(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: బందోబస్త్

September 20, 2019,   4:40 PM IST
Share on:
రివ్యూ: బందోబస్త్

తమిళ స్టార్ హీరోలు సూర్య, ఆర్య, తమిళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్, డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమా ‘కప్పాన్’కు తెలుగు అనువాదమిది. కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో “వీడొక్క‌డే”, “బ్ర‌ద‌ర్స్” చిత్రాలు చేశారు. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతకొంతకాలంగా సూర్యకు సరైన హిట్ లేదు. తెలుగులో అయితే “సింగం” తరువాత సూర్యకు మరో హిట్ పడలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు సూర్య. మరి ఈ సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరయ్యాడా ? లేదా ? చూద్దాం. 

కథ: భారత ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) ప్రజల మేలు కోరే స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు. నిజాయితీ గల ప్రధానిగా దేశానికి కీడు చేస్తోన్న వారి పై యాక్షన్ తీసుకోవటానికి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఈ క్రమంలో రవి కిషోర్ (సూర్య) ఒక పవర్ ఫుల్ ఆఫీసర్. సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగా తన డ్యూటీ చేస్తూ.. చంద్రకాంత్ వర్మకి దగ్గర అవుతాడు. ప్రధానమంత్రి చంద్ర‌కాంత్‌కి రవికాంత్ న‌చ్చ‌డంతో అత‌న్ని త‌న ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా నియ‌మించుకుంటాడు. అప్ప‌టికే ర‌వి టీమ్‌తో ఉన్న జోసెఫ్ (స‌ముద్ర‌ఖ‌ని) ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా ఉంటాడు. ప్ర‌ధానమంత్రి చంద్రకాంత్‌ని కాశ్మీర్‌లో ఓ టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ ద్వారా చంపేస్తాడు. చంద్ర‌కాంత్ స్థానంలో ఆయ‌న కుమారుడు అభిషేక్‌ (ఆర్య‌) ప్ర‌ధానమంత్రి అవుతాడు. అభిషేక్ కు ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం ఉండ‌దు. రవికాంత్ నే ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా నియ‌మించుకుంటాడు. ప్రధానిని చంపింది ఎవరు? కిషోర్ కు దీనికి ఏమైనా సంబంధం ఉందా? చంద్రకాంత్ వర్మ తర్వాత ప్రధాని ఎవరు? అసలు హంతకులు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : పొలిటికల్ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చిన ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అలరిస్తాయి. ఈ సినిమాలో కదీర్ క్యాక్టర్‌లో సూర్య వ‌న్ మ్యాన్ షోతో సినిమా అంతా తానై న‌డిపించాడు. మామూలు రైతు నుంచి ప్రధాన మంత్రి సెక్యురిటీ ఆఫీసర్‌గా సూర్య చూపించిన పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది. ప్రధాన మంత్రి పాత్రలో మోహన్ లాల్ యాక్టింగ్ బాగుంది.ఇక ఆర్య పాత్ర సెకండాఫ్‌లో ప్ర‌ధానంగా సాగుతుంది. స‌యేషా సైగ‌ల్ పాత్ర చాలా ప‌రిమితంగా ఉంది. పాట‌లు, రెండు, మూడు ల‌వ్ సీన్స్‌కే ప‌రిమిత‌మైంది. సముద్ర‌ఖ‌ణి యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ : సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. అసలు సినిమా మొదలైన చాల సమయానికి గాని ప్రేక్షకులకు సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ పై ఒక క్లారిటీ రాదు. సరే లవ్ సీన్స్ కోసం వాటిని పెట్టారు అనుకున్నా.. ఆ సీన్స్ లో లవ్ గాని, కామెడీ గాని ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు.పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. సినిమాలో కామెడి, ఎంట‌ర్ టైన్‌మెంట్ ఎక్కడా కన్పించదు. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది.


సాంకేతిక విభాగం: ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన ఎం ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బందోబస్త్ అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా తీయడంలో ద‌ర్శ‌కుడు కెవి.ఆనంద్ తడబడ్డాడు అనే చెప్పాలి. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా, యాక్షన్ డోస్ ఎక్కువైపోయిందీ. హ‌రీష్ జైరాజ్ పాట‌లు ఆక‌ట్టుకోక‌పోయినా నేప‌థ్య సంగీతం మెప్పించింది.  లైకా ప్రొడ‌క్ష‌న్ వారి నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 

తీర్పు: యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికి నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆకట్టుకోదు.

రేటింగ్ :  2.5/5

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
సూర్య, మోహన్ లాల్ ‘బందోబస్త్’ ట్రైలర్ విడుదలైంది.. ...
సూర్య, మోహన్ లాల్ ‘బందోబస్త్’ ట్రైలర్ విడుదలైంది.. ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.