(Local) Wed, 26 Feb, 2020

నాడు జీరో - నేడు హీరో

November 20, 2018,   2:35 PM IST
Share on:
నాడు జీరో - నేడు హీరో

నీళ్ళు నిధులు, నియామ‌కాల పేరుతో  ప్ర‌త్యేక తెలంగాణ కావాలంటూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  పోరాటాలు చేస్తున్న రోజులు అవి. ఏపీ మొత్తం అట్టుడుకుతున్న త‌రుణంలో నేను సైతం అంటూ నెల‌కు ఐదు ల‌క్ష‌ల జీతం వ‌దులుకుని ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. చ‌ట్ట స‌భ‌ల్లో త‌న గ‌ళాన్ని వినిపించాల‌ని అనుకున్న‌దే త‌డువుగా అత‌నికి తెలంగాణ రాష్ట్ర స‌మితి టికెట్ కేటాయించిది. దీంతో ప్ర‌జ‌ల విస్వాసాన్ని చూర‌గొనాల‌కున్నాడా యువ‌కుడు.  ప్ర‌జ‌లు  బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని ఆశించిన అత‌నికి చావు త‌ప్పి క‌న్ను లొట్ట పోయిన చందంగా కేవ‌లం వంద పై చిలుకు ఓట్ల తేడాతో ఓ స్వ‌తంత్ర అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి అంచుల దాకా వెళ్ళి బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు. అప్ప‌టికే తెలంగాణ ఉద్యమంలో ఆయ‌న తండ్రి ఓ వెలుగు వెలుగుతున్నాడు. కాని ప్ర‌జ‌లు ఆయ‌న‌ను పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకోలేదు. పోటీ చేసిన మొద‌టి రోజుల్లో అలాంటి క్లిష్ట ప‌రిస్థితులను ఎదుర్కొన్న  అత‌ను నేడు ఉద్యమ పార్టీని న‌డిపే నాయ‌కుడై అంద‌రిని శాశిస్తున్నాడు. ఇంత‌కి అత‌నెవ‌రో ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుంద‌నుకుంటా... ఇత‌నే తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల తార‌క రామా రావు. ఉన్న‌త చ‌దువుల నిమిత్తం అమెరికాలోని సిటీ యూనివ‌ర్సిటీ ఆఫ్ న్యూయార్ నుంచి మేనేజ్‌మెంట్ అండ్ ఈ-కామ‌ర్స్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. అనంత‌రం అమెరికాలోని ఇంట్రా అనే సంస్థ‌లో ఐదేళ్ళ పాటు ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌గా చేశాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఉర్ధూ భాష‌ల‌లో అన‌ర్గ‌లంగా మాట్లాడ‌గ‌ల‌డు.

రాజ‌కీయ ప్ర‌స్థానం :

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డాలంటూ నిర‌స‌నలు తెలుపుతూ  తెలంగాణ రాష్ట్ర స‌మితి  అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఇచ్చ‌న పిలుపు మేర‌కు నాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు . ఈ నేపథ్యం లో అప్పుడు క‌రింన‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో త‌న తండ్రి గెలుపు కోసం ఆయనకీ తెలియ‌కుండా నెల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల జీతం వ‌చ్చే ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఆయన  గెలుపుకు  కృషి చేశారు ఆ తరువాత జరిగిన పరిణామాలతో అనూహ్యంగా ,అన‌తి కాలంలోనే టీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌గ్గాలు చేపట్టారు. అనంత‌రం 2009లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో పాత క‌రింన‌గ‌ర్ జిల్లా సిరిసిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వర్గం నుండి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. కాని అక్క‌డ నుండి ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న కెకె మ‌హేంద‌ర్ చేతిలో 171 ఓట్ల కొద్ది పాటి మెజార్టీతో గెలిచారు.  నాడు అత్య‌ల్ప మెజార్టీతో గెలిచిన కేసీఆర్ నేడు సిరిసిల్లా నియోజ‌క వ‌ర్గంలో ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడుగా ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత త‌న‌యుడిగా ఉండి కూడా పార్టీలో క‌ష్ట ప‌డుతూ అంచెలంచెలుగా ఎదిగారు. 2014లో తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కైవ‌శం చేసుకోవ‌డంతో తొలి సారిగా మంత్రి ప‌ద‌వి ఆయ‌న‌ను వ‌రించింది. ఇన్ఫర్మేషన్  టెక్నాల‌జీ, మున్సిప‌ల్ శాఖ‌ల మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న హైద‌రాబాద్ న‌గ‌రాన్ని సాఫ్ట్ వేర్ రంగంలో, ఇటు ప‌ట్ట‌ణ అభివృధ్ధిని ప్రగతి ప‌థంలో ప‌రుగులు పెట్టిస్తూ యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఆయ‌న ఆజ్ఞ లేనిదే చీమ కూడా క‌ద‌ల‌దంటే అతిశ‌యోక్తి లేదు.  నేడు తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి, భ‌విష‌త్‌ ముఖ్య‌మంత్రి అనే స్థాయికి ఎదిగారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.