(Local) Fri, 22 Nov, 2019

టీఆర్ఎస్ జోరుకు మహాకూటమి బ్రేకులు వేసేనా ?

November 06, 2018,   3:40 PM IST
Share on:
టీఆర్ఎస్ జోరుకు మహాకూటమి బ్రేకులు వేసేనా ?

 నిధులు, నీళ్ళు, నియామకాలు అంటూ ఏర్పాటైన టీఆర్ ఎస్ పార్టీ 2014లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి అధికారంలోకి వచ్చింది. నాటినుండి రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ  కార్యక్రమలను చేపట్టింది. వాటి ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలంటే మరో ఐదేళ్ళు అధికారంలో వుండాలనే లక్ష్యంతో  శాసన సభ పదవీకాలం పూర్తి కాకుండా  మరో 8 నెలల గడువుండగానే   పార్టీ అధ్యక్షుడు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శాసన సభను రద్దు  చేశారు. సభ రద్దు ప్రకటనతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల 105 మందితో కూడిన అభ్యర్దుల తొతిలిస్ట్ ను ప్రకటించి అందరిని ఆశ్యర్యంలో మంచెత్తారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది. దీంతో టీఆర్ ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించాలనే ఏకైక లక్షంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఒకటిగా జత కట్టేందుకు ముందుకు వచ్చాయి.  ఈ క్రమంలో పాత కక్షలను సైతం పక్కన పెట్టి తెలుగు దేశం , కాంగ్రేస్ పార్టీలు చేతులు కలిపాయి. వీటితోపాటు తెలంగాణా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన టీజేస్ కన్వినర్  ప్రొఫెసర్ కోదండరాం పెట్టిన నూతన పార్టీ తెలంగాణా జన సమితి తోపాటు సీపీఐ పార్టీలు ఈ కూటమితో జత కట్టాయి. కాని త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మహాకూటమి తెలంగాణా ప్రజల ఆమోదం ఏమేరకు పొందుతారనేది వేచిచూడాల్సిందే.
గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు :
2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తూ ఈ ఎన్నికల గోదాలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆపార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నాలుగేళ్ళలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్హి సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వివరిస్తూ వారి ఆమోదం పొందుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పలు బహిరంగ సభలలో పాల్గొని  ఈ సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలంటే మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని ఆయన  పునరుఘ్దాటించారు.
మహాకూటమి బలమెంత : 
 టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన మహాకూటమి బలమెంతనేది ఇప్పటికి అర్ధం కాని పరిస్థితి. ఇప్పటి వరకు పొత్తుల విషయంలో ఒక కొలిక్కి రాకపోవడం ఆ పార్టీ నేతల్లో నైరాష్యం నెలకొంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది ఏదో ఒకటి త్వరగా తేల్చాలంటూ.. లేదంటే తమదారితాము చూసుకుంటామంటూ  తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం టీపీసీసీ నేతలను హెచ్చరించారు. దీంతో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో న్యూడిల్లీలో ప్రొఫేసర్  కోదండరాం సమావేశాన్ని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు.  అయిన సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికి కిలిక్కిరాలేదు. తాజాగా సోమవారం కోదండరాంతో టీపీసీసీ ఛీఫ్ నగరంలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. మరో రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు విషయం ఒక కొలిక్కి వస్తుందన్నారు.
కీలకం కానున్న సెటిలర్లు  మైనార్టీల ఓట్లు :
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు మైనార్టీల ఓట్లే కీలకం కానున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కావడంతో ఆంధ్రా నుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు నగరాని వచ్చి స్థిరపడ్డారు.
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కౌలు రైతులు వున్నారు. దీంతో వారి ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.  సహజంగానే తమకు అనుకూలమైన నేతలను ఎన్నుకునే అవకాశం వుండడంతో హైదరాబద్ నగరంలో సెటిలర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సెటిలర్లనే రంగంలోకి దింపాలని పలు పార్టీల నేతలు యోచిస్తున్నారు. గతంలో టీడీపీ పార్టీ నుండి గెలిచి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యెలను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ వుంది.  మహకూటమితో సీట్ల సర్దుబాటులో బాగంగా ఆయా స్థానాలను టీడీపీ పార్టీ సెటిలర్లైన ఆపార్టీ నాయకులనే రంగంలోకి దింపనుంది. ఇటు బీజేపీ  పార్టీ సైతం సెటిలర్లనే రంగలోకి  దింపాలని యోచిస్తోంది. ఇకపోతే మైనార్టీలంటేనే సహజంగా కాంగ్రేస్  ఓటు బ్యాంక్. అలాంటిది  మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మైనార్టీలకు  12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ టీఆర్ఎస్ గతంలో ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్టా మైనార్టీలు ఏపార్టీని ఆదరిస్తారో అపార్టీకే విజయవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. ఈ క్రమంలో మహాకూటమి నేతలు సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకుని త్వరగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలిగే దానిపైనే వారి విజయవకాశాలు ఆధారపడనున్నాయి. 
   
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.