(Local) Fri, 05 Jun, 2020

అభ్యర్థులు నచ్చకపోతే నోటా నొక్కు

November 16, 2018,   12:36 PM IST
Share on:
అభ్యర్థులు నచ్చకపోతే నోటా నొక్కు

 -  ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్‌ కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకోవ‌చ్చు.
   

 ఓటు అనే ఆయుధంతో మ‌న దేశ‌ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది… వ్యవస్థ మార్పు కు నాంది పలుకుతుంది. ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు న‌చ్చ‌క‌పోతే నోటా కే మీ ఓటు వేయండి.  సుప్రీం కోర్టు ఓట‌రుకు క‌ల్పించ‌న బ్ర‌హ్మ‌హ‌స్త్రం ఇది. పోటీలో ఉన్న అభ్య‌ర్థులు ఎవ‌రు న‌చ్చ‌క పోయిన  ఎవ‌రికో ఒక‌రికి ఓటు వేసి రావ‌ల్సిందే, లేదా ఓటు హ‌క్కు వినియోగంచు కోకుండా ఉండాల్సి వ‌చ్చేది, ఇది గ‌తం, ఇప్పుడు అలా లేదు. ఓటు హ‌క్కును వినియోగించుకునే అధికారం ఓట‌రుకుంది. దాన్ని కాల‌రాసే అధికారం ఎవ‌రికి వుండ‌దు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  2014 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి కేం ద్ర ఎన్నికల సంఘం నోటా అవకాశాన్ని ఓటర్లకు అం దుబాటులోకి తెచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్రభుత్వాలు కానీ, ఎన్నికల సంఘం కానీ, స్వచ్చంద సంస్థలు కానీ దీనిపై ప్ర‌జ‌లకు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌ణ‌ క‌ల్పించ‌డం లేదు. సరైన ప్రచారం లభిస్తే  ఎన్నికలలో నిలబడిన అభ్యర్థుల‌కు ఇక తిప్ప‌లు త‌ప్ప‌వు.
నాయ‌కుల‌ను ఎన్నుకునేట‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు ఇక అవ‌గాణ‌హ వుండాలి అన్నాడు ప్రజాకవి కాళోజీ.. ఎన్నికల సంద‌ర్భంగా ప్రజాస్వామ్యంలో వచ్చిన మార్పు ఆయన మాటల్ని నిజం చేస్తున్నాయి. ఓటు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది… వ్యవస్థ మార్పు కు నాంది పలుకుతుంది. కానీ ఓటు విలువ చాలా తక్కువ మందికి తెలుసు. ఓటర్లకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరికో ఒకరికి ఓటు వేయా లనే ఉద్దేశంతో ఓటు వేస్తున్నారు. చాలాసార్లు ఎన్నికలలో నిలబడిన అభ్య ర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే వోటింగ్‌కు దూరంగా ఉండడం జరుగుతోంది. దానివలన కొన్నిసార్లు నిజ మైన అభ్యర్థికి  నష్టం జరిగే అవకాశం ఉంది, దీంతో రౌడీలు గుండాలు అందలం ఎక్కే పెను ప్రమా దం పొంచి ఉంది. వీటన్నిటికీ సరైన మందు ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ది ఎబౌవ్‌). 2014కు ముందు వరకూ మన దేశంలో అభ్యర్థులను తిరస్కరించే అవకాశం లేకుండా పోవడంతో తప్పనిసరిగా ఎవరినో ఒకరిని ఎన్నుకోవ‌ల్సిన‌ పరిస్థితి దాపురించేది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  2014 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి కేం ద్ర ఎన్నికల సంఘం నోటా అవకాశాన్ని ఓటర్లకు అం దుబాటులోకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 1.1శాతం (60 లక్షలు) ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ప్రాధాన్యం విస్తతంగా పెరుగుతూ వచ్చింది. చివరకు విజేతకు, ఓడిపోయిన అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల వ్య త్యాసం కంటే కూడా ఎక్కువ ఓట్లు నోటాకు పోలవు తున్నాయి. ఇప్పుడు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణ యించేంత కీలకంగా నోటా మారిపోయింది. నోటా ద్వారా తమ తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో నిల బడిన అభ్యర్థులకు పడిన ఓట్లకన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే అక్కడి గెలుపు చెల్లదు. ఆ నియోజక వర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ  జ‌రుగుతుంది, ఎన్నికల నోటి ఫికేషన్‌ ఇవ్వవలసి ఉంటుంది. అయితే నోటా అనే  బ‌ట‌న్ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంపై ఉన్నదనే విషయం  ఓటరుకు స‌రిగా తెలియదు. ఓటరు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లగానే ఈవీఎంలపై వివిధ పార్టీ లకు చెందిన గుర్తులే కనిపిస్తాయి. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటువేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటర్లకు అవకాశం కల్పిం చిన నేప‌థ్యంలో  అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా గుర్త‌ను  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎం) పొందుపరిచారు .ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓట ర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్య మైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా  అందుబాటులోకి వచ్చింది.   దీనిని ప‌లుపార్టీలు, ప్రభుత్వాలు వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీ ఎల్‌ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దా ఖలు చేసింది. దానిపై స్సందించిన  సుప్రీంకోర్టు‘నోటా’ను అమ లులోకి తేవాలంటూ  2013 సెప్టెంబర్‌ 27న రూలింగ్‌ ఇచ్చింది.

