
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది తొలి సినిమా ‘ప్రేమకావాలి’తో హీరోగా ముద్ర వేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ఆయన కెరీర్‌కు సరైన బ్రేక్ రాలేదు. ఈ నేపథ్యంలో రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘బుర్రకథ’. ఒక మనిషి.. రెండు బుర్రలు’ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరైన సక్సెస్‌లేక కొన్నేళ్లుగా తడబడుతున్న ఆది కెరీర్ గాడిలో పడిందా? లేదా అన్నది ఓసారి చూద్దాం.
కథ : అభిరామ్(ఆది సాయికుమార్) పుట్టుకతోనే రెండు మెదళ్లు ఉండటంతో రెండు రకాలగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా ‘అభిరామ్’ కాస్త అభి.. రామ్‌గా చివరికి ఇద్దరు వ్యక్తులుగా ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు. ఒకరేమో పక్కా మాస్, ఇంకొకరు పక్కా క్లాస్. ‘అభి’కి అల్లరి ఎక్కువ, ‘రామ్’కి భక్తి ఎక్కువ. రామ్ సన్యాసం తీసుకోవాలి అనుకుంటాడు. దాంతో ఇద్దరికి మధ్య వార్ జరుగుతుంటుంది. ఆ తరువాత వారి జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఇద్దరూ వేరుగా కాకుండా ఒకేలా ఆలోచిస్తారు. అలా ఆలోచించడానికి వారిద్దరూ ప్రేమించిన ఒకే అమ్మాయి ‘హ్యాపీ’ (మిస్తీ చక్రబోర్తి) ఎలా కారణమైంది ? ఇంతకీ అభి మరియు రామ్ చివరికీ అభిరామ్ గా ఒక్కటయ్యారా ? ఇద్దరూ ఎలాంటి మానసిక సంఘర్షణ అనుభవించారు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : ఒక సెల్ఫోన్లో రెండు సిమ్‌లు ఉన్నట్లే.. ఒక వ్యక్తికి రెండు మెదడులు ఉంటే, అవి రెండు రకాలుగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ‘బుర్రకథ. ఈ సినిమా కోసం ఆది పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. మెయిన్ గా సినిమాలో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తోనూ ఆది తన పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. సినిమాలో ‘ఆది’ తండ్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ తన నటనతో పాటు ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక హీరోయిన్ మిస్తీ చక్రబోర్తి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించింది. మరో హీరోయిన్ నైరా షాకు ఉన్నది కొన్ని సీన్లే అయినా గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక కీలక పాత్రల్లో నటించిన పోసాని, చంద్ర, పృథ్వి తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ : దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా..స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం మెప్పించలేకపోయాడు. కానీ ప్రీ క్లైమాక్స్ లో గాని ఇది కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ కాదు. సెకండాఫ్ నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. పైగా కథకు అవసరానికి మించి కామెడీ అండ్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద కరెక్ట్ గా ఎలివేట్ చేయలేకపోయారు. సాయికార్తీక్ సంగీతం, నేపథ్య సంగీతం అస్సలు బాలేదు.
సాంకేతిక వర్గం : దర్శకుడు రత్నబాబు మంచి స్టోరీ పాయింట్ తీసుకున్నా ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకున్నేలా ఉంది. నిర్మాత హెచ్ కె.శ్రీకాంత్ దీపాల పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన సంగీతం కూడా బాగాలేదు. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్ కూడా ఆకట్టుకోదు.
తీర్పు : దర్శకుడు రత్నబాబు రాసుకున్న కథా కథనాల్లో సరైన ప్లో లేకపోవడం, సినిమాలో కథకు అనవసరమైన పండని కామెడీ సీన్స్ ఎక్కువుగా ఉండటం..స్టోరీ పాయింట్ కి తగ్గట్లు సినిమా ఆసక్తికరంగా సాగకపోగా, స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
రేటింగ్ : 2/5
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: జార్జిరెడ్డి
22 Nov 2019, 2:57 PM
-
రివ్యూ: యాక్షన్
15 Nov 2019, 5:49 PM
-
రివ్యూ: ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’
15 Nov 2019, 4:34 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
01 Nov 2019, 3:39 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
13 Sep 2019, 4:27 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.