(Local) Wed, 26 Feb, 2020

చెయ్యి విరిగింది,సైకిల్ పంక్చ‌ర్, వాడిన క‌మ‌లం, కారు జోరందుకుంది.

December 11, 2018,   3:36 PM IST
Share on:
చెయ్యి విరిగింది,సైకిల్ పంక్చ‌ర్, వాడిన క‌మ‌లం, కా ...

ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల నాడీని ఎవ‌రు ఒడిసి ప‌ట్ట‌లేక పోయారు. అధికార పార్టీకి ప్ర‌జ‌లు తిరిగి పట్టం క‌డ‌తార‌ని  కొన్ని స‌ర్వేలు, ఓట‌మి త‌ప్ప‌ద‌ని మ‌రి కొన్ని స‌ర్వేలు చెబుతూ వ‌చ్చాయి.  ఎనిమిది నెల‌ల ముందుగానే టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తుకు వెళ్లింది. దీంతో  అన్ని పార్టీలు  ఈ ఎన్నిక‌ల‌ను ఒక స‌వాల్ గా తీసుకున్నాయి. హెమా హేమీలు రంగంలోకి దిగారు. పోటీలు ప‌డి ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు. బీజేపీ నుండి ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్ర మోడితో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు రోడ్ షోలు, ప్రచార స‌భ‌ల్లో లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సైతం ప్రచారం లో పాల్గొన్నారు. రాహుల్ గాంధి రెండు విడ‌త‌లుగా రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో క‌లిసి రోడ్ షోలు, ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు. అయినా అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపుని అడ్డుకోలేక పోయారు. నాన్న పందులు గుంపుగా వ‌స్తాయి, సింహం సింగిల్ గా వ‌స్తుంద‌న్న కేటీఆర్ మాట‌ని నిజం చేస్తూ ప్ర‌జ‌లు తీర్పునిచ్చారు. 
ఉత్కంఠకు తెర తీసిన ముంద‌స్తు :
ఎనిమిదిన్న‌ర నెల‌ల ప‌ద‌వీ కాలం ఉండ‌గానే సెప్టెంబ‌ర్ 6న  ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్టు  కేసీఆర్ ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. అప్ప‌టి వ‌ర‌కు అధికార పార్టీకి అన్ని విధాలుగా అనుకూల ప‌వ‌ణాలే వీచాయి. ప్ర‌భుత్వం ర‌ద్దు తోపాటు 105 మంది అభ్య‌ర్ధ‌ల‌తో తొలివిడత జాబితాను సీఎం కేసీఆర్ ఆ వెంట‌నే విడుద‌ల చేసి ప్ర‌త్య‌ర్దుల‌ను కోలుకోని దెబ్బ తీశారు. ఈ 105 మంది  అభ్య‌ర్ధుల్లో  కాంగ్రేస్, టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రేస్‌, బ‌హుజ‌న స‌మాజ్‌ వాదీ పార్టీల నుండి గెలిచిన 35 మంది  ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన వారికి కూడా టీఆర్ఎస్ పార్టీ టికెట్ కెటాయించింది. దీంతో  ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో గ‌తంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్య‌ర్ధులతో పాటు, టికెట్ ఆశిస్తున్న ఆశావ‌హులు ఎక్కువగా ఉండ‌టంతో ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో ఒక్క సారిగా అస‌మ్మ‌తి సెగ‌లు రాజుకున్నాయి. ఒకానొక ద‌శ‌లో అధినేత‌ను సైతం ధిక్క‌రించి విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి కొంద‌రు రెబ‌ల్స్ గా బ‌రిలో నిలిచారు. ఇటు కాంగ్రేస్ టీడీపీ టీజేఎస్ సీపీఐ పార్టీలు  మ‌హాకూట‌మిగా జ‌త క‌ట్టి అధికార పార్టీకి గ‌ట్టి పోటీని ఇచ్చేందుకు సంకేతాలు పంపాయి. ఇక కారు పంక్చ‌ర్ అయింది. కూట‌మి బ‌లం పుంజుకుంది అనుకున్నారు. దీంతో  అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రెస్ట్ శిఖ‌రంలా వున్న టీఆర్ఎస్‌ గ్రాఫ్ ప‌డుతూ వ‌చ్చిన‌ట్టే అనిపంచింది.   
మొండి చెయ్యి :
తెలంగాణ ఇచ్చిన పార్టీగా త‌మ‌ను ఆద‌రిచాల‌ని  ప్ర‌జ‌ల ముందు  ఎన్ని ఎత్తులేసినా వారి పాచిక‌లు పార‌లేదు. ల‌క్ష ఉద్యోగాలిస్తాం, ఏక కాలంలో 2 ల‌క్ష‌ల ఋణ మాఫీ చేస్తాం డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ల‌క్ష వ‌ర‌కు వ‌డ్డీ లేని ఋణాలిస్తాం నిరుద్యోగ బృతి ఇలా ఆచ‌ర‌ణ సాధ్యం కాని ఎన్ని హామీలిచ్చినా అన్నీటికి మేమున్నాం అంటూ ఆప‌న్న హ‌స్తం అందిచాల‌ని చూసిన‌ చేతినే ప్ర‌జ‌లు విరిచారు. 
