(Local) Mon, 22 Jul, 2019

టెస్ట్ ఓటుపై ఎన్నికల సంఘం పరిశీలన

June 06, 2019,   1:57 PM IST
Share on:

టెస్ట్ ఓటుపై ఇప్పుడున్న శిక్షల నిబంధనను ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల దశ ముగిసింది. ఇప్పుడు ఈ నిబంధన సడిలింపు, సవరణ ఇతరత్రా అంశాలపై సమీక్షించుకుంటామని అరోరా పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఇవిఎంలు, లేదా వివిప్యాట్ యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదని ఓటరు చేసే ఫిర్యాదు తప్పని తేలితే ఇప్పటి నిబంధనల మేరకు ఫిర్యాదీలపై ఐపిసి 177 అధికరణ ప్రకారం ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవచ్చు, ఫిర్యాదు చేసినందుకు చర్యలు వాంఛనీయం కాదనే ప్రశ్నపై సిఇసి స్పందించారు. అన్ని అంశాలను తాము పరిశీలిస్తామన్నారు.

ఓటరు తాను వేసిన ఓటు ఇవిఎం కానీ పేపర్ ట్రయల్ మిషన్ కానీ సరిగ్గా నమోదు కావడం లేదని భావిస్తే , దీనిపై ఫిర్యాదు చేసుకోవచ్చు.అప్పుడు ఇవిఎం, వివిప్యాట్ల పనితీరును తేల్చేందుకు ఆ ఓటరుకు ఎన్నికల నిబంధనల్లోని 49 ఎంఎ రూల్ ప్రకారం టెస్ట్ ఓటు ద్వారా అవకాశం కల్పిస్తారు.ఈ క్రమంలో యంత్రాల పనితీరు సరిగ్గా ఉందని వెల్లడైతే ఫిర్యాదీ చిక్కుల్లో పడతారు. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.