(Local) Mon, 17 Jun, 2019

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కేందుకు సిద్దమైన తాండూర్ ఎమ్యెల్యే

June 06, 2019,   2:28 PM IST
Share on:

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌తో కాంగ్రెస్‌ తాండూర్‌ ఎమ్మెల్యె పైలట్‌ రోహిత్‌రెడ్డి ఈరోజు ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు.టిఆర్‌ఎస్‌లో చేరతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు కెటిఆర్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యె రోహిత్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కేందుకు సిద్ధమయ్యారు, ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో చర్చలు జరిపిన రోహిత్ రెడ్డి
కెటిఆర్‌తో భేటీ అయ్యారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.