(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: '2 అవ‌ర్స్ ల‌వ్‌`

September 06, 2019,   4:11 PM IST
Share on:
రివ్యూ: '2 అవ‌ర్స్ ల‌వ్‌`

ప్రేమ అనేది పలకడానికి రెండు అక్షరాలే, అయిన ఈ ప్రేమ అనే దాని మీద ఎందరో కవులు ఎన్నో నవలలు రాసారు. మరెందరో డైరెక్టర్స్ ఈ రెండు అక్షరాలా ప్రేమని కథగా మలిచి ఎన్ని సినిమాలు తీశారు, తీస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ కి సంబంధించిన సినిమాలలో ఎమోష‌న్స్ చాలా కీల‌కంగా ఉంటాయి. వాటి గ్రిప్పింగ్‌గా ప్రేక్ష‌కులు మెచ్చేలా ఎలా తెర‌కెక్కించామ‌నేదే కీల‌కం. వెండితెర‌పై ఎన్నో ప్రేమ‌క‌థ‌లు వ‌స్తుంటాయి. అయితే కొన్ని మాత్ర‌మే ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందుతుంటాయి. అందుకు కార‌ణం స‌ద‌రు ద‌ర్శ‌కులు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించ‌డ‌మే. అలాగే ప్రేమ క‌థా చిత్రాల్లో ఉండే ల‌వ్‌, ఎమోష‌న్స్‌ను మిస్ కానీయ‌కుండా చూసుకోవ‌డం. ఇప్పుడు అలాంటి ఓ కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమాయే `2 అవ‌ర్స్ ల‌వ్‌`. శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాణంలో శ్రీ ప‌వార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం ‘2 అవ‌ర్స్ ల‌వ్‌’.  కృతి గార్గ్ హీరోయిన్‌. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం... 

కథ : దొంగ‌త‌నం చేసే ఓ దొంగ‌(అశోక్ వ‌ర్ధ‌న్‌) ఓ ఇంట్లోకి దొంగ‌త‌నం కోసం వెళ‌తాడు. అక్క‌డ ఓ అమ్మాయి రాసుకున్న డైరీ దొరుకుతుంది. దాన్ని చ‌దువడం స్టార్ట్ చేస్తాడు. దాంట్లో ఆదిత్‌(శ్రీప‌వార్‌), నైనా(కృతిగార్గ్‌) ప్రేమ క‌థ ఉంటుంది. ఆదిత్ (శ్రీ పవార్), అవికా (క్రితి గార్గ్‌)ని చూడగానే ఆమెతో ప్రేమలో పడతాడు. అవికా కూడా ఆదిత్ ని అలాగే ప్రేమిస్తోంది. అయితే కేవలం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటలు మాత్రమే ప్రేమిస్తానని కండిషన్ పెడుతుంది. కానీ ఆదిత్‌కు నైనా ప్రేమ జీవితాంతం కావాల‌నుకుంటాడు. అస‌లు నైనా ఎందుకు పేరు మార్చుకుని ఆదిత్‌ను ల‌వ్ చేస్తుంది. అది కూడా రెండు గంట‌లు మాత్ర‌మే ఎందుకు ల‌వ్ చేస్తుంది? వీరిద్ద‌రి వెనుకున్న క‌థేమిటి? డైరీ చ‌దివిన దొంగ ఏం చేస్తాడు? ఆదిత్‌, నైనాల జీవితాల్లో డైరీ కార‌ణంగా చోటు చేసుకునే ప‌రిణామాలేంటి? చివరికీ ఆదిత్ – నయనా ఒక్కటయ్యారా ? లేదా ? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ : సినిమాకు ప్ర‌ధాన బ‌లం హీరో, ద‌ర్శ‌కుడు శ్రీప‌వార్ అనుకున్న మెయిన్ పాయింట్‌. సినిమా పేరులోనే 2 అవ‌ర్స్ ల‌వ్ ఉన్నట్లు.. ఈ సినిమా కూడా ఎక్కువుగా ఆ ‘2 అవ‌ర్స్ ల‌వ్’ అనే పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ పవార్ తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. శ్రీప‌వార్‌. హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం చేయ‌డ‌మ‌నేది కాస్త క‌ఠిన‌త‌ర‌మైన విష‌య‌మే. అయినా కూడా శ్రీపవార్ సినిమాను తెర‌కెక్కించిన తీరు చూస్తే అభినందించాల్సిందే. హీరో, హీరోయిన్ పాత్ర‌ల‌ను చ‌క్క‌గా డిజైన్ చేశాడు. హీరోయిన్ గా నటించిన కృతి గార్గ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే రౌడీ గ్యాంగ్ కి లీడర్ గా నటించిన నూతన నటుడు శ్రీనివాస్ రాజు అద్భుతంగా నటించాడు. తన కామెడీ టైమింగ్ తో తానూ కనిపించిన నాలుగైదు సీన్స్ లోనూ ఆయన అలరిస్తారు. 

మైనస్ పాయింట్స్: దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత ఆసక్తి కరంగా సాగని సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. కొన్ని ప్రేమ సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. కథ కథనాల్లో మాత్రం ప్లో మిస్ అయింది.దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది.

సాంకేతిక విభాగం : మొత్తంగా దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు.  సంగీత దర్శకుడు గ‌్యాని సింగ్‌ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ లవ్ స్టోరీకి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది.అలాగే ప్ర‌వీణ్ వ‌న‌మాలి సినిమాటోగ్ర‌ఫీ సింప్లీ సూప‌ర్బ్‌. మినిమం బ‌డ్జెట్ చిత్రానికే ఈ రేంజ్ సినిమాటోగ్ర‌ఫీ ఇవ్వ‌డం గొప్ప విష‌యం.ఇక శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

తీర్పు : కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌ల‌ను చూడాల‌నుకునే వారికి త‌ప్ప‌కుండా న‌చ్చే సినిమా.. 

రేటింగ్‌ : 2.25/5

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.