(Local) Wed, 26 Feb, 2020

దేశ వెన్నెముక‌ను ఆదుకునే పార్టీలే లేవా...?

November 22, 2018,   5:38 PM IST
Share on:
దేశ వెన్నెముక‌ను ఆదుకునే పార్టీలే లేవా...?

జై జ‌వాన్ , జై కిసాన్ , రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు..రైతే రాజు. అలాంటిది రైతు ఏడ్చినా రాజ్యం లేదు, ఎద్దు ఏడ్చినా వ్య‌వ‌సాయం లేదు. రైతు లేనిదే దేశం మ‌నుగ‌డ లేదంటూ అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ ప్రార్టీలు సైతం ఎన్నిక‌ల సంద‌ర్బంలో ఎన్నో  హామీలు,  ఈ ఊకదంపుడు ప్ర‌సంగాల‌తో అధికారం చేజిక్కుకోవాల‌నే ల‌క్ష్యంతో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతారు. అంద‌లం ఎక్కిన త‌రువాత అన్ని హామీల‌ను అట‌కెక్కిస్థారు. కాని దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాబ‌ల్యం పెరిగిన ఈ త‌రుణంలో పోటీలు ప‌డి హామీల మీద హామీలు గుప్పిస్తూ వారి ప్ర‌స‌న్నం కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డ‌తారు.కానీ,వారు ఆర్థికంగా ఎద‌గ‌డానికి మాత్రం ఎవ‌రూ కృషి చేయ‌డం లేదు. 
ఎప్పుడు వ‌స్తాడో తెలియ‌ని ప‌రిస్థితి :
ఉద్యోగ‌స్థులు వారి ఆఫీస్ టైం ప్రకారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తారు. కానీ రాత్ర‌న‌కా,ప‌గ‌ల‌న‌కా ఏ టైము లేకుండా ఎప్పుడు ప‌డితే అప్పుడు పొలం ప‌నికి వెళ్లిన రైతు ఇంటికి ఏప్పుడు వస్తాడో తెలియ‌క అత‌ని భార్యా పిల్ల‌లు ఎదురు చూస్తూ ఉంటారు, అంత క‌ష్ట ప‌డి పండించిన పంట‌కు రోగం వ‌స్తే ఎ మందు పిచికారి చేయాలో, ఇందులో అస‌లు మందులు ఏవో న‌కిలీ మందులేవో తెలియ‌క అప్పు చేసి పెట్టుబ‌డి పెట్టి పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర రాక చేసిన అప్పులు  తీర్చ‌లేక బ్ర‌త‌క లేక చావ లేక న‌లుగుతున్న స‌గ‌టు రైత‌న్న‌ను ఆదుకునే నాయ‌కుడే లేడా ..?  
ఆల్ ఫ్రీ..  ? నో యూజ్ ...
ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి అన్ని  రాజ‌కీయ పార్టీల నాయ‌కుల ఆల్ ఫ్రీ.. అంటూ వాకిట్లో వాల్తారు. హామీల మీద హామీలు గుప్పిస్తారు. రైతుల‌ను నెత్తిన పెట్టుకుంటారు.వారికి ఎరువులు ఉచితం, వ్య‌సాయానికి క‌రెంటు ఉచితం,  రుణ మాఫీ , విత్త‌నాల పై స‌బ్సీడీ,అంటూ  ఈ ప్ర‌భుత్వంలో రైతుల‌కు అన్నీ ఫ్రీ అంటారు. అదే ఉద్యోగ‌స్తుల‌కు అయితే ఇంక్రిమెంట్లు అంటారు.  కాని అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శ‌ని వుంద‌న్న‌ట్టు వుంది రైతుల ప‌రిస్థితి. ఇన్ని ర‌కాలుగా వారికి ఉచితంగా ఇచ్చినా ఏం లాభం ? వారి క‌ష్టాలు తీరేదెలా? 
గిట్టు బాటు ధ‌ర ఏది ..?
ఆరుగాలం క‌ష్ట ప‌డి పండించిన పంట‌కు గిట్టు బాటు ధ‌ర ఏది,  తను పండించిన పంట‌ను అమ్ముకోవ‌డానికి మార్క‌ట్‌కి తీసుకెళ్లితే నాసీ రకం అని ఒక‌రు, తేమ వుంద‌ని మ‌రొక‌రు అక్క‌డా నిలువు దోపిడీయే, చేసేది లేక, తిరిగి స‌రుకు ఇంటికి తీసుకెళ్ళ లేక ఎంతో కొంత‌కు అమ్మేయ‌గా వ‌చ్చిన డబ్బులు వ‌డ్డీలు క‌ట్ట లేక త‌నువు చాలిస్తున్న వారెందరో ?  
వేత‌నాలు పెంచుకునే హ‌క్కు :
ఉద్యోగ‌స్తులు త‌మ వేత‌నాల‌ను పెంచుకునే హ‌క్కును వారికి రాజ్యాంగ ధ‌ర్మాస‌నం క‌ల్పించింది. ఐదేళ్ళ‌కోసారి ప్ర‌జ‌లు ఎన్నుకునే నాయ‌కుల‌కు సైతం త‌మ వేత‌నాల‌ను ఇటీవ‌లి కాలంలో ప్ర‌భుత్వం పెంచింది. అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌ను టీచ‌ర్లుగా ప్ర‌మోట్ చేస్తూ 4 వేల నుండి 10 వేల‌కు పెంచింది. 1500ల రూపాయ‌లున్న స‌ర్పంచ్‌లకు  3 వేల రూపాయ‌లు చేశారు. అలాగే నెల‌కు 75,000 వేలున్న ఎమ్మెల్యేల వేత‌నాలు డ‌బుల్ చేసి ల‌క్షా యాభై వేల‌కు పేంచెశారు. ఇంక ఉద్యోగ‌స్థులు జీతాలు పెంచాలంటూ ఎలాగు ధ‌ర్నాలు చేసి  పెంచేసుకుంటారు . వ్యాపార‌స్థులేమో వారు త‌యారు చేసిన వ‌స్తువుకు ధ‌ర ఇంత అని నిర్ణ‌యించి లాభాల‌కు అమ్మేసుకుంటారు. రైతుల‌కు ఉచితం, స‌బ్సీడీలు ఇవ్వ‌డం కాదు,  ద‌ళారుల బారిన ప‌డి రైతులు మోసపోకుండా వారు పండించిన పంట‌కు వారే ధ‌ర‌ను నిర్ణ‌యించుకునే హ‌క్కును క‌ల్పించి, వారు అమ్ముకునేందుకు ఆయా ప్ర‌భుత్వాలు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటేనే  వారి కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. కేంద్ర , రాష్ట్రా ప్ర‌భుత్వాలు  ఈ దిశ‌గా అడుగులు వేస్తేనే దేశానికి రైతు వెన్నెముక అన్న నినాదానికి న్యాయం చేకూరుతుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.