(Local) Fri, 05 Jun, 2020

నాడు ముద్దు - నేడు వద్దు

November 19, 2018,   1:11 PM IST
Share on:
నాడు ముద్దు - నేడు వద్దు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) ఈ పేరు వింటేనే  అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల్లో గుండెల్లో రైళ్ళు పరుగెడుతాయి. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు. అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రులైనా,  దేశ ప్రధాని అయినా అరెస్టు చేసి వారిని  జైలుకు పంపిస్తుంది. అంతటి అధికారాలు ఈ సంస్థ సొంతం. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని అధికారాలు  తెలిసిన ఏపీ సీయం కుంటి సాకులు చెబుతూ సీబీఐకి సాదారణ అనుమతులు నిలిపి వేస్తున్నట్టు ఇటీవల ప్రకటిచారు. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో ఉన్నప్పుడు మరో విధంగా మాట్లాడటం నక్క జిత్తుల మారి తనాన్ని అర్థం చేసుకోవచ్చని  పలువురు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆధ్రప్రధేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో  తండ్రి  పదవిని అడ్డు పెట్టుకుని  వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు  సంపాదించాడని దానిపై సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలని  ఆరోపించిన సంగతి తెలిసిందే..  పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి నిందితుడని  తెలుగు దేశం నాయకులు ఆరోపణలు చేశారని, దీనిపై  సీబీఐ చేత ధర్యాప్తు జరిపించాలని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాడ్ చేయగా రాజశేఖర రెడ్డి సీబీఐ చేత విచారణ జరింపించారని,  ఏ తప్పూ చేయనప్పుడు ఏ దర్యాప్థు సంస్థకు బయపడాల్సిన అవసరం లేదని నాటి సీయం రజశేఖర రెడ్డి నిరూపించారని వారు గుర్తు చేస్తున్నారు.
పవన్ కళ్యాన్ ఆరోపణలతో అప్రమత్తం :
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు తనయుడు ఇన్ఫ‌ర్‌మేష‌న్ టెక్నాల‌జీ, పంచాయితీ రాజ్ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ అవినీతిలో కూరుకుపోయారని, రాజధాని పేరుతో పేద రైతుల భూములు లాక్కొని అక్కమంగా కోట్లు సంపాదించారని ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆరోపించిన నేపథ్యంలో చంద్రబాబు అప్రమత్తం అయ్యరనడానికి ఇదే నిదర్శనం అనే  గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆద్రప్రదేశ్ లోని  పలువురు కాంట్రాక్ట‌ర్‌ల ఇళ్ళలో సీబీఐ దాడులు  జరుగుతున్న తీరు, అలాగే తెలుగు దేశం ఎంపి సీఎం రమేష్ , అత‌ని బందువుల ఇళ్ళ‌లో సీబీఐ దాడులు జ‌రిగిన‌ ఉదంతంతో బేంబేలెత్తి పోయిన బాబు తన తనయుడి పై  వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడిని రక్షించుకునేందుకే ఈ డ్రామాలని పలువురు ఆరోపిస్తున్నారు.
జ‌గ‌న్ పై దాడి ఉదంతం :
ప్రతిపక్షనేత జ‌గ‌న్‌పై హత్యాయత్నం వెనుక అధికార పార్టీ పెద్దల కుట్ర దాగి ఉందనే అనుమానాలు అందరిలోనూ బలపడ్డాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ (థర్డ్‌ పార్టీ)తో విచారణకు ఆదేశించి హత్యాయత్నం వెనుక కుట్రదారులను వెలికి తీయాలని కోరుతూ ప్రతిపక్ష నేత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్‌కు కూడా ఈమేరకు వినతిపత్రం అందించారు. దీంతో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తే తమ బండారం బయటపడుతుందని బెంబేలెత్తిన టీడీపీ పెద్దలు దీన్ని అడ్డుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయించినట్లు కనిపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేస్తూ ఎత్తుగడ వేశారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 
అవినీతి పెరిగే ప్ర‌మాదం:
అంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యానికి దేశం లోని  ప‌లు రాష్ట్రాలు మ‌ద్ద‌తు తెలుపుతున్న త‌రుణంలో దేశంలో అవినీతి మ‌రింత‌గా పెరిగే ప్ర‌మాదం వుంటుంద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారంలోని రాష్ట్రాలు మ‌ధ్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్‌ఘ‌డ్ లాంటి రాష్ట్రాలు సైతం సాధార‌ణ అణుమ‌తుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం చూస్తుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఏది ఏమైనా సీబీఐ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన  సంస్థ  అని  ‘కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాల్లో అక్రమాలు జరిగితే కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుంది. కేసును ఢిల్లీలోనే నమోదు చేస్తారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఏ రాష్ట్రానికైనా వెళ్లి ఎవరినైనా అదుపులోకి తీసుకుని అరెస్టు చేయవచ్చు’ అని పేర్కొన్నారు. ‘సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుంది. అలాగే రాష్ట్రం కోరకపోతే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం కేంద్రానికి లేదనుకోవడం పొరపాటే అవుతుంది. న్యాయస్థానాలు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తును ఎవరూ ఆపలేరు. ఇందుకు పలు ఉదాహరణలున్నాయి. కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలపై సీబీఐ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోలేవు అని స్పష్టం చేయ‌డం  కొస మెరుపు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.