(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: చాణక్య

October 05, 2019,   4:46 PM IST
Share on:
రివ్యూ: చాణక్య

ఏకే ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మాణంలో, తిరు దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్, మెహ్రీన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'చాణక్య'. విలన్‌గా తెలుగు తెరపై మెరిసి కథానాయకుడిగా మారి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపీచంద్‌ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా విభిన్న‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తూనే ఉన్నారు. మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్‌ గత కొన్నేళ్లుగా ఆయన సరైన బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నారు.. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరోకు ఈ మధ్యకాలంలో సరైన విజయం దక్కలేదు. పంతం, ఆక్సీజన్‌, గౌతం నందా, ఆరడుగుల బుల్లెట్‌ లాంటి చాలా సినిమాలు గోపీచంద్‌ చేసినా.. ఏ సినిమా కూడా అతని ఆశలను నిలబెట్టలేకపోయింది. ఈ క్రమంలో ‘చాణక్య’ మూవీలో గోపీచంద్‌ రా’ ఏజెంట్‌గా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గూఢచారి నేపథ్యంతో వచ్చిన వచ్చిన ఈ సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించిందా? గోపీచంద్‌ ‘చాణక్య’ శపథం నెరవేరిందా? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. 

కథ: పాక్‌ ఉగ్రవాద దాడుల నుంచి దేశాన్ని రక్షించడానికి అర్జున్ (గోపీచంద్) రా ఏజెంట్‌గా సీక్రెట్ ఆపరేషన్‌ నడుపుతుంటాడు. బయటకు మాత్రం బ్యాక్ ఉద్యోగి రామకృష్ణగా చలామణీ అవుతుంటాడు. అర్జున్‌తో పాటు మరో నలుగురు ఒక బృందంగా అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేస్తుంటారు. కరాచీలో దాక్కొని, భారతదేశంపై దాడి చేయాలనుకుంటున్న ఒక తీవ్రవాదిని పట్టుకోవడానికి అర్జున్‌ అతని టీమ్‌ ప్రయత్నిస్తుంటుంది.  ఓ మిషన్‌లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాది ఖురేషీ మనిషిని అర్జున్ తన నలుగురు మిత్రులు కిడ్నాప్ చేసి చంపుతారు. సెకండాఫ్‌లో గోపీచంద్‌ కరాచీ వెళ్లి తన నలుగురు ఫ్రెండ్స్‌ను ఎలా కాపాడాడు? దేశాన్ని ఉగ్రముప్పు నుంచి ఎలా బయటపడేశాడన్నది మిగిలిన కథ తెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్: యాక్షన్‌ ఇమేజ్‌ ఉన్న గోపీచంద్‌కు మరోసారి తన శైలికి తగిన పాత్ర దొరికింది. ‘రా’ అధికారిగా చాలా నిజాయతీగా కనిపిస్తారు. బ్యాంకు ఉద్యోగిగా అమాయకత్వం ప్రదర్శిస్తారు. యాక్షన్ హీరోగా మంచి పేరున్న గోపీచంద్ డిఫరెంట్ లుక్ లో సాలిడ్ బాడీతో ఆకట్టుకున్నారు. మెహరీన్‌ పాత్ర పరిమితం. ఆమె ఒక లవ్‌ ట్రాక్‌, పాటలకే పరిమితం అయింది. కథానాయిక పాత్రకంటే జరీన్‌ఖాన్‌ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. చాల రోజులకి పూర్తిస్థాయి కామెడీ రోల్ లో సునీల్ కలిపించాడు. మిగతా నటీనటులందరు తమ  పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.

మైనస్ పాయింట్స్: కథ రోటీన్‌గానే ఉంది. కథనం కూడా కొత్తగా లేకపోవడం ప్రేక్షకులకు కొంత బోరింగ్‌ అనిపించవచ్చు. ఒకటి రెండు ట్విస్ట్‌లు మినహా మిగిలిన సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.పెద్దగా ఆసక్తికరంగా సాగని స్పై థ్రిల్లర్ గా ఇది వరకే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథనంలా రొటీన్ గా అనిపిస్తుంది.అందువల్ల ఫస్ట్ హాఫ్ మాత్రం సోసో గానే అనిపిస్తుంది.  గోపీచంద్ పెర్ఫామెన్స్ పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ మాత్రం గోపీచంద్ సినిమాల నుంచి ఏం కోరుకుంటారో వారికి సంతృప్తి కలిగించదు.

సాంకేతిక విభాగం: దర్శకుడు తిరు రా ఏజెంట్ కథను చెప్పే క్రమంలో లాజిక్ అస్సలు ఫాలో కాలేదు. అంగబలం, అధికార బలం ఉన్న ఒక పెద్ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ని అతని సొంత గడ్డైన పాకిస్తాన్ లో ఎదుర్కోవడమంటే సాధారణ విషయం కాదు. అలాంటి సాహసం చేసిన హీరో వేసే ఎత్తులు కొంచెం లాజికల్ గా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సాగాలి.సంగీతం సోసోగా ఉన్నా.. . శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్‌ పర్వాలేదనిపిస్తుంది. టెక్నిక‌ల్‌గా చూస్తే ఇక‌ వెట్రి పళనిస్వామి అందించిన సినిమాటోగ్రఫీ సూప‌ర్బ్ అని చెప్పొచ్చు.ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి... 

తీర్పు: గోపిచంద్ నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య అంచనాలు అందుకోలేదనే చెప్పాలి. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కాదు రొటీన్ యాక్ష‌నే... 

రేటింగ్‌: 2 / 5

సంబంధిత వర్గం
సంక్రాంతికి వస్తున్న 'ఎంత మంచివాడవురా'
సంక్రాంతికి వస్తున్న 'ఎంత మంచివాడవురా'
గోపీచంద్ మార్కెట్ ఇంతేనా?
గోపీచంద్ మార్కెట్ ఇంతేనా?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.