(Local) Fri, 05 Jun, 2020

నాడు ఆవేశం నేడు ఆలోచ‌న !

November 12, 2018,   3:49 PM IST
Share on:
నాడు ఆవేశం నేడు ఆలోచ‌న !

తెలుగు ప్ర‌జ‌ల‌కు త‌న‌ వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిచాల‌నే త‌లంపుతో ఓ యువ నాయ‌కుడు త‌న ఆవేశాన్ని త‌గ్గించుకుని  ఆలోచ‌నల‌కు ప‌దును పెడుతున్న తీరు అమోఘం. ఆప‌ద‌లో ఉన్న వారికి ఒక అన్న‌య్య లాగా వారి కుటుంబానికి ఆప‌ద్భాంధ‌వుడు అవుతున్నాడు. ఎంత‌టి వారినైనా ఎదిరించే నైజం అత‌ని సొంతం. అన్యాయాలు, అక్ర‌మాల‌ను అడ్డుకునే యువ నేత. పాల‌కులు తప్పులు చేస్తే  ర‌గిలిపోయే ఆవేశంతో నిజాల‌ను నిగ్గు తేల్చే ధీర‌త్వం. 130 సంవ‌త్సాల చ‌రిత్ర గ‌ల కాంగ్రేస్ నాయ‌కుల‌ను పంచ‌లూడ‌దీసి తంతాన‌ని పిలుపు నిచ్చిన ధైర్య‌శాలి. నాయ‌కుల‌ను నిల‌దీసి ప్ర‌శ్నించే అల‌వాటుని ప్ర‌జ‌ల‌కు నేర్పించిన యువ సేనాధిప‌తి  జ‌న సేనా పార్టీ అధినేత యువ నాయ‌కుడు ప‌వ‌ణ్ క‌ళ్యాన్ పై ప్ర‌త్యేక క‌థనం.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఓ మారు మూల గ్రామంలోని పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంలో1971 సెప్టెంబ‌ర్ 2 న‌జ‌న్మించిన ఆయ‌న త‌న బాల్య జీవితంలో ఎవ్వ‌రిని ప‌ల్లెత్తు మాట అనేవాడు కాదు. త‌న అన్న తెలుగు చిత్ర సినీ రంగంలో అగ్ర హీరో కావ‌డంతో స‌హ‌జంగానే అత‌ను ఆరంగం వైపు ఆక‌ర్షితుల‌య్యారు. అన్న‌కు మించిన త‌మ్మ‌డిలా సినీ రంగంలో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నా తెలుగు ప్ర‌జ‌ల‌కు త‌న వంతుగా ఏమీ చేయ‌లేక పోతున్నాన‌నే అసంతృప్తి మ‌రో ప్ర‌క్క‌న ఈ తరుణంలో అన్న మెగాస్టార్ ప్ర‌జారాజ్యం పార్టీని 2008 అగ‌ష్టు 26న తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌క‌టించారు. నాటి నుండి ఆ పార్టీలో అన్నకు చేదోడువాదోడుగా ఉంటూ ప్ర‌జారాజ్యం పార్టీ  యువసేనా అధ్య‌క్షుడుగా ప‌ద‌వీ భాద్య‌త‌లు చేప‌ట్టి పార్టీని అంచెలంచెలుగా అభివృధ్ధి చేస్తూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైనాడు. వారి క‌ష్ట సుఖాలు తెలుసుకుంటూ  వారికి భ‌రోసానిస్తూ  అన్న వెన్నంటి న‌డిచారు. కాని అనుకోని ప‌రిస్థితుల్లో ప్ర‌జారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్ర‌స్‌లో విలీనం చేయ‌డం ఇష్టం లేక  బ‌య‌ట‌కి వ‌చ్చారు.

జ‌న‌సేనా ప్ర‌స్థానం :

         సామాన్యుల‌ అభివృధ్దికి కృషి చేయాలంటే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి  రావాల‌నే తలంపుతో ఇది సామాన్యుడి సేన ప్ర‌తి ఒక్క‌రి సేన ఇది మ‌న సేన జ‌న‌సేన అంటూ తెలుగు నాట జ‌న‌సేనా అనే రాజ‌కీయ పార్టీకి బీజం వేశాడు.  హైద‌రాబాద్ లోని  మాదాపూర్ లో గ‌ల  ఇంట‌ర్‌నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో 2014 మార్చి 14న అభిమానుల మ‌ధ్య‌న జ‌న‌సేనా పార్టీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి జాతీయ నాయ‌కుల‌ను సైతం త‌న వ‌ద్ద‌కు ర‌ప్పించుకున్న యువ ఉద్దండుడు. 2014 లో జ‌రిగిన అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా పార్టీ బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తూనే ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ , తెలుగు దేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌చారం నిర్వ‌హించి ఇటు  రాష్ట్రంలో టీడీపి పార్టీని, అటు కేంద్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేశాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే పంచ‌భ‌క్షాల‌తో కూడిన స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామ‌ని చెప్పి ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక అన్ని రాష్ట్రాల‌కు సాధార‌ణంగా  ఇచ్చే నిధులలానే ఏపికి  ఇస్తూ వాటికి స్పెష‌ల్ స్టేట‌స్ అనే ముసుగు తొడిగి రెండు  పాచిపోయిన ల‌డ్డూల‌ను చేతిలో పెడ‌తారా అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడిని సైతం తూర్పారబ‌ట్టాడు. ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ఆంధ్రుల హ‌క్కు అంటూ రాష్ట్ర అభివృధ్దే త‌మ నినాదం అంటూ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. 2019లో ఆధ్ర‌ప్ర‌ధేశ్ ఎన్నిక‌ల్లో 175 స్థానాల‌కు పోటీ చేస్తామ‌ని 2018 మే 2న  ప్ర‌క‌టించి ఆ పార్టీ నాయ‌కుల్లో ఉత్సాహాన్ని నింపాడు. 2019లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనా పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుపోతూ రాష్ట్రంలో దూసుకుపోతున్నాడు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.