 నోటా ఉందనే విషయం నిర‌క్ష‌రాస్యుల‌కు సైతం తెలిసేలా  ఏదైన గుర్తు కేటాయిస్తే బా గుంటుందని  ప్రముఖ రచయిత సౌదా అరుణ హైకో ర్టులో ‘పిల్‌’ దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు, ‘నోటా’కు క్రాస్‌ గుర్తు కేటా యించాలని, ఎన్నికల కమిషన్‌కు సూచించింది. 2015 సెప్టెంబర్‌ నుంచి దీనికి క్రాస్‌ గుర్తును కూడా ఖరారు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్‌ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది.

 ఢిల్లీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం రాష్ట్రా లకు  గ‌తంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు ‘నోటా’కు ఓటువేశారు. కొన్నిచోట్ల గెలుపొందిన అభ్య ర్థికి, ఓటమి పాలైన సమీప ప్రత్యర్థికి నడుమనున్న ఓట్ల వ్యత్యాసం కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు పడ్డా యి. ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’కు అత్యధికంగా 3.1 శాతం ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో 2 శాతం, ఢిల్లీలో 1 శాతం నోటాకు ఓట్లు పోల‌య్యాయి. రాజ్యాంగం ప్ర‌జ‌ల‌కు కల్పించిన ఓటు హక్కును ప‌లు పార్టీలు,  నాయ‌కులు మాటలతో మైమరపించి, అరచేతిలో వైకుంఠం చూపించి సాధ్యం కాని వాగ్ధానాల‌తో  ఓట్లు దండుకుంటున్నారు. అనంత‌రం అధికారంలోకొ వ‌చ్చిన త‌రువాత‌  ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కి జ‌నానికి పంగ నామాలు పెట్టే అభ్యర్థుల పీక నొక్కే అవ‌కాశం నోటా ఓటింగ్‌తో  ప్ర‌జ‌ల‌కు ద‌క్కింది.
 ప్రజాస్వామ్యంలో ఓటే ప్రధాన ఆయుధం. ప్రజ లు ఓటేస్తే వారు  గెలుస్తారు. వేయకపోతే ఓడిపోతారు. మరి తిరస్కరిస్తే.. చెల్లకుండా పోతారు. ఇప్పుడు చెల్లని ఓట్ల కంటే కూడా చెల్లని అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఈవీఎమ్‌ల పుణ్యమా అని  ప్రజలకు ఈ మహదవకాశం దక్కింది.


ఎన్నిక‌ల్లో పోటీ చేసే వారెవరూ వద్దనుకునే అవకాశం రావడంతో జనం నోటా బాట పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉన్న అభ్యర్థులకు పోల‌యిన ఓట్ల‌ కంటే ‘నోటా’ కు ప‌డిన‌ ఓట్లే ఎక్కువగా ఉన్న దాఖ లాలూ ఉన్నాయి. అయితే నోటా తో ఇంత మంచి జరుగుతున్నా ఎందుకో ప్రభుత్వాలు కానీ, ఎన్నికల సంఘం కానీ, స్వచ్చంద సంస్థలు కానీ దాని గురించి ఎక్కువ ప్రచా రం చేయ‌డం లేదు. దీనిని  మ‌రింత లోతుగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళితే స‌రైన నాయ‌కుల‌ను ఎన్నుకునే అవ‌కాశం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పోల‌యిన ఓట్ల‌ కంటే నోటాకు ఎక్కువ వోట్లు పోల‌యితే అక్క‌డ‌ ఎన్నిక చెల్ల కుండా పోతుంది. అలా ప్ర‌జ‌ల చేత తిర‌స్కారాని గురైన  అభ్యర్థులకు  కనీసం 6 సంవత్సరాలు ఎటువంటి ఎన్నికలలో నిలబడే అర్హత లేకుండా శిక్షవిధిస్తే అపుడు తప్పుడు హామీలు, అలవిమాలిన వాగ్దానాలు ఇచ్చే పార్టీలకు నాయ‌కుల‌కు చెంప పెట్టు లాంటింది .అందుకే నోటా వేటు పడకూడదనుకుంటే నోటిమాటకు విలువ ఇవ్వాల్సిందే,  చేసేదే చెప్పాలి, నిజాయితీని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఓటు మాట ఎలా ఉన్నా ముందు నోటా బారిన పడ కుండా తమ పరువు  కాపాడుకోవాల్సిన అగత్యం ఇప్పుడు అన్ని రాజ‌కియ పార్టీల అభ్యర్థులకూ ఏర్పడింది. ప్రజా స్వామ్యంలో ఏదైనా చేయవచ్చు  అనుకునే నాయ‌కుల‌కు నోటా పోటు ఓ గుణపాఠం అవుతుంది. 

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.