క్యాడ‌ర్ కాకా విక‌లు :
తెలంగాణలో తెలుగు దేశం పార్టీ క‌నువ‌రుగు అవుతుంద‌నుకునే స‌మ‌యంలో త‌మ పార్టీ గుర్తు పై గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసినా త‌మ క్యాడ‌ర్ చెక్కు చెద‌ర‌లేద‌ని గొప్ప‌లు చెప్పుకునే ఆ పార్టీ నాయ‌కులకు ప్ర‌జ‌లు దిమ్మ తిరిగే షాకిచ్చారు.
పేరు గొప్ప ఊరు దిబ్బ :
తెలంగాణ రాష్ట్ర సాధ‌నలో కీల‌క పాత్ర పోషించిన జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ ప్రోఫేర్ కోదండరాం టీఆర్ఎస్ పార్టీ అనుకున్న రీతిలో రాష్ట్ర అభివృధ్ది సాధించ‌డంలో విఫ‌లం చెందిందంటూ వేరు కుంప‌టి పెట్టుకున్న ఆయ‌న తెలంగాణ జ‌న స‌మితి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క పాత్ర పోషించిన త‌మ‌కు ఉద్యోగుల‌నుండి అంతే మ‌ద్ద‌తుంటుద‌ని గొప్ప‌లు ప‌లికి కోదండ‌రాం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా త‌యారైంది. 
కూట‌మికి మైన‌స్ పాయింట్ :
అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా త‌మకు అనూల స‌మ‌యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. ఆ విధంగానే టీఆర్ఎస్ పార్టీ  సెప్టెంబ‌ర్ 6న  ప్ర‌భుత్వం ర‌ద్దు తోపాటు 105 మంది అభ్య‌ర్ధ‌ల‌తో తొలివిడత జాబితాను సీఎం కేసీఆర్ ఆ వెంట‌నే విడుద‌ల చేసి ప్ర‌త్య‌ర్దుల‌ను కోలుకోని దెబ్బ తీశారు. అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిదే త‌డువుగా వారు ప్ర‌జా క్షేత్రంలో దూకారు. కాని నామినేష‌న్ వేసే గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్నా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌క పోవ‌డం, ప్ర‌జా స్వామ్యానికి మారు పేరంటూ అధిష్టానం ఎవ‌రి పేరు చెబితే వారే  సీఎం అవుతార‌ని. ఆ వ‌ర్గాలు పేర్కొన‌డం ఎన్నిక‌ల నాటికి సీఎం అభ్య‌ర్ధిని ప్రక‌టించ‌క పోవ‌డం ప్ర‌జా కూట‌మిని ఎవ‌రు న‌మ్మే ప‌రిస్థితులు ఉత్ప‌న్నం కాలేద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.
చ‌రిత్ర‌ను తిర‌రాసిన కేసీఆర్ : 
గ‌తంలో ముంద‌స్తుకు వెళ్ళిన ప్ర‌భుత్వాలకు ఆశాభంగం ఏర్ప‌డింది. వారిని ప్ర‌జ‌ల చేత తిర‌స్కారాని గురైనారు. గ‌తంలో 1983లో కోట్ల విజ‌య భాస్క‌ర్ రెడ్డి ముంద‌స్తుకు వెళ్లి బోర్లా ప‌డ్డారు. అప్పుడే ఎన్టీరామారావు ఆధ్వ‌ర్యంలో నూత‌నంగా ఏర్పాటైన తెలుగు దేశం పార్టీకి ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. అనంత‌రం 2003లో చంద్ర‌బాబు సార‌ధ్యంలోని తెలుగు దేశం పార్టీ ముంద‌స్తుకు వెళ్ళి ప్ర‌జ‌ల తిర‌స్కారానికి గురైంది. ఆ ఎన్నిక‌ల్లో తిరిగి కాంగ్రేస్ పార్టీ అధికారాన్ని చేజించుకుంది. కాని2014లో నూతంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింది. మ‌రో ఎనిమిదిన్న‌ర నెల‌ల ప‌ద‌వీ కాలం ఉండ‌గానే సెప్టెంబ‌ర్ 6న  ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్టు  కేసీఆర్ ప్ర‌క‌టించి 2018 నవంబ‌ర్ లో తిరిగి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళారు. కాని ఈసారి టీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డంలో ఆపార్టీ అధినేత కేసీఆర్ విజ‌యం సాధించారు. అంతే కాకుండా గతంలో కంటే ఎక్కువ సంఖ్య‌లో ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుని  చ‌రిత్ర తిర‌గ రాశారు.     

 

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.