(Local) Thu, 04 Jun, 2020

అనుకున్నదే అయ్యింది ...!

December 18, 2018,   1:48 PM IST
Share on:
అనుకున్నదే అయ్యింది ...!

ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నట్టుగానే అది అక్షరాల నిజం అయింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు తారక రామారావు తెలంగాణకు కాబోయే భవిష్యత్ ముఖ్యమంత్రిగా అందరూ అనుకున్నట్టుగానే అడుగులు పడుతున్నాయి. గత 14 సంత్సరాలుగా పార్టీలో ఒక్కొక్క పదవిని చేపట్టి ఆయన ఆ పదవులకే వన్నె తెస్తున్న కేటీఆర్ ని ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీలో అత్యంత కీలక పదవి వరించింది. ఇక మిగిలింది రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దక్కడమే తరువాయి. ఇక అది ఎప్పుడు వరిస్తుందో  ఇక కాలమే నిర్ణయించాలి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయం సొంతం చేసుకుని తిరిగి అధికారాన్ని చేజించుకుంది. ఈ నెల 13న ఆ పార్టీ అధ్యక్షుడు  కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో టీఆర్ ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కేసీఆర్ నడుం బిగించారు. అత్యంత నమ్మకస్తుడు, తనయుడు, సమర్ధుడైన వ్యక్తి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  ఆపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నియమించారు. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి, కాంగ్రేస్ బీజేపీ యేతర పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపధ్యంలో  ప్రభుత్వపరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను తుచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడైన కేటీఆర్కి పార్టీ బాధ్యతలు అప్పగించినట్టు కేసీఆర్ తెలిపారు.
పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానం:
పార్టీ అధ్యక్షులు తనపై నమ్మకంతో పార్టీ ప్రధాన భాద్యతలు అప్పగించినందుకు ఆయనకు ఋణపడి వుంటానని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృధ్దికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీకి ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా పని చేస్తానని పేర్కోనడం గమనార్హం. ఇకపోతే  పార్టీ  పటిష్టంగా వుంటే పది కాలాలు చల్లగా వుంటుందన్నట్టు, అప్పుడే ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం వుంటుంది. అసెబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ దిశగా టీఆర్ఎస్ పార్టీ అధినేత దృష్టి సారించలేదనే అపవాదు ఉంది. ఎన్నికల అనంతరం పార్టీ ని పటిష్ట పరిచే పనిలో బాగంగా పార్టీని ముందుడి నడిపించేందుకు పార్టీ వర్కింగ్ ప్రజిడెంట్ గా కేసీఆర్ తనయుడు కేటీఆర్ కి అప్పజెప్పడం పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం పెళ్ళుబికుంతుంది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే కేటీఆర్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళతారో వేచిచూడాలి.
టెక్నాలజీతో ముందుకు :
సహజంగానే ఐటి నిపుణుడైన కేటీఆర్ తన దైన శైలిలో ముందుకు తీసుకువెళతాడనే నమ్మకం పార్టీలో ప్రజల్లో విశ్వాసం వుంది. అందుకనుగుణంగా ఆ పార్టీ అధ్యక్షుడు నియమించిన  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  ఈ నెల 17న కేటీఆర్  భాధ్యతలు సీకరించనున్నారు. తదనంతరం పార్టీ పఠిష్టతకు చర్యలు తీసుకోనున్న కేటీఆర్ ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలను నూతన టెక్నాలజీతో అదునాతనంగా  నిర్మిచనున్నట్టు చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో నిత్యం జిల్లా నాయకత్వంతో టచ్లో ఉండచ్చనేది ఆయన ఆలోచన. దీంతో జిల్లాల్లో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలను సత్వర పరిషారంతో మరింత పఠిష్టం చేసే అవకాశం వుంటుందనేది ఆయన అంతరంగ ఆలోచన.
16 టార్గెట్...?
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్‌ స్థానాల్లో  16 పార్లమెట్ సీట్లను గెలుచుకునే దిశగా ఆపార్టీ ముందకు సాగుతోంది. ఎలాగు ఎంఐఎంతో లోపాయకార ఒప్పదం నేపధ్యంలో ఒక స్థానాన్ని ఆ పార్టీకి వదిలేసి మిగితా 16 స్థానాలు టార్గెట్ గా ముందుకు సాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీలను చేజిక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల ముందు హడావిడిగా అడుగులు వేయకుడా ఇప్పటి నుండే ప్రణాళికా బద్దంగా ముందుకు సాగితే విజయం దానంతట అదే వస్తుందనేది ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ ఋజువు చేశారు. తాజాగా అదే సూత్రాన్ని అమలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో ముందుకు సాగబోతున్నట్టు సమాచారం.
కృష్ణార్జునులు :
మహాభారతంలో కృష్ణార్జునుల పాత్ర మనకు తెలిసిందే. నూరు మంది కౌరవులతో మహాసంగ్రామంలో బావ కృష్ణుడి సారధ్యంలో అర్జునుడు యుధ్దం చేసి విజయం సాధించినట్టుగానే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో హారీష్ రావు కేటీఆర్ లే గులాబీ భాస్ డైరెక్షన్ లో నేటి తరం కృష్ణార్జునుల ఈ ఎన్నకల యుధ్దంలో టీఆర్ ఎస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. అంతే కాకుండా ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. పేరుకు తగ్గట్టుగానే పార్టీని నాయకులను సమన్వయ పరచి ముందుకు నడిపించడంలో సిద్ధహస్తుడు. ఇక కేసీఆర్ ఇటు రాష్ట్ర పరిపాలనతో పాటు  కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించనున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భాధ్యతలను కేటీఆర్ కి అప్పగించడంతో భారతంలో కృష్ణార్జునులు లాగా ఇక్కడ బావా, బావమరది ఇద్దరు టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయనున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.   కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై హర్షం వ్యక్తం చేసిన  హరీశ్ రావు భవిష్యత్ లో కేటీఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఇక నుండి  మరింత ఉత్సాహంతో కేటీఆర్ తాను కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరం కలిసి పని చేశాం. రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఇద్దరం కలిసి పని చేస్తామని హరీష్ రావు వెల్లడించడం కొసమెరుపు.
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.