(Local) Sat, 19 Oct, 2019

నీట్ 2019 ఫలితాలు : తెలంగాణకి జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు

June 06, 2019,   1:49 PM IST
Share on:
నీట్ 2019 ఫలితాలు : తెలంగాణకి జాతీయ స్థాయిలో 7వ ర్ ...

వైద్య విద్య ప్రవేశాల కోసం గత నెల 5న నిర్వహించిన నీట్ జాతీయ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన నళిన్ ఖందేల్వాల్ 720 మార్కులకు గాను 701 మార్కులతో 99.99 పర్సంటైజ్తో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంకు ఢిల్లీకి చెందిన భావిక్ బన్సాల్, మూడో ర్యాంకులో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అక్షత్ కౌశిక్ నిలిచారు. ఇద్దరూ 700 మార్కులే సాధించారు.నీట్ ఫలితాలలో తెలుగు విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.జి.మాధురిరెడ్డి 695 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 7వ ర్యాంకుతోపాటు దేశవ్యాప్తంగా బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా దాదాపు సగం మందే ఉత్తీర్ణత సాధించారు. నీట్ పరీక్షకు మొత్తం 14,10,754 మంది విద్యార్థులు హాజరుకాగా, 7,97,042 మంది విద్యార్థులు (56.27 %) అర్హత సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 72,083 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 68.88 శాతంతో 33వేల 44 మంది , ఆంధ్రప్రదేశ్ నుంచి 72.55 శాతంతో 39వేల 39 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.