్ ఈ సినిమాను ఎక్కడా ట్రాక్ తప్పకుండా చేస్తుంది. అటు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్. కొన్ని పాటలు, కొన్ని చోట్ల వచ్చిన బీజీఎం సినిమాకు బాగా తోడయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పనితీరు ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు : ప్ర‌స్తుతం ఆడవాళ్లు లైంగిక వేధింపులు ఎలా అధిగమించాలో చాలా బాగా చెప్పారు. మంచి ఫీల్ తో మరియు డీసెంట్ ఎమోషన్ తో కూడిన లవ్ స్టోరి ఈ డియర్ కామ్రేడ్. 

రివ్యూ : 3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.