(Local) Wed, 18 Sep, 2019

అమ్మకాల జోరు తగ్గిన టీవీ

August 17, 2019,   11:11 AM IST
Views: 80
Share on:
అమ్మకాల జోరు తగ్గిన టీవీ

రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ ఎఫ్ఎంసిజి తాజాగా టెలివిజన్ తయారీ రంగం నుంచి మందగమన సంకేతాలు వస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి 20 శాతానికి పైగా అభివృద్ధి సాధిస్తూ వచ్చిన ఈ రంగం గత ఏడాదిలో మాత్రం విక్రయాల విలువలో కేవలం 3 శాతం వృద్ధి మాత్రమే కనబరిచింది. యూనిట్ల విక్రయం పరంగా ఎలాంటి పురోగతి కనబరచలేదు. ఈ ఏడాదిలోనే అయితే పరిస్థితి మరింత దిగజారి, జనవరి మార్చి కాలంలో టీవీల రిటైల్ విక్రయాలు 15- 20 శాతం మేర, ఏప్రిల్- జూన్ కాలానికి 10 -20 శాతం మేరకు కనబరిచాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో ప్రభుత్వం 32 అంగుళాల వరకు సైజు టీవీ ల పై జిఎస్టి తగ్గించిన దానికి తోడు భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న అమ్మకాలు తగ్గుతుండటం పరిశ్రమ కలవరపెడుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సేవలకు దేశంలో డిమాండ్ వేగంగా పెరుగుతుండడంతో భారీ సైజు టీవీలో విక్రయాలకు గిరాకీ పెరుగుతోంది. ఇండస్ట్రీ భావించిన అది జరగలేదు అంటున్నారు. సాధారణంగా క్రికెట్ వరల్డ్ కప్ సీజన్లో భారత్ లో టీవీల విక్రయాలు పెరుగుతుంటాయి. కానీ ఏడాది జూలైలో ముగిసిన వరల్డ్ కప్ మాత్రం టివి విక్రయాలను నిరాశపరిచింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.