(Local) Wed, 24 Jul, 2019

తెలంగాణ ఇంటెర్ బోర్డు మరో నిర్వాకం

June 06, 2019,   3:52 PM IST
Share on:

తెలంగాణ ఇంటర్ బోర్డు  ఫలితాల్లో అక్రమాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, తప్పుడు మార్కులు, ఆపై వివరణలతో ఇప్పటికే గందరగోళం నెలకొనగా తాజాగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన రెండు ప్రశ్నపత్రాలు గల్లంతయ్యాయి. ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని బోర్డు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా రహస్యం బాటకు పొక్కింది. దీంతూ ఆందోళన చెలరేగడంతూ అప్పటికప్పుడు పోలీస్ విచారణకు ఆదేశించింది.

వరంగల్‌ పట్టణం మిల్స్‌ కాలనీ పోలీసు రక్షణలో ఉన్న ఈ ప్రశ్నపత్రాలు ఎప్పుడు? ఎలా పోయాయో? ఎవరికీ తెలియడంలేదు. రెండు రోజుల క్రితమే ఈ విషయాన్ని గుర్తించినప్పటికీ అటు పోలీసు శాఖ, ఇటు ఇంటర్‌ బోర్డు రహస్యంగా ఉంచటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కోసం ఫిబ్రవరిలో ప్రశ్న పత్రాలను తరలించారు.

ప్రశ్న పత్రాల పెట్టెలు కన్పించకుండా పోయిన విషయాన్ని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ బుధవారం ధ్రువీకరించారు. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొత్తసెట్ల ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.