(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: ఆవిరి

November 01, 2019,   4:26 PM IST
Share on:
రివ్యూ: ఆవిరి

1998లో మావిడాకులు చిత్రంతో విల్లన్ గా తెలుగు తెరకి పరిచయమైన రవిబాబు....ఆ తర్వాత పలు చిత్రాల్లో కమెడియన్, విల్లన్ గా నటిస్తూ ప్రేక్షుకుల మెప్పించాడు. 2002లో 'అల్లరి' చిత్రంతో డైరెక్టర్ గా మారి పలు కామెడీ, హర్రర్ సినిమాలను తెరకెక్కించాడు. తాజాగా దిల్ రాజు సమర్పణలో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఆవిరి". ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : రాజ్‌ కుమార్ రావు (రవిబాబు) తన భార్య లీనా( నేహా చౌహాన్) మరియు కూతుర్లు శ్రేయ, మున్నిలతో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్న క్రమంలో.. ఓ ప్రమాదంలో పెద్ద కూతురు శ్రేయ చనిపోతుంది.  దాంతో ఆ ఇంట్లో ఉంటే శ్రేయనే గుర్తుకు వస్తుందని.. ఒక పాత పెద్ద బంగ్లాలోకి ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు. కొత్త ఇంటికి వెళ్లిన మున్ని (శ్రీ ముక్తా) విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆవిరి రూపంలో ఉండే దెయ్యం ఆ కుటుంబానికి చెందిన మునిని లోబర్చుకుంటుంది.ఆ దెయ్యం చెప్పినట్లుగా ముని వింటూ ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. చివరికి ఆ దెయ్యం సాయంతో ఇల్లు వదిలిపోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అసలు మున్ని ఎందుకు ఇల్లు వదిలి వెళ్లిపోవాలనుకుంది ? ఈ క్రమంలో రాజ్ కుమార్, లీనా ఏం చేశారు ? ఇంతకీ మున్నితో మాట్లాడుతున్న ఆ దెయ్యం ఎవరు ? ఆ దెయ్యానికి రాజ్ కుమార్ కి సంబంధం ఏమిటి ? ఆ దెయ్యం దేని కోసం రాజ్ కుమార్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : తక్కువ పాత్రధారులతో తెరకెక్కించిన ఆవిరిలో అందరూ బాగానే నటించారు. ముఖ్యంగా మూడు పాత్రలు సినిమా మొత్తం కనిపిస్తాయి. బిగ్‌బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న హిమజ కమల పాత్రలో కనిపించింది ఒక్క సీన్‌లోనే అయినా పర్వాలేదనిపించింది. రవిబాబు మరోసారి విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు.కూతురు ఆపదలో ఉన్న తండ్రి పాత్రలో రవిబాబు మంచి నటన కనబర్చాడు. భరణి శంకర్‌ నటన చాలా బాగుంది.ఆయన బాడీ లాంగ్వేజ్‌ కూడా ఆకట్టుకుంది.పాప నటన చాలా బాగుంది.ఆమె సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆపదలో చిక్కుకున్న కూతుర్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో వచ్చే సీన్స్ అలాగే క్లైమాక్స్ లో భార్య ప్రాణం మీదకు వచ్చిన సందర్భంలో కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేస్తూ.. చెప్పే చిన్న ప్లాష్ బ్యాక్.. ఇక సినిమాలో అక్కడక్కడా రేర్ గా ఆకట్టుకునే కొన్ని హారర్ ఎలిమెంట్స్ .. ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

మైనస్ పాయింట్స్: చాల సన్నివేశాలను అనవసరమైన ల్యాగ్ తో సాగతీయడంతో ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని కూడా నీరుగార్చాడు. ఆత్మలను ఆవిరితో పోల్చడం.. దెయ్యాలకు వేడీ అంటే భయమని చెప్పడం.. పర్వాలేదనిపించినా వాటిని స్క్రీన్‌పై నమ్మేట్టు తెరకెక్కించలేకపోయాడు. కొత్తగా ఉంటుందని నమ్మి వెళ్లే ప్రేక్షకులకు మాత్రం నిరాశనే కలిగించాడు. అలాగే కొన్ని సన్నివేశాల్లో నాటకీయత కూడా ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. రవిబాబు స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది. ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది.

సాంకేతిక విభాగం : దర్శకుడు రవిబాబు రాసుకున్న కథ కథనంలో పెద్దగా ఇంట్రస్ట్ లేకపోవడం, సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. ఇక వైద్య అందించిన సంగీతం బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఆయన దర్శకుడు ఏది చెబితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిన్నట్లు అనిపిస్తోంది. తనకున్న పరిధిలో సినిమాకు కావాల్సినవన్నీ నిర్మాత సమకూర్చాడు.

తీర్పు : 'ఆవిరి' ఆవిరైపోయింది... 

రేటింగ్‌ : 2/5

 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
రేపు వస్తున్న
రేపు వస్తున్న "ఆవిరి"

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.