(Local) Wed, 26 Feb, 2020

కొత్త పుంత‌లు తొక్కుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారం

November 13, 2018,   12:01 PM IST
Share on:
కొత్త పుంత‌లు తొక్కుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారం

నేత‌ల రాత‌ల‌ను మార్చే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు రాజ‌కీయ నాయ‌కులు అనేక ప‌న్నాగాలు ప‌న్నుతుంటారు.వారిని అక‌ట్టుకునేందుకు ప‌లు విధాలుగా అస్త్రాల‌ను సంధిస్తుంటారు. ఎన్నిక‌లు వ‌చ్చాయంటే చాలు నాయ‌కులు ఓట‌ర్ల‌ను నెత్తిన పెట్టుకుంటారు. వారి ప్ర‌స‌న్నం కోసం ఎన్నో ప్ర‌చ‌త్నాలు చేస్తుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాల‌జీని ఆధారంగా చేసుకుని నేత‌లు త‌మ ప్ర‌చారానికి సాంకేతిక‌త‌ను జోడిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగా ప్ర‌జ‌ల‌తో గంట‌ల త‌ర‌బడి మీటింగ్‌లు పెట్ట‌కుండా స‌మ‌యాన్ని ఆదా చేస్తూ వీలైనంత వ‌ర‌కు త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మందిని క‌లిసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో బాగంగా క్షేత్రస్థాయిలో ప్ర‌జ‌లను ప‌ల‌క‌రిస్తూ త‌మ‌కే మీ అమూల్య‌మైన ఓటును వేయాలంటూ అభ్య‌ర్థిస్థుండ‌టం గ‌మ‌నార్హం. క్రితం ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధులు త‌మ నియోజ‌క వ‌ర్గానికి సంబందించిన ఓట‌ర్ల జాబితాను సేక‌రించి వారి మొబైల్‌కు మెస్సేజ్‌ల రూపంలో పంపిస్తూ మీ అమూల్య‌మైన ఓటు ను మాకే వేయాలంటూ ప్ర‌చారం చేస్తూండేవారు.
నూత‌న ప్ర‌చారానికి తెర‌తీసిన నాయ‌కులు :
ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ దాదాపు పూర్తి కావ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేశారు. సీట్ల కేటాయింపు మొదలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో అన్ని పార్టీల క‌న్నా టీఆర్ఎస్ అభ్య‌ర్థులు త‌మ త‌మ నియోజ‌క వ‌ర్గాల‌లో విస్తృతంగా ప్ర‌చారం  నిర్వ‌హిస్తూ దూసుకుపోతున్నారు. మ‌హాకూట‌మి సీట్ల స‌ర్ధుబాటు ప్ర‌క్రియ పూర్తి కాక‌పోవ‌డంతో వారు ఇంకా ప్ర‌చారం ప్రారంచించ‌లేదు. టికెట్ త‌మ‌కే వ‌స్తుంద‌కున్న సీనియ‌ర్ నాయ‌కులు మాత్రం త‌మ నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌చారం చేప‌ట్టారు. ఎలాగైనా మ‌ళ్ళీ అధికారం చేజిక్కించు కోవాల‌ని టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, టీఆర్ఎస్ ని ఓడించాల‌నే ల‌క్ష్యంతో మ‌హాకూట‌మి నేత‌లు అంది వ‌చ్చిన అన్ని అవ‌కాశాల‌ను అంది పుచ్చుకుంటున్నారు. ప్ర‌ధానంగా త‌క్కువ స‌మ‌యంలో ఎక్క‌వ మందికి తెలియా ప‌ర‌చాల‌నే ఉద్ధేశంతో  నాయ‌కులు నూత‌న ప్ర‌చారానికి తెర‌తీశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మెస్సేజ్‌లు , వాయిస్ మెస్సేజ్‌ల రూపంలో ప‌ల‌క‌రించిన నాయ‌కులు వీలైనంత వ‌ర‌కు సోష‌ల్ మీడియానే ఉప‌యోగించుకుంటున్నారు. ఫేస్‌బుక్ ట్విట్ట‌ర్ ఇన్‌స్టాగ్రామ్ పిన్ట్ర‌స్ట్‌ లాంటి నూత‌న టెక్నాల‌జీని వాడుకుంటూ ప్ర‌చారంలో దూసుకు పోతున్నారు. 
కూలీలుగా మారుతున్న నాయ‌కులు :
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్య‌ర్థులు త‌మ నియోజ‌క వ‌ర్గంలోని ప‌లు దుఖాణాల‌కు వెళ్ళి వారి మెప్పు పొందేందుకు ఆ ప‌నిని వీరు చేస్తూ ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. కొబ్బరి బోండాల బండీ వ‌ద్ద‌కు వెళ్ళి బోండాలు కొడుతూ ఒక‌రు, సెలూన్ షాపుకు వెళ్ళి క్ష‌వ‌రం చేస్తూ మ‌రొక‌రు. పంట పొలాల వ‌ద్ద వ‌రిచేలు కోస్తూ, దోబీ ఘాట్‌కు వెళ్ళి బ‌ట్ట‌లుకుతూ కుమ్మ‌రి వారి వ‌ద్ద కుండ‌లు చేస్తూ ఇలా ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తూ ఓర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు ఇప్పుడు నేరుగాఓట‌ర్ల‌కు ఫోన్‌లు చేసి నేను ఫ‌లానా పార్టీ నుండి పోటీ సేస్తున్న న‌న్ను గెలిపిస్తే మీ ఊరిని, వాడ‌ని బాగా అభివృధ్ధి చేస్తానంటూ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మీ అమూల్యమైన ఓటు నాకే వేయ్యాల‌ని ప‌దే ప‌దే  ఫోన్లు చేయ‌డం విశేషం.
ఓట్లు రాలేనా ?
ఐదు సంవ‌త్స‌రాల‌కు ఒక సారి వ‌చ్చే ఎన్నిక‌లతో నేత‌ల త‌ల‌రాత‌ల‌ను మార్చే ఓట‌ర్ల‌ను ఆన్ని విధాలుగా ప్ర‌స‌న్నం  చేసుకుంటున్న రాజ‌కీయ నాయ‌కుల తీరును వారు గ‌మ‌నిస్తూనే ఎన్నిక‌ల్లో మాత్రం ఎవ‌రిని గెలింపిచాల‌నుకుంటున్నారో వారికే ఓటేసి గెలిపిస్తారు. అభ్య‌ర్థులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓట‌ర్లు మాత్రం త‌మ నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుంది, ఎవ‌రికి విజ‌యం క‌ట్ట‌బెడ‌తారన్న‌ది మాత్రం ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.