
`మెంటల్ మదిలో` సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినా వివేక్ ఆత్రేయ, శ్రీవిష్ణు కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. చాలా వరకు తెలుగు పదాలతోనే ఈ సినిమా ఉంటుందని ప్రమోషనల్ ఈవెంట్లోనూ శ్రీవిష్ణు చెప్పారు. కేవలం ఆడపిల్లలకోసమే ఈ సినిమాను చేశానని ఆయన అన్నారు. ప్రతి ఆడపిల్లా ఎదుర్కొనే ఆ సమస్య ఎలాంటిది? దాన్ని దర్శకుడు ఎలా డీల్ చేశాడు? మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం ! .
కథ : రాహుల్ (శ్రీవిష్ణు), రాంకీ (ప్రియదర్శి), రాంబో (రాహుల్ రామకృష్ణ).. ముగ్గురూ మంచి ఫ్రెండ్స్. వీళ్లకు చదువు అబ్బలేదు. మూడు సార్లు ఇంటర్మీడియట్ ఫెయిలై అదే క్లాస్ లో కొనసాగుతూ ఉంటారు. మిత్ర(నివేదా థామస్) చిన్నప్పుడే అమ్మానాన్నవిడిపోవడంతో, తల్లి దగ్గర పెరుగుతుంది. ఆమె చనిపోవడంతో ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరకు వచ్చి ఉంటుంది. మిత్ర తండ్రి కాలేజ్ ప్రిన్స్‌పల్. దీంతో అదే కాలేజ్‌లో మిత్ర ఇంటర్లో చేరుతుంది. అందులోనే చదివే ఆర్3 బ్యాచ్ లో రాహుల్ గ్యాంగ్ లీడర్ కాగా మిగిలిన ఇద్దరు రాకీ, రాంబో స్నేహితులుగా ఉంటారు. మిత్రతో పరిచయం స్నేహంగా మొదలై అటుపై ప్రేమగా మార్చుకునే క్రమంలో ఉంటాడు రాహుల్. ఆ సమయంలోనే కొన్ని కారణాల వల్ల ఈ ముగ్గురు స్నేహితులు మిత్రతో సహా ఓ కిడ్నాప్ డ్రామాలో భాగం కావాల్సి వస్తుంది. ఒక వైపు దర్శకుడు కావాలని అనుకుంటున్నా విశాల్ (సత్యదేవ్) తన కథ తో హీరోయిన్ షాలిని (నివేతా పెత్తురాజ్) ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఇతనికి ఆ ముగ్గురికి సంబంధం ఏంటి? డబ్బుకోసం ఎలాంటి దారులోకి ఆర్ 3 బ్యాచ్ వెళుతుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ : యువ హీరో శ్రీ విష్ణు ఈ సినిమాలో కూడా తనదైన శైలిలో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ పై దృష్టి పెట్టిన శ్రీ విష్ణు ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు. నివేదా థామస్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆమె అందం, అభినయంతో మాత్రమే కాక డాన్స్ తో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. నివేత పెతురాజ్, సత్యదేవ్ జంట కూడా చక్కగా నటించింది. వీళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. వీళ్ల పెర్ఫార్మెన్స్ లే సినిమాకు హైలెట్. ఇక ఎప్పటిలాగే ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ట్విస్టులతో సినిమాను ఆసక్తికరంగా నడిపారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం చాలా బావుంటుంది. ఫస్టాఫ్‌లో సన్నివేశాలకు, సెకండాఫ్ సన్నివేశాలను ముడిపెట్టిన తీరు బావుంది. ఇక దర్శకుడు చెప్పే కథకు, సినిమాలో రన్ అయ్యే కథతో లింక్ పెట్టడం కూడా బావుంది.
మైనస్ పాయింట్స్ : ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయనికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.
సాంకేతిక విభాగం : ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని ఎమోషనల్ కంటెంట్ ను దర్శకుడు వివేక్ ఆత్రేయ బాగా తెరకెక్కించారు. పాటలన్నీ సినిమాలో భాగంగానే ఉన్నాయి. వివేక్ సాగర్ సంగీం, నేపథ్య సంగీతం బావున్నాయి. సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ అందించిన విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ క్లీన్ గా ఉంది.
తీర్పు : ఈ “బ్రోచేవారెవరురా మూవీ వివిధ కోణాలలో ఆసక్తికరంగా సాగే కామెడీ థ్రిల్లర్. కడుపుబ్బా నవ్వించే హాస్యసన్నివేశాలు, ఆసక్తిగొలిపే మలుపులతో ఈ సినిమాని చూసే ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్: 3/5
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: జార్జిరెడ్డి
22 Nov 2019, 2:57 PM
-
రివ్యూ: యాక్షన్
15 Nov 2019, 5:49 PM
-
రివ్యూ: ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’
15 Nov 2019, 4:34 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
01 Nov 2019, 3:39 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
13 Sep 2019, 4:27 